Husband and Wife: భర్త ప్రాణాలు తీసిన భార్య వివాహేతర సంబంధం
వివాహేతర సంబంధానికి ప్రియురాలి భర్త అడ్డుగా ఉండడంతో అతడిని ప్రియుడు చంపిన సంఘటన ఆంధప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో జరిగింది.
అమరావతి: వివాహేతర సంబంధానికి ప్రియురాలి భర్త అడ్డుగా ఉండడంతో అతడిని ప్రియుడు చంపిన సంఘటన ఆంధప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గోటివాడ శివారు ప్రాంతంలోని సాలాపునివానిపాలెంలో సాలాపు శ్రీనివాసరావు(32), భాగ్యలక్ష్మి(couple) అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. దామోదారం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వ విద్యాలయంలో ఎలక్ట్రీషియన్ (Electrician) గా అతడు పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
అదే గ్రామంలో గళ్ల రవి(26)తో భాగ్యలక్ష్మీ పరిచయం కావడంతో ఇద్దరు మధ్య వివాహేతర సంబందానికి దారితీసింది. ఈ విషయం భర్తకు తెలియడంతో పలుమార్లు ఇద్దరు మధ్య గొడవలు జరిగాయి. పలుమార్లు పెద్ద మనుషుల సమక్షంలో దంపతులకు సర్ది చెప్పి కలిసి జీవించాలని సూచించారు. ప్రియురాలితో(lover) అక్రమ సంబంధానికి ఆమె భర్త అడ్డుగా ఉండడంతో అతడి హత్య చేయాలని రవి ప్లాన్ వేశాడు. శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో శ్రీనివాస్ పొలానికి నీరు పెట్టి వస్తుండగా రవి తన స్నేహితుడు శ్రీహరితో కలిసి అడ్డుకున్నారు.
ఇద్దరు కలిసి కర్రతో శ్రీనివాస్ తలపై బాదారు. పెద్దగా కేకలు వినపడడంతో గ్రామస్థులు అక్కడికి చేరుకునే సరికి అతడు రక్తపు మడుగులో కనిపించాడు. అప్పటికే నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయారని తెలిపారు. తన కోడలి రవితో తన కుమారుడిని హత్య చేయించారని స్థానిక పోలీస్ స్టేషన్ లో శ్రీనివాస్ తల్లి దండ్రులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం అనకాపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రవి, శ్రీహరిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. భార్య భాగ్య లక్ష్మీపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.
Andhra Pradesh Anakapalli Sabbavaram