TDP Alliance: కూటమికి 125 సీట్లు పక్కా: రఘురామకృష్ణంరాజు
125 నుంచి 150 స్థానాల్లో కూటమి గెలుస్తుం దని ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రజా దీవెన, తిరుపతి: 125 నుంచి 150 స్థానాల్లో కూటమి గెలుస్తుం దని ఎంపీ రఘురామ కృష్ణంరాజు ( Raghuramakrishnan Raju) ఆశాభావం వ్యక్తం చేశారు. శుక్రవా రం ఉదయం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుం బంతో సహా అభిషేక సేవలో పాల్గొ ని మొక్కులు తీర్చుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రోజు లు రావాలని, ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు(Chandrababu naidu) ప్రమా ణస్వీకారం చేయాలని స్వామి వారి ని కోరుకున్నట్లు తెలిపారు. వైసీపీ 25 నుంచి 40 సీట్లకే పరిమితం అవుతుందని రఘురామ జోష్యం చెప్పారు. సీఎం జగన్(CM Jagan mohan reddy) మాట నిజమవుతుందో లేక తన మాట నిజమవుతుందో జూన్ 4వ తేదీన తెలుస్తుందన్నారు.
125 seats for alliance: Raghuramakrishnan Raju