Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Buddha Venkanna: బుద్దా వెంకన్న కీలక వ్యాఖ్యలు.. 30 ఏళ్లు సీఎం అనే భ్రమల్లో జగన్

Buddha Venkanna: ప్రజా దీవెన అమరావతి: జగన్ కు ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని ఎద్దేవా జగన్ 2.0లో 11 సీట్లు కూడా ఉండవని వ్యాఖ్య 30 ఏళ్లు తానే సీఎం అంటూ వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న మండి పడ్డారు. జగన్ ను మానసిక వైద్యుడికి చూపించాల్సిందిగా ఆయన భార్య భారతిని కోరుతున్నానని చెప్పారు.

ఐదేళ్లు నేరస్తులతో కలిసి పాలన చేసిన జగన్ కు ప్రజలు కనీ సం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలే దని ఎద్దేవా చేశారు. ఓడిపోయి ఏడు నెలలు కూడా కాకముందే జగన్ అప్పుడే భ్రమల్లో జీవిస్తున్నా రని అన్నారు.అధికారంలో ఉన్న ప్పుడు కార్యకర్తలకు కనీస గుర్తిం పు కూడా జగన్ ఇవ్వలేదని వెం కన్న విమర్శించారు. ఇప్పుడు మీ డియా ముందుకు వచ్చి కార్యకర్తల గురించి గంటల సేపు మాట్లాడుతు న్నారని విమర్శించారు.

జగన్ పాల నలో వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు తప్ప మరెవరూ సంతోషంగా లేరని చెప్పారు.దమ్ముంటే జగన్ అసెం బ్లీకి వెళ్లి మాట్లాడాలని సవాల్ విసి రారు. జగన్ పాలనలో మహిళల ను అసెంబ్లీలో కించపరిచేలా మా ట్లాడారని దుయ్యబట్టారు. కూట మి ప్రభుత్వంలో మహిళలను గౌర విస్తున్నామని చెప్పారు. మీడియా ముందుకు వచ్చి జగన్ అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. జగన్ 2.0లో ఇప్పుడున్న 11 సీట్లు కూ డా ఉండవని ఎద్దేవా చేశారు.