ఇంటికెళ్లి మరీ చితకబాదిన మహిళ భర్త
Chandrasekhar Reddy : ప్రజాదీవెన, కడప: కామంతో చెలరేగిపోతున్న కడప జిల్లా డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్‌రెడ్డికి చితకబాదారు. మహిళా ఉద్యోగిని లైంగికంగా వేధించడంతో చంద్రశేఖర్‌రెడ్డిని ఆమెభర్త చితకబాదాడు. ఇంటికెళ్లిమరీ కోరిక తీర్చమంటూ మహిళా ఉద్యోగిని డీటీసీ చంద్రశేఖర్‌రెడ్డి వేధించాడు. బాధితురాలు భర్తకు చెప్పడంతో రవాణా కార్యాలయానికి వెళ్లి చంద్రశేఖర్‌రెడ్డిని కుటుంబసభ్యులు చితకబాదారు. బాధితురాలి కాళ్ల మీదపడి వేడుకోవడంతో చంద్రశేఖర్‌రెడ్డిని వదిలిపెట్టారు.
అయితే, విషయం బయటికి రాకుండా ఉద్యోగులను మేనేజ్ చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో డీటీసీ చంద్రశేఖర్‌రెడ్డిపై వేటుపడింది. హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేయాలని చంద్రశేఖర్‌రెడ్డిని ఆదేశించింది. ఇదొక్కటే కాదు.. చంద్రశేఖర్‌రెడ్డి వేధింపులు చాలా బయటికి వస్తున్నాయి. చంద్రశేఖర్‌రెడ్డి లైంగిక వేధింపులతో చాలామంది మహిళా ఉద్యోగినులు బదిలీపై వెళ్లిపోయినట్టు తెలుస్తోంది.