–రాచకొండ సీపీ తరుణ్ జోషి హెచ్చరిక
CP Tarun Joshi:ప్రజా దీవెన, హైదరాబాద్: సాధార ణ ప్రజలు, విద్యార్థులు అందరూ డ్రగ్స్ రహిత సమాజం (A drug free society) తమ బాధ్య తగా భావించాలని రాచకొండ సీపీ తరుణ్ జోషి(CP Tarun Joshi) అన్నారు. తమ పరిస రాల్లో, కాలేజీల్లో, పాఠశాలల్లో మ త్తు పదార్థాల వాడకం గురించి పరిశీలిస్తూ ఉండాలని సూచిం చారు. తెలిసీ తెలియక మత్తుపదార్థాల బారిన పడడం వల్ల యువత బంగారు భవిష్యత్తు నాశనం అవు తోందని, యువత యొక్క శారీరక మానసిక ఆరోగ్యాన్ని మత్తుపదార్థా లు విచ్ఛిన్నం చేస్తున్నాయని తెలిపారు. అంతర్జాతీయ మత్తు పదార్థాల వ్యతిరేక దినం (International Anti-Drug Day) సందర్భం గా జూన్ 27, 2024 మహేశ్వరంలో యాంటీ డ్రగ్స్ డే ను నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ డ్రగ్స్ మీద పోలీసులు చేస్తు న్న పోరాటంలో యువత తమ వంతు భాధ్యత నిర్వహించాలని, డ్రగ్స్ వినియోగానికి దూరంగా ఉండ డంతో పాటు, తమ దృష్టికి వచ్చే నిషేధిత డ్రగ్స్ సరఫరా మరియు వినియోగానికి సంబం ధించిన సమాచారాన్ని తక్షణమే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శశాంక, పలువురు ఐపీఎస్ లు పాల్గొన్నారు.