AP People: ప్రభుత్వాలపై ప్రజల్లో ప్రజ్వరిల్లిన ప్రతీకారం
ఉచితా లతో ఉదరగొడుతామంటే ప్రజలు మనవెంటే ఉంటారనుకుంటే ప్రజ లు ఊరుకునే పరిస్ధితులు లేవని తెలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితా ల అనంతరం తేటతెల్లమవుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో త్రివిక్రమావతా రమెత్తిన ప్రజానీకం
ప్రజలతో అహంకారం పూరిత వైఖరిపై పాశుపతాస్త్రం
తెలంగాణ తరహాలోనే ఎపిలోనూ తెలుగు ప్రజాతీర్పు వైనం
ప్రజల నాడి పట్టుకోలేకపోయిన వైకాపా నేతల బృందం
అంతా అయిపోయాక అంత చేశాం, ఇంత చేశామని నిర్వేధం
ప్రజా దీవెన, హైదరాబాద్: ఉచితా లతో ఉదరగొడుతామంటే ప్రజలు మనవెంటే ఉంటారనుకుంటే ప్రజ లు ఊరుకునే పరిస్ధితులు లేవని తెలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితా ల అనంతరం తేటతెల్లమవుతోంది. కేవలం డబ్బుల పందేరాన్ని కాకుం డా అభివృద్దిని కూడా కోరుకుంటా రని, అలాగే అరాచకాలను సహిం చరని తాజాగా ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు సమాజానికి సంకేతాలిచ్చారు. ఏపి తాజా మాజీ సీఎం జగన్(Former cm Jagan) ఎన్నికల్లో ఈ స్ధాయిలో ఘోర ఓటమి ద్వారా చవిచూశారు. అవినీతి, అక్రమా లు, అహంకారం, నిర్బంధం వంటి స్వయంకృపారాద కారణాలేనని రాజకీయ వేత్తలు విశ్లేషిస్తున్నారు. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశో ర్ ఎన్నికలకు ముందే ఈ విషయం స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
ఉచితాల పేరుతో కేవలం డబ్బులు పందేరం చేసి, అభివృద్దిని పక్కన పెట్ట రాదని, అదే సందర్భంలో ని రంకుశ,అక్రమాల పాలన కూడా క్షమించరని తేటతెల్లమైంది. ఇదిలా ఉండగా ప్రజలు దేనినైనా సహిస్తా రు కానీ అహంకార పూరిత పాలన ను ఉపేక్షించబోరనడానికి ఆరు నెలల ముందటి తెలంగాణ, తాజా ఏపీ ఎన్నికల(AP Election results) ఫలితాలు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఉచి తాలతో ఊదరగొట్టామని తమకు తిరుగులేదని సునాయాసంగా అధి కారాన్ని చేజిక్కిoచుకుంటామని, ఆన్ని స్థానాల్లో విజయం మాదే అభ్యర్థికంటే తనను చూసే ఓటే స్తారని తెలంగాణలో గత ఏడాది జరిగిన శాసనసభ ఎన్నికల్లో కేసీ ఆర్ భావించారు, కానీ ప్రజలు మా త్రం అభివృద్ధి, సంక్షేమం పక్కన పెడితే అహంకారాన్ని సహించ బోమని తీర్పునిచ్చారని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ప్రతి పక్షాలను పట్టించుకోకుండా ప్రజల ను చిన్నచూపు చేసే నాయకులు మాకొద్దని తిరస్కరించారని ఉదహ రిస్తున్నారు.
ప్రజాస్వామ్య వ్యవస్థ లను(Democracy systems) తప్పుదోవపట్టించి రాజకీయ ప్రయోజనాలకోసం వాడుకుంటే సహించేది లేదంటూ కేసీఆర్ ను గ్దదె దించారని, ప్రస్తుతం ఏపీ ఎన్ని కల ఫలితాల్లోనూ అదే పరిస్థితి, అంతకుమించి ఘోరమైన పరిస్థితి చవిచూడాల్సి వచ్చింది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధిని పక్కన పెట్టి రాజ కీయ కక్ష తీర్పుకోవడానికి వ్యవ స్థలను ఉపయోగించుకున్నారని, పార్టీలు వాక్ స్వాతంత్రాన్ని పూర్తిగా నిషేధం లోనే పెట్టారన్న విమర్శలు బహిరంగంగానే చర్చకు వచ్చిన విషయం తెలిసిందే. ప్రధానంగా ప్రభుత్వంలోని మంత్రులతో పాటు క్షేత్రస్థాయిలోని వైసిపి నాయకుల జుగుప్సాకర వ్యవహార శైలి, బూ తు పురాణాలు ప్రజల్లో తీవ్ర వ్యతి రేకతను మూట కట్టుకున్న విధంగా చేసిందనేది బహిరంగ రహస్యమే. ప్రజాపాలన అందిచమని అధికారం ఇస్తే ప్రజలను, రాష్ట్ర అభివృద్ధి గాలికొదిలేసి రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేయడా న్ని ప్రజలు తిరస్కరించారనేది ఎన్నికల ఫలితం స్పష్టం చేస్తోందని రాజకీయ పరిశీలకులు కుండ బద్దలు కొట్టినట్టు స్పష్టం చేస్తు న్నారు.
ఈ క్రమంలో తాము కోరు కుంటున్న విధంగా ఏపీ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని, ఐదేళ్ల వైసీపీ పాలనపై ఓటర్లు ఎంత వ్యతి రేకంగా ఉన్నారో ఫలితాలు స్పష్టం చేశాయి. సంక్షేమ పథకాల పేరుతో వేల కోట్ల రూపాయిలు నేరుగా ప్రజ ల ఖాతాల్లో వేసినా ఓట్లు పడక పోవడం వైసీపీ అధినేత జగన్ ను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. ప్రభుత్వ సంక్షేమ పథకాల (Government welfare schemes)ద్వారా లబ్దపొందిన లబ్దిదారులు ఓట్లు వేస్తారని భావించిన జగన్ ఆశలు అడియాశలే అయ్యాయి. ఐదేళ్లలో దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని సంక్షేమ పథకాలు అమలు చేశామ ని జగన్ చెప్పుకున్న గొప్పలను ప్రజలు విశ్వసించక పోగా రాష్ట్ర అభివృద్ధిని గాలికొదిలేసి సంక్షేమ పథకాల కోసం లక్షల కోట్లు అప్పు లు చేయడం ప్రజలకు నచ్చలేదని, రాజధాని విషయంలో జగన్ నిర్ణ యాన్ని ప్రజలు పూర్తిగా తప్పు పట్టారనేది ఎన్నికల ఫలితాలు చెప్పకనే చెబుతున్నాయి.
అలాగే రాజధాని ఉద్యమంలో ముందుకు నడిచిన రైతులను కనీసం పరామ ర్శించక పోగా వారినందరినీ పెయి డ్ ఆర్టిస్టులుగా చిత్రీకరిచి, కేసుల తో జైలుకు పంపిన తీరు కూడా చూసాం. సంక్షేమ పథకాలు అమ లు చేసినా పేద, మధ్య తరగతి ప్రజల బ్యాంకు ఖాతాల్లో నేరుగా డబ్బులు జమచేసినా ఓట్లు ఎందు కు పడలేదనే ప్రశ్నలతో ఇప్పుడు వైసీపీ నాయకులు తలలు పట్టు కుంటున్నారు. వైసీపీ ఇంతటి ఘోర పరజాయానికి కారణం ఏమిటో ప్రజలకు మాత్రం అర్థం అయ్యింది కాని వైసిపి నాయకులకు అర్థమైం దో లేదో అన్న విషయం వారి మాట ల్లోనే వినేందుకు వేచిచూడాల్సిందే.
AP People rejected Jagan mohan reddy ruling