Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

AP Postal Ballot: వివాదంలో ఏపి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కంపు

ఆంధ్ర ప్రదేశ్‌లో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు అంశంపై ఈసీ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారుతోంది.

పోస్టల్ బ్యాలెట్ లపై ఈసీ కీలక నిర్ణయం
ఈసీ నిర్ణయాన్ని ప పునఃసమీక్షిం చాలని వైసిపి అభ్యర్థన
నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామంటూ హెచ్చరిక

ప్రజా దీవెన, అమరావతి: ఆంధ్ర ప్రదేశ్‌లో పోస్టల్ బ్యాలెట్ల(Postal ballots)లెక్కింపు అంశంపై ఈసీ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారుతోంది. పోస్ట ల్ బ్యాలెట్‌పై రిటర్నింగ్ అధికారి సీల్ లేకున్నా సంతకం ఉంటే ఓటు చెల్లుబాటు అవుతుందన్న నిబంధ నను వైసీపీ(YCP) తప్పుబడుతోంది. ఈ నిర్ణయాన్ని పునః సమీక్షించాలని ఇప్పటికే ఎన్నికల కమిషన్‌ను కోరింది. దేశం మొత్తం ఒక నిబం ధన ఉంటే ఏపీలో ప్రత్యేక నిబంధన ఎందుకు తెచ్చారంటూ ప్రశ్నిస్తోంది. ఈసీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసు కోకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయి స్తామంటూ పేర్కొంటోంది. కాగా ఓ టమి భయంతోనే వైసీపీ అనవసర ఆరోపణలు చేస్తుందంటూ టీడీపీ ఆరోపిస్తోంది.

రాజకీయంగా పోస్టల్ బ్యాలెట్ అంశం మరింత ముద రడంతో రాష్ట్ర ఎన్నికల అధికారి(State Election Officer) అభ్యర్థన మేరకు కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. గురువారం పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటుపై కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టతనిచ్చింది. వైసీపీ అభ్యంతరాలపై సీఈవో మీ నా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి స్పష్టత కోరారు. ఈ మేరకు సీఈఓ(CEO) ఈసీఐకి లేఖ పంపగా దీనిపై పూర్తి వివరాలను వెల్లడిస్తూ ప్రకటన విడుదల చేసింది. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ పై గెజిటెడ్ అధికారి సంత కం మాత్రమే ఉండి, సీల్ ,హోదా లేకపోయినా ఆ ఓటు చెల్లుతుందని కేంద్ర ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది.

అలాంటి పోస్టల్ బ్యాలె ట్లను వాలీడ్ చేయాలని ఆదేశాలి చ్చింది.పోస్టల్ బ్యాలెట్ విషయంపై న్యాయస్థానంలో విచారణ సైతం ప్రారంభం అయిందని, 13ఏ, 13బీకి సంబంధించిన అన్ని నిబం ధనలను ముందుగానే ప్రకటించా రని పిటిషనర్ అడ్వకేట్ వాదనలు వినిపించారు. పోస్టల్ బ్యాలెట్ లో స్క్రూటినీ చాలా ముఖ్యమని ఈసీ ఐ నిబంధనల ప్రకారం గెజిటెడ్ అధి కారి సంతకం లేకపోతే దాన్ని రద్దు చెయ్యాలని చెప్పారు. అర్ఓసీలు సంతకంతోనే ఓట్ వాలిడ్(Vote valid)అవు తుందని పేర్కొన్నారు. ఈ నిబం ధనలు ఈసీ ముందుగానే చెప్పిం దని పిటిషనర్ అడ్వకేట్ వాదనలు వినిపించారు.

AP Postal Ballot Controversy