Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Chief Secretary Jawahar Reddy: సెలవు పై ఏపి సిఎస్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఐఏఎస్ అధికారుల పోస్టింగ్ లలో కీలక మార్పులు చోటుచేసు కోను న్నాయి.

తాత్కాలిక కొత్త సీఎస్ గా విజ యానంద్ నియమించే అవకాశo
ఏపి ఇంటెలిజెన్స్ చీఫ్ గా బాల సుబ్ర‌హ్మ‌ణ్యం

ప్రజా దీవెన, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఐఏఎస్(IAS) అధికారుల పోస్టింగ్ లలో కీలక మార్పులు చోటుచేసు కోను న్నాయి. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి(Jawahar Reddy)పదవీకాలం జూన్ నెలాఖరుకు ముగియ‌నుంది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న నేడు ఈ నెల‌ ఖ‌రు వ‌ర‌కూ సెల‌వు కోసం ద‌ర‌ఖా స్తు చేశారు. దీనిని వెంట‌నే అమో దించే అవ‌కాశాలున్నాయ‌ని ఉన్న‌ తాధికారుల నుంచి స‌మాచారం. ఈ నేపథ్యంలో తాత్కాలిక కొత్త సీఎస్ గా విజయానంద్ నియమిం చే అవకాశాలు మెండుగా ఉన్నా యని తెలుస్తొంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1992 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి కె.విజ యానంద్‌(IAS officer K. Vijay Anand)గత ప్రభుత్వం లో ప్రధాన కార్యదర్శి పదవిని కొన్ని రోజులు పూర్తి అదనపు బాధ్యతలు నిర్వ హించారు.

విజయానంద్ ఉమ్మడి రాష్ట్రంలో నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలో కలెక్టర్ గా, ఏపీ ట్రాన్స్ కో , ఏపీ జెన్ కో సీఎండీగా పనిచేశారు. రాష్ట్ర విభజన తదుపరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎనర్జీ, ఐటి మంత్రిత్వ శాఖల ముఖ్యకార్యదర్శి(ప్రిన్సిపల్ సెక్రెటరీ)గా పనిచేయడంతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈవోగా బాధ్యతలు నిర్వహించారు. విజ యానంద్ ప్రస్తుతం ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నా రు. తాత్కాలికంగా ఇప్పుడు ఆయ‌ న నియ‌మితులైనా కొత్త ప్ర‌భుత్వం కొలువుతీరిన త‌ర్వాత ఆయ‌ననే ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా కొన‌సాగించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.ఇంటెలిజెన్స్ చీఫ్ గా బాల సుబ్ర‌హ్మ‌ణ్యం .. ఇక ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా బాలసుబ్ర మణ్యం పేరు పరిశీలనలో ఉంది. గత 3 సంవత్సరాలుగా సెలవులో ఉన్నారు. జ‌గ‌న్ స‌ర్కార్ లో ఇమ‌ డ‌లేక సెల‌వులోనే ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్నారు. నిజాయితీ అధికారిగా పేరు ఉన్న బాల సుబ్ర‌హ్మ‌ణ్యంకు ఐబి చీప్ ఇచ్చే అవ‌కాశాలున్నా య‌ని ఐపిఎస్ అధికారులు అంటు న్నారు.

ఐపీఎస్ లకు నో ఎంట్రీ చెప్పిన చంద్ర‌బాబు ..టిడిపి అధినేత, కాబోయే సీఎం చంద్రబాబును(CM Chandrababu)కలి సేందుకు యత్నించిన ఇద్దరు ఐపీ ఎస్‌ అధికారులకు అనుమతి నిరా కరించారు. ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు గురు వారం ఉదయం ఉండవల్లిలోని చంద్ర‌బాబు నివాసం వద్దకు ఆయన చేరుకోగా అనుమతి లేదని చెప్పా రు. కాగా ఎన్నికల విధుల్లో అవకత వకలకు పాల్పడ్డారని పీఎస్‌ఆర్‌ ఆంజనేయులను ఎన్నికల సంఘం (ఈసీ) తప్పించింది. ఆ తర్వాత అనధికారికంగా కూడా వైసిపి కోసం ఆయన పనిచేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చంద్ర బాబు నివాసానికి వెళ్లే మార్గంలో ప్రధాన గేటు వద్దే కానిస్టేబుళ్లు పీఎస్‌ఆర్‌ కారును ఆపారు. లోపలి కి అనుమతి లేదని స్పష్టం చేశారు.

దీంతో చేసేదేమీ లేక ఆయన వెను దిరిగారు. అదేవిధంగా మరో సీని యర్‌ ఐపీఎస్‌ అధికారి కొల్లి రఘు రామిరెడ్డికి(IPS officer Kolli Raghu Ramireddy)చేదు అనుభ‌వ‌మే ఎదు రైంది. చంద్రబాబును కలిసేందుకు ఫోన్‌లో అధికారులను ఆయన అనుమతి కోరగా తిరస్కరించారు. నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్‌ చేసే సమయంలో రఘురామిరెడ్డి కీలకంగా వ్యవహరించారు. ఎన్ని కల సమయంలో వైకాపాకు విధే యుడిగా ఉన్నారంటూ ఈసీ ఆయ నపై కొరడా ఝుళిపించింది. డీజీ ఆఫీసులో రిపోర్టు చేయాలని ఆదే శించింది.ఐపీఎస్ లపై సస్పెన్షన్ ఎత్తివేత…..సాధారణ ఎన్నికల పోలింగ్(Election polling)తేదీన జరిగిన హింసాత్మక ఘటనలను అడ్డుకోలేక పోయారనే కారణంతో అప్పటి పల్నాడు ఎస్పీ జి.బిందు మాధవ్, అనంతపురం ఎస్పీ అమిత్ బర్దార్(SP Amit Bardar)లపై కేంద్ర ఎన్ని కల సంఘం గత నెల 16న సస్పె న్షన్ విధించింది. ఇప్పుడు తాజాగా ఇరువురు ఎస్పీలపై సస్పెన్షన్ ను తొలగిస్తూ ఆదేశాలు జారీచేసింది.

Chief Secretary Jawahar Reddy taken leave