Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

AP Advisors: ఇక ఇంటికి ఏపి సలహాదారులు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సలహాదారు లందరినీ ప్రభుత్వం ఉన్నపలంగా తొలగించింది. మొత్తం 40 మంది సలహాదారులను తొలగిస్తూ సాధా రణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఏకంగా నలభై మందిని తొలగిస్తూ ఉత్తర్వులు

ప్రజా దీవెన, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)ప్రభుత్వ సలహాదారు లందరినీ ప్రభుత్వం ఉన్నపలంగా తొలగించింది. మొత్తం 40 మంది సలహాదారులను తొలగిస్తూ సాధా రణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల ఫలితాలు(Lok Sabha election results)వెలువడిన ఈ నెల 4వ తేదీ నుంచి ఈ తొల గింపు ప్రక్రియ అమల్లోకి వచ్చినట్టు ఉత్తర్వుల్లో జీఏడీ పేర్కొంది. ఇదిలా ఉండగా బుధవారం ప్రభుత్వ ప్రధా న సలహదారు సజ్జల రామ కృష్ణా రెడ్డితో(Sajjala Rama Krishna Reddy)పాటు 20 మంది సలహాదా రులు తమ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన తర్వాత ఆనవాయితీగా చేయాల్సి న వారు ఎవరు చేయకపోవడంతో తాజాగా ప్రభుత్వం తొలగించింది. మరోవైపు మంత్రుల పేషీల్లోని సి బ్బందిని జీఏడీ మాతృ శాఖలకు పంపింది.

ఆయా మంత్రుల పీఏ, పీఎస్‌, ఏపీఎస్‌లు ఈ నెల 11వ తేదీలోగా మాతృ శాఖల్లో రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఈ మేర కు జీఏడీ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్(Suresh Kumar)ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రుల పేషీల్లోని ఫైళ్లు, రికార్డుల ను, డాక్యుమెంట్లను సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు అంద చేయాలని ఆదేశించారు. ఫర్నిచర్, కంప్యూటర్, స్టేషనరీల జాబితాను అక్నాలెడ్జ్ చేసి ఇవ్వాలని, నోడ్యూ స్ సర్టిఫికెట్లు తీసుకోవాలని, మo త్రుల నివాసాల్లో ఉన్న ఫర్నిచర్‌ను కూడా అక్నాలెడ్జ్మెంట్ చేసి ఇవ్వాల ని ఉత్తర్వులు జారీ చేసింది,. మం త్రుల నివాసాల్లో ఉన్న ఫైళ్లను కూ డా సంబంధిత శాఖల ఉన్నతాధికా రులకు అందచేయాలని ఆదేశిం చింది.

AP Advisors removed