–గంగానదిలో మునిగి ఆరుగురు గల్లంతు
–ఈదుకుంటూ ఒడ్డుకు చేరి బయటబడ్డ మరో 11మంది
ప్రజా దీవెన, బీహార్:
BIHAR ACCIDENT: బీహార్ రాజధాని పాట్నాలో ఘోర పడవ ప్రమాదం సంభవించింది. మొత్తంగా 17 మంది భక్తులతో బయలుదేరిన పడవ గంగానదిలో (ganga river) అకస్మాత్తుగా మునిగిపోయింది. ప్రమాదం నుంచి తేరుకొని 11 మంది భక్తులు ఈదుతూ ఒడ్డుకు చేరుకోగా ఆరుగురు నదిలో గల్లం తయ్యారని అధికారులు చెప్పా రు. ఆదివారం ఉదయం పాట్నాకు (patna) సమీపంలోని బాఢ్ గ్రామం గంగా నది ఒడ్డున జరిగింది. గంగా దసరా పండుగ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో నదీ తీరానికి వచ్చారు. నదీ స్నానం చేసి అవతలి ఒడ్డుకు వెళ్లేందుకు పడవ ఎక్కి ప్రయాణి స్తుండగా నది మధ్యలోకి వెళ్లిన తర్వాత పడవ (ship) మునిగిపోయింది. దీంతో భక్తులంతా నీళ్లలో పడగా పదకొండు మంది ఈదుతూ ఒడ్డుకు చేరుకున్నారు. మిగతా వారు నీళ్లలో మునిగిపోయారని అధికారులు చెప్పారు. ప్రమాద సమయంలో పడవలో మొత్తం 17 మంది ఉన్నా రని వివరించారు. నదిలో పడవ మునిగిపోయిందనే సమాచారం అందుకున్న వెంటనే ఎస్ డీఆర్ఎఫ్ టీమ్ అక్కడికి చేరుకుంది. నదిలో మునిగిపోయిన ఆరుగురు భక్తుల కోసం గాలింపు చర్యలు చేపట్టింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం నదిలో మునిగిపోయిన పడవలో దాదాపు 25 మంది వరకు ఎక్కారు. పడవ సామర్థ్యం కన్నా ఎక్కువ మంది ఎక్కడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొన సాగిస్తున్నామని, ఇప్పటి వరకూ ఎలాంటి ఫలితం కనిపించలేదని అధికారులు వెల్లడించారు.