Betting: పోయింది ఉన్నది ఉంచుకున్నది
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ఉత్కంఠ భరితoగా కొనసాగిన విషయం విదితమే. అవి కాస్తా అనేక ప్రాంతాల్లో సంచలనాలు సృష్టించిన విషయం కూడా తెలిసిం దే.
పందెం రాయుళ్ల నిలువు దోపిడి
పందెం కాసినోళ్ళంత పటాపంచ లైన వైనం
ఎన్నికల ఫలితాలు తారుమారు కావడంతో లబోదిబో
ఏకపక్ష ఫలితాలతో బికారులైన పలువురు పందెం రాయుళ్లు
ప్రజా దీవెన, అమరావతి: దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు(Parliament elections) ఉత్కంఠ భరితoగా కొనసాగిన విషయం విదితమే. అవి కాస్తా అనేక ప్రాంతాల్లో సంచలనాలు సృష్టించిన విషయం కూడా తెలిసిం దే. ఉత్కంఠ రేకెత్తించాయి. ఓట్ల లెక్కింపు (Andhra Pradesh Assembly election voting)అనంతరం ఫలితాలు కూటమికి ఏకపక్షంగా రావడం తో అనేక మార్గాల్లో పందె కాసిన అనేక మంది వికారులైన సంఘట నలు కోకోల్లలు. పందెం గెలిచిన వారు కూడా సొమ్ము అందక లబోదిబో మంటున్నారు. ఎవరికివారు తమ పార్టీ అభ్యర్ధులే విజయం సాదిస్తా రంటూ పందెం కాస్తే లక్షలకు లక్షలు అప్పనంగా సంపాదించవచ్చనే అత్యాశతో లక్షలాది రూపాయలు పందెం కట్టారు.
ఈ క్రమంలో కొంత మంది పందెం ఓడిపోయి ఉన్న ఆస్థులను అమ్ముకుని, బికారు లుగామారగా, మరికొంతమంది పందెం గెలిచి కూడా కట్టిన సొమ్ము చేతికి రాక అవస్థలు పడుతు న్నా రు. ఓట్ల లెక్కింపునకు ముందు చాలా మంది మధ్యవర్తుల వద్ద పందెం సొమ్ము కట్టారు. ఇరుపక్షాల కలసి పందెపు సొమ్మును మధ్యవర్తి దగ్గర ఉంచారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన తరువాత పందెం సొమ్ముకోసం వెళ్లిన వారికి మధ్య వర్తిత్వం వహించిన వారు కూడా అదృశ్యమవుతున్నారు.ఫోన్ చేస్తే స్విచ్ఛాప్ వస్తోంది. దీంతో లబోది బోమంటూ వెతుకులాట ప్రారంభిం చినా వారి జాడ కనిపించక పందెపు సొమ్ము రాక ఎదురు చూస్తున్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లోని(Andhra Pradesh ) దెందు లూరు నియోజకవర్గంలో నలుగురై దుగురు మద్యవర్తుల దగ్గర దాదా పు రూ.20 కోట్లకు పైగా పందెపు సొమ్ము ఉన్నట్లు చెబుతున్నారు.
ఒక వ్యక్తి రూ.ఐదుకోట్లతో పరార య్యాడని, తాను కట్టిన రూ.12.50 లక్షల నగదు, పందెంలో తనకు రావాల్సిన రూ.పది లక్షల మాటే మిటో అర్ధం కావడంలేదని ఒకరు చెప్పకనే చెబుతున్నారు. మద్యవ ర్తిని నమ్మి కోట్లలో సొమ్మును అతని వద్ద ఉంచితే అతను ఆ సొమ్మును వేరొక పందెంలో కాయడం, ఆ పందెం కాస్తా పోవడంతో అతడు పరారయ్యాడని అను కుంటు న్నారు. దీంతో పందెం(Betting) గెలిచిన వ్యక్తులు కూడా సొమ్ము చేతి కందక అవస్థలు పడుతున్నారు. అప్పుచే సి పందెం కాశామని ఒకరు, పది రూపాయల వడ్డీకి తెచ్చామని మరొకరు, బంగారు ఆభరణాలు తాకట్టుపెట్టిన సొమ్ముతో పందెం కట్టామని ఇంకొకరు భూమి పత్రా లను తనఖా పెట్టామని వేరొకరు.. ఇలా పలువురు తమ గోడు వెళ్ళ బోసుకుంటున్నారు. మద్యవర్తి వచ్చిన తర్వాతైనా ఆ సొమ్ము వస్తుందనే గ్యారంటీ లేదని పందె పురాయుళ్ళు వాపోతున్నారు.
పందెం గెలిచికూడా సొమ్ము పోగొ ట్టుకోవడం అంటే అంతకంటే దుర దృష్టం ఇంకొకటి ఉండదని ఒకరి నొకరు ఓదార్చుకుంటున్నారు. కాగా పందెం సొమ్ము తన దగ్గర పెట్టుకు న్న మధ్యవర్తుల్లో ఇద్దరు, ముగ్గురు బలవన్మరణానికి పాల్పడ్డారని సమాచారం వారి దగ్గర పెట్టిన సొమ్ము ఇక రానట్లేనని పందెపు రాయుళ్లు దిగాలు పడుతున్నారు. పెదవేగి మండలానికి చెందిన ఒకరు తన దగ్గర పెట్టిన పందెపు సొమ్ము ను మరొక పందెంలో పెట్టి మొత్తం పోగొట్టుకున్నట్లు తెలిసింది. సొమ్ము తిరిగి ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో పరారయ్యాడు. ఐదురోజుల తరు వాత తిరిగొచ్చిన అతడు తనకున్న రెండెకరాల భూమిని విక్రయించి, పందెం సొమ్మును కట్టడతానని పెద్దల సమక్షంలో ఒప్పందం జరిగి నట్లు సమాచారం.
2019లో జరిగిన ఎన్నికల్లోనూ(Mediators) మద్యవర్తుల మాయా జాలంతో ఒక కుటుంబం మాటకు కట్టుబడి వారి ఆస్తులను విక్రయిం చి, కుదేలయ్యారు. ఆరోజున ఆ కుటుంబం నేను ఇవ్వను అంటే చేసేది ఏమీ లేదని, కానీ మధ్య వర్తికి సొమ్ము ఇప్పించే విషయంలో ఆ కుటుంబం మొత్తం ఆస్తులను పోగొట్టుకుంది. ఇలా పందేలు ఎంతోమంది జీవితాలను సర్వనా శనం చేశాయి. తాజా ఎన్నికల్లో దెందులూరు నియోజకవర్గంలో తన స్థాయిని మించి పెందేలు కాసి, పందేలు ఓడి, సొమ్ము కట్టలేక ము గ్గురు ఆత్మహత్యకు పాల్పడడం కడు విషాద సంఘటనలుగా అభివర్ణిస్తున్నారు.
Andhra Pradesh Assembly election betting