Andhra cabinet sworn: నవ్యాంధ్రప్రదేశ్ ను నవశకం దిశగా నడిపిస్తాం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జయభేరి మోగించిన టీడీపీ -జన సేన-బీజేపీ ఎన్డీయే కూటమి బుధ వారం లాంఛనంగా కొలువుదీరింది.
ఏపీ ప్రభుత్వం ప్రమాణస్వీకారం సందర్భంగా మోదీ ట్వీట్
సీఎం చంద్రబాబుతో సహా 24 మంది మంత్రుల ప్రమాణ స్వీకారం
ప్రజా దీవెన, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో(Andhra Pradesh assembly elections) జయభేరి మోగించిన టీడీపీ -జన సేన-బీజేపీ ఎన్డీయే కూటమి బుధ వారం లాంఛనంగా కొలువుదీరింది. బుధవారం విజయవాడ వద్ద జరి గిన ప్రమాణ స్వీకారో త్సవంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా, పవ న్ కల్యాణ్, నారా లోకేశ్ సహా 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ నూతన ప్రభుత్వానికి ఆశీస్సులు అంద జేశారు. అనంతరం మోదీ సోషల్ మీడియాలో స్పందించారు.
నవశకం ఆరంభం.. ఏపీలో కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకార(New government swearing) వేడుకకు హాజరయ్యాను. ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబుకు, మంత్రులుగా ప్రమాణం చేసిన ఇతరులకు శుభా కాంక్షలు తెలియజేస్తున్నాను. ఏపీకి ఉజ్వలమైన భవిష్యత్తును అందిం చేందుకు, మరింత అభివృద్ధి దిశగా నడిపించేందుకు, టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి ప్రభుత్వం సంపూ ర్ణంగా కట్టుబడి ఉంది. యువత ఆశలను ఈ ప్రభుత్వం నెరవేర్చు తుంది.. అని ట్విట్టర్‌లో ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
మంత్రులుగా ప్రమాణం చేసింది వీరే.. ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీయే కూటమి(NDA Alliance) సర్కారు కొలువుదీరింది. ఏపీకి నాలుగోసారి ముఖ్యమం త్రిగా టీడీపీ(TDP President chandra babu naidu) అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. వేదికలో ముందుగా నిర్ణయించిన మూహూర్తం ప్రకారం 11:27 గంటలకు రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ చంద్రబాబుతో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. అలాగే 24 మంది సైతం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అలాగే దేశం నలుమూలల నుంచి సినీ, రాజకీయ ప్రముఖులతోపాటు వివిధ దేశాల రాయబారులు తరలివచ్చారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం సమయంలో సభా ప్రాంగణం జై చంద్రన్న.. నినాదాలతో మార్మోగింది. అనంతరం ప్రధాని మోడీతోపాటు వేదికపై ఉన్న పలువురు అతిథులు చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయు డుతో పాటు పవన్ కల్యా ణ్, నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, పి.నారాయణ, వంగలపూడి అనిత సత్యకుమార్ యాదవ్, నిమ్మల రామానాయుడు, ఎన్ఎండీ ఫరూఖ్, ఆనం రామనారాయణ రెడ్డి, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, డోలా బాలవీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేశ్, గుమ్మడి సంద్యారాణి, బీసీ జనార్దన్రెడ్డి, ఎస్.సవిత, వాసంశెట్టి సుఖాష్, కొండపల్లి శ్రీనివాస్ మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి, టీజీ భరత్ తదితరులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
రాజకీయ, సినీ ప్రముఖుల రాక.. చంద్రబాబు ప్రమాణ స్వీకా రోత్సవానికి దేశవ్యా ప్తంగా పలువు రు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. అమిత్ షా, నితిన్ గడ్కరీ, కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు, చిరాగ్ పాశ్వాన్, రాందాస్ అథవాలే, బండి సంజయ్, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహస్యా దవ్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, ఎంఆర్పీఎస్ వ్యవస్థా పక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తదితరులు హాజరయ్యారు.
సినీ ప్రముఖులు చిరంజీవి, రజినీకాంత్, రాంచరణ్, నాగబాబు తరలివ చ్చారు. సభ వేదికపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ పురందే శ్వరి, సీఎం సతీ మణి భువనేశ్వరి ఆసీనులు కాగా, ఈ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు, పవన్ కల్యాణ్ కుటుంబ సభ్యులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సభా వేదికపైకి వచ్చి అందరినీ పలకరించారు. అభిమా నులకు అభివాదం చేయడంతో జై బాలయ్య అంటూ సభా ప్రాంగణం మార్మోగింది.
Andhra cabinet sworn