Modi: ఆంధ్రప్రదేశ్ లో అవినీతి తప్ప అభివృద్ధి ఆనవాళ్లే లేవు
ఆంధ్రప్ర దేశ్ రాష్ట్రంలో జూన్ 4వ తేదీన కూటమి ప్రభుత్వం అధికారం లోకి వస్తుందని, మా జెండా రెపరెపలా డుతుoదని, డబుల్ ఇంజన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ జోస్యం చెప్పారు.
ఇసుక, భూములు, మద్యం
మాఫియాలు రెచ్చిపోతున్నాయి
డబుల్ ఇంజిన్ సర్కార్ తో సమ గ్రాభివృద్ధి సాధ్యం
అనకాపల్లి, రాజమండ్రి ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోది
వైసీపీ చరిత్ర ముగియడం ఖా యంగా కనిపిస్తోంది
ఏపి లో జగన్ ప్రభుత్వంపై ప్రధాని ఆగ్రహం
ప్రజా దీవెన, ఆంధ్రప్రదేశ్: ఆంధ్రప్ర దేశ్(Andhra Pradesh) రాష్ట్రంలో జూన్ 4వ తేదీన కూటమి ప్రభుత్వం అధికారం లోకి వస్తుందని, మా జెండా రెపరెపలా డుతుoదని, డబుల్ ఇంజన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ జోస్యం చెప్పారు. వైసీపీ పాలనలో అవినీతి తప్ప అభివృద్ది ఎక్కడా జాడ లేదని, ఆ ఘనత వై.ఎస్.ఆర్ కాంగ్రెస్(Y.S.R Congress) పార్టీకే దక్కిందని మోడీ విమర్శించారు. సోమవారం ఏపి లోని అనకాపల్లి, రాజమండ్రి ఎన్నికల సభల్లో ఆయన ప్రసంగించారు.
ఆంధ్ర ప్రదేశ్లో ఇసుక, భూములు, మద్యం మాఫియా పాలన సాగుతోందని, ఈ దోపీడీ నుంచి విముక్తి కలిగిం చేందుకు ఎన్డీయే ప్రభుత్వాన్ని స్థాపించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా భారత్(Bharat) ఎదిగిందన్నారు. అనకాపల్లి, అనం తపురం వరకు ఆరు లైన్ల రహదారి నిర్మించామన్నారు. ఇక రాయపూర్ నుంచి విశాఖ వరకు హైవే ప్రస్తుతం నిర్మాణదశలో ఉందని, 2014లో నాలుగు వేల కి.మీ జాతీయ రహదారులు ఉండగా ప్రస్తుతం అవి ఎనిమిది వేల కి.మీలకు చేరాయన్నారు.
ఎన్డీయే(NDA) ప్రభుత్వం యువత కోసం పనిచేస్తుందని, ఐఐఐటి, ఐసర్, ఐఐఎం లాంటి జాతీయ విద్యాసంస్థలు తమ ప్రభు త్వ హయాంలోనే ప్రారం భించామ న్నారు. నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కు మంజూరు చేసి, వెయ్యి కోట్ల సాయం అందించామన్నారు. ఏపీలో కేంద్రం పెద్ద ఎత్తున అభివృ ద్ధి కార్యక్రమాలు చేపడితే వైసీపీ మాత్రం ఎందుకు చేయలేకపోయిం దని ప్రధాని నరేంద్ర మోడీ ప్రశ్నిం చారు. అనకాపల్లి బెల్లం, తెలుగు రెండూ మధు రమైన వేనన్నారు. తమ హయాం లో ప్రపంచంలోనే భారత్ గౌరవం మరింతగా పెరుగుతుందన్నారు.
భారత్ ప్రపంచంలోనే ప్రస్తుతం ఐదో అతిపెద్ద ఆర్థికశక్తిగా అవత రించిందని, చందమామ దక్షిణ భాగాన జెండా రెపరెపలాడించిన తొలి దేశంగా భారత్ ఎన్నడూలేని రీతిలో చరిత్ర సృష్టించిందన్నారు. ఏపీ(AP) నుంచి అనేక మంది ప్రవా సాంద్రులు విదేశాల్లో నివసి స్తున్నారన్నారు. భారత్ సాధించిన ఘనతతో ఎప్పుడూ కూడా వారి భాగస్వామ్యం అత్యంత ప్రశంసనీ యమన్నారు. అంతేకాకుండా వారందరూ ఇప్పుడు భారతీయు లుగా ఆయా దేశాల్లో మరింతగాగుర్తింపు పొందుతున్నారన్నారు. విశాఖ రైల్వేజోన్ మంజూరు చేసినా, రాష్ట్ర ప్రభుత్వం కనీసం భూమి కూడా ఇవ్వడం లేదన్నారు.
పేదల కోసం 21 లక్షల పీఎంఏవై గృహలు తాము మంజూరు చేస్తే. వాటిలో సగం కూడా లబ్దిదారులకు ఇవ్వలేదన్నారు. ఏ నాటికి పూర్తి కాని ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, పోలవరం ప్రాజెక్టులు వైసీపీ ప్రభుత్వం పనితీరుకు నిదర్శన మన్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మట్లా డుతూ అవినీతి ప్రభుత్వం ఇంటికి వెళ్లడం ఖాయమని, వచ్చే ఎన్నికల్లో 25 లోక్ సభ 160 స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ, టీడీపీ, జనసేన కలయికతో అమ రావతి, పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవతి, తెలుగుభాష అమలు, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామ న్నారు.
ప్రజల భూముల పత్రాలపై జగన్(Jagan) ఫోటో ఎందుకని ప్రశ్నించారు. కూటమి అత్యధిక మెజార్టీతో గెలవాలంటే మోడీ గ్యారెంటీలు, టీడీపీ మేనిఫెస్టోలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కార్య కర్తలు, నాయకులకు చంద్ర బాబు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎన్నిఎ గెలుపును ఎవరూ ఆపలేరని, వికసిత్ ఆంధ్రప్రదేశ్ దిశగా తమ కూటమి ముందుకు సాగుతుం దన్నారు. వైసీపీ(YCP) ఉత్తరాంధ్ర ద్రోహి అని, సాగునీటి ప్రాజెక్టుల కోసం టీడీపీ హయంలో రూ.2500కోట్లు ఖర్చు పెడితే, జగన్ ప్రభుత్వం రూ.500కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకుని ప్రజలకు ద్రోహం చేసిన వ్యక్తి జగన్ అంటూ ధ్వజమెత్తారు.
కూటమి విడుదల చేసిన మేనిఫెస్టో ముందు, వైసీపీ మేనిఫెస్టో వెలవెలబోయిందన్నారు. ఈ ఎన్నికల్లో ఎంత డబ్బు ఖర్చు పెట్టినా జగన్ పని అయిపోయిం దని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం అమలవుతున్న పోస్టల్ బ్యాలెట్లో కూడా ఉద్యోగులంతా కూటమికే ఓట్లు(Votes) వేస్తున్నాడని, జగన్, వారి బృందం ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టినా చివరకు అంతిమ విజయం, అధికారం కూటమిదేన న్నారు. విశాఖ నాకు నచ్చిన, నేను మెచ్చిన నగరమని ఇక్కడ ప్రజలం దరూ ఎంతో మంచివాళ్లున్నారు. అంతేకాకుండా మంచివారు ఎక్కు వుగా ఉండే నగరంగా ఖ్యాతిగాం చిందన్నారు.
హుడ్ హుడ్ సమ యంలో ఇక్కడ ప్రజలు తనపై చూపించిన ఆదరణ తన జీవితం లో మరిచిపోలేనిదన్నారు. అటు వంటి విశాఖ నగరాన్ని వైసీపీ నాయకులు దోపిడీకి గురిచే శారన్నారు. విలువైన వేలాది ఎకరాల భూములపై కన్నువేసి కబ్జా చేశారన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమాయక ప్రజల నుంచి వైసీపీ నేతలు దక్కించుకున్న భూములను తిరిగి స్వాధీనం చేసుకొని పేద ప్రజలకు అందజేస్తా మన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సంపద సృష్టించి, ఆదాయం పెంచుతామని, నిరంతరం అభివృద్ధి కోసం పాటుపడ తామన్నారు.
నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కావాలంటే కూటిమి ప్రభుత్వాన్ని గెలిపించాలని, ఉద్యో గాలు వచ్చే వరకూ ప్రతినెలా యువతకు మూడువేలు నిరుద్యోగ భృతి అందిస్తామని హామీ ఇచ్చారు. కూటమి అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా డీఎస్సీపైనే చేస్తానని, రెండో సంతకం ల్యాండ్ గ్రాబింగ్ యాక్టు రద్దుపై పెడతానన్నారు. ఏడాదికి నాలుగు లక్షల ఉద్యోగాల చొప్పున ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సిఎం రమేష్, అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత, విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ తో పాటు, మాజీ మంత్రలు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, పలు నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యే అభ్యర్ధులు పాల్గొన్నారు. ప్రధాని మోడీ రాక సందర్భంగా అనకాపల్లి ప్రాంతంలో ఎటు చూసినా జన కోలాహలం కనిపించింది. తొలిసారిగా ప్రధాని మోడీ అనకాపల్లి వచ్చారు. ఇక సిఎం రమేష్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదల నాగబాబులు ప్రధాని నరేంద్ర మోడీని ఘనంగా సత్కరించి శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని బహుకరించారు.
ప్రారం భించినా, తండ్రి వారసత్వం తీసుకున్న జగన్ వాటిని మాత్రం పూర్తి చేయటే కపోయారన్నారు. కనీసం పూర్తి చేసే ఉద్దేశ్యం కూడా జగన్కు ఎంత మాత్రం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ, వైసీపీ రెండూ ఒకటేనన్నారు. కర్దా టకలో ట్యాంకర్, భూమాపియా ప్రభుత్వం నడుస్తుండగా, ఏపీలో శాండ్, ల్యాండ్ మాఫియా విజృం భిస్తున్నాయని, చివరకు దేవాలయాలపై దాడులు జరిగాయన్నారు.
Corruption in Andhra Pradesh