Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Nara brahmani: సమర్థుడైన పాలకునితో సుపరిపాలన

సమర్థు డైన పాలకుడు ఉంటేనే ప్రజలకు సుపరిపాలన అందుతుందని టిడిపి ప్రధాన కార్యదర్శి లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి పేర్కొ న్నారు.

మూడుముక్కలాటతో ప్రజల బతుకులు ఛిద్రం
కక్షపూరిత రాజకీయాలకు ప్రజలే బుద్దిచెబుతారు
మంగళగిరి ఎన్నికల ప్రచారంలో నారా బ్రాహ్మణి

ప్రజా దీవెన,మంగళగిరి: సమర్థు డైన పాలకుడు ఉంటేనే ప్రజలకు సుపరిపాలన అందుతుందని టిడిపి ప్రధాన కార్యదర్శి లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి (nara brahmani)పేర్కొ న్నారు. గడిచిన అయిదేళ్లుగా రాష్ట్రంలో పాలన సాగిస్తున్న వారు మూడు ముక్కలాటతో ప్రజల బతుకులను ఛిద్రం చేశారని ఆమె ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి రూరల్ బేత పూడి మల్లెతోటల్లో పనిచేస్తున్న మహిళా కూలీలను కలిసిన బ్రాహ్మ ణి వారి సాధకబాధకాలు తెలుసు కున్నారు.

ఈ సందర్భంగా బ్రాహ్మణి మాట్లాడుతూ ఒకప్పుడు రాళ్లురప్ప లతో నిండిన హైదరాబాద్ ను హైటె క్ సిటీ నిర్మాణం ద్వారా విశ్వనగ రంగా మార్చిన దార్శనికుడు చంద్ర బాబునాయుడు అని,ఎల్లప్పుడూ ప్రజాక్షేమాన్ని కాంక్షించే చంద్రబాబు పై తప్పుడు కేసులుపెట్టి 53రోజుల పాటు అక్రమంగా జైలులో నిర్భం దించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కక్షపూరిత రాజకీయాలకు రాబోయే ఎన్నికల్లో (Andhra elections)ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని, రాష్ట్రంలో మహిళల పై దాడులు పెరగిపో యాయి, భద్రతలేక భయంతో బిక్కుబిక్కు మంటూ జీవనం సాగిస్తున్నారని, నాసిరకం మద్యం కారణంగా నిరుపే ద కుటుంబాలు నాశనమవుతు న్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ఒకప్పుడు అన్నపూర్ణగా ఉన్న రాష్ట్రాన్ని డ్రగ్స్, గంజాయి క్యాపిట ల్ గా మార్చేశారని, చంద్రబాబు సిఎం అయ్యాక మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతారని స్పష్టం చేశారు. భారీగా పెరిగిన నిత్యావస ర వస్తువుల ధరలు, ఇంటిపన్నులు, కరెంటుబిల్లులతో ప్రజలపై భారం మోపారు. అమరావతి విధ్వంసం తో ఇక్కడి ప్రజలకు ఉద్యోగ, ఉపా ధి అవకాశాలు లేకుండా పోయా యని, పేద, మధ్య తరగతి ప్రజల ఆదాయాలు పడిపోయాయని విచారం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో అందరి ఆశీస్సులతో చంద్రబాబు సిఎం అయ్యాక రాజధాని నిర్మాణం చేపట్టి అమరా వతి ప్రాంతానికి పూర్వవైభవం తీసుకొస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి పరిశ్రమలు రప్పించి యువతకు ఉద్యోగావకా శాలు కల్పిస్తారని, రాష్ట్రప్రజలు రెండునెలలు ఓపికపడితే ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వస్తుం దని, అన్నివర్గాల ప్రజల కష్టాలు తీరుతాయని,v మంగళగిరి నియోజకవర్గంలో ఇబ్బందుల్లో ఉన్న చేనేతలను ఆదుకునేందుకు నారా లోకేష్ టాటా తనేరి

యాతో ఒప్పందం చేసుకుని వీవర్స్ శాలను ఏర్పాటుచేశారని, అధునాతన మగ్గాలు, డిజైన్లతోపాటు మార్కె టింగ్ సౌకర్యం కల్పించి చేనేతల ఆదాయం పెంచేందుకు కృషిచేస్తు న్నారని వివరించారు. నారా లోకేష్ చేస్తున్న మంచి పనుల్లో ఇదో చిన్న కార్యక్రమం మాత్రమేనని, లోకేష్ విజన్ అమలైతే మంగళగిరి అసెం బ్లీ నియోజకవర్గం దేశంలోనే నెం.1 గా తయారవుతుందని నారా బ్రాహ్మణి చెప్పారు.

Andhra pradesh good governance