–సభా మర్యాదలు లేని మాజీ సీఎం జగన్
–ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలు
Ayyannapatrudu: ప్రజా దీవెన, అమరావతి: సుదీర్ఘ కాల నా రాజకీయ జీవితం లో ఏపీ మాజీ సీఎం జగన్ (JAGAN)లాంటి రాజకీయ నేతను నేనెన్నడూ చూడలేదని ఆం ధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు (Ayyannapatrudu )వ్యాఖ్యానించారు. కనీ సం సభ మర్యాద కూడా లేని వ్యక్తి జగన్ అని, స్పీకర్ ఎన్నిక సమయం లో విపక్షం ఉండటం అనేది సభా సాంప్రదాయమని తెలిపారు. మాజీ సీఎం జగన్‌కు కనీసం సభ మర్యాద కూడా లేదని తన రాజకీయ జీవితంలో (Political life) ఇలాంటి నేతను ఎప్పుడు చూడలేదని అసెంబ్లీ స్పీకర్ చింత కాయల అయ్యన్న పాత్రుడు (Ayyannapatrudu) అన్నారు. స్పీకర్ ఎన్నిక సమయంలో విపక్షం ఉండటం అనేది సభా సాంప్రదాయమని తెలిపారు. నిన్న వారి పార్టీ నేతలకు కూడా శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి కేశవ్ కూడా చెప్పారని గుర్తుచేశారు. అయినా జగన్, వారి ఎమ్మెల్యేలు (MLAS) రాకపోవడం అతనికి సభ పట్ల ఏం మర్యాద ఉందనేది తెలుస్తుందని అన్నారు. అందుకనే ప్రజలు అతని స్థానం ఏమిటో చూపించారన్నారు.
సభకు వచ్చి సంప్రదాయాలను గౌరవించి, ప్రజా సమస్యలను లేవనెత్తి మాట్లాడితే అతనికే మంచిదన్నారు. తాము మాత్రం సభా గౌరవాన్ని పెంచి చూపుతామని పునరుద్ఘాటించారు. ఇది కౌవ సభ కాదు సభకు హుందాతనం ఉందని తెలిపారు. కానీ గత సభలో వాళ్లు కౌర వుల్లా వ్యవహరించారని మండి పడ్డారు. అందరి సహకారంతో సభను సజావుగా నడిపి హుందాత నాన్ని, సభా గౌరవాన్ని పెంచుతా మని అయ్యన్న పాత్రుడు పేర్కొ న్నారు. ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్పీకర్‌గా (As a speaker)బాధ్యతలు చేపట్టిన తొలి సంతకం అసెంబ్లీలో ఏబీఎన్‌పై ఉన్న నిషేధాన్ని తొలగించడాన్ని సంతోషంగా ఉందని తెలిపారు. తొలగించడం సంతోషంగా ఉందని శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రు డు అన్నారు. పత్రికా స్వేచ్ఛను కూడా హరించే విధంగా గత పాలకులు వ్యవహరించారని మండిపడ్డారు. అందుకనే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అసెంబ్లీలో (ASSEMBLY) ఆ నిషేధాన్ని తొలగించా మని స్పష్టం చేశారు.స్పీకర్ పదవి బాధ్యతతో కూడుకున్నదని తెలి పారు. దీనిని సమర్ధవంతంగా నిర్వహించి సభా గౌరవాన్ని పెంచు తామని ఉద్ఘాటించారు. సీఎం చంద్ర బాబు నాయుడు ఈ సభలో కన్నీళ్లు పెట్టిన రోజే వైసీపీ పతనం ప్రారంభం అయిందని చెప్పామని అన్నా రు. అందుకనే వై నాట్ 175 అంటే దేవుడు, ప్రజలు కలిసి 11 స్థానాలు ఇచ్చి పక్కన పెట్టేశారని చెప్పుకొ చ్చారు. చివరకు ప్రేతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా పక్కన పెట్టేశార న్నారు. జగన్‌కు (JAGAN) ప్రతిపక్ష నేత హో దా లేకపోయినా వైసీపీ నేతలు అడిగారని చంద్రబాబు నాయుడు ఔదర్యంగా వ్యవహరించారని చెప్పారు. ఆయన వాహనాన్ని ప్రధాన ద్వారం వద్దకు తీసుకు న్నారన్నారు. మంత్రులు తర్వాత ఆయనతో ప్రమాణం చేయించారని అయ్యన్నపాత్రుడు (AyyannapatraDU) పేర్కొన్నారు.