Chandrababu naidu: ఆ ఐదేళ్లు ఆంద్రప్రదేశ్ లో ప్రమాదంలో ప్రజాస్వామ్యం
తెలుగుదేశం పార్టీ ఎన్డీయే కూటమి తోనే ఉన్నామని, ఉంటామని టీడీ పీ అధినేత నారా చంద్రబాబు నా యుడు స్పష్టం చేశారు.
నా రాజకీయయాత్రలో ఈ ఐదేళ్లు చూసిన ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు
ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవా లి నినాదంతోనే పనిచేశాం
కూటమి ఘన విజయంపై ప్రజలం దరికి, మీడియాకు కృతజ్ఞతలు
అవినీతి, అరాచకాలతో పనిచేస్తే ఇలాంటి గతే పడుతుంది
తాము ఎన్డీఏ కూటమితోనే ఉన్నాo, ఉంటాం
గుంటూరు జిల్లా ఉండవల్లిలోని నివాసంలో ఏర్పాటు చేసిన మీడి యా సమావేశంలో చంద్రబాబు
ప్రజా దీవెన, అమరావతి: తెలుగుదేశం పార్టీ (Telugu desam party)ఎన్డీయే (NDA Alliance)కూటమి తోనే ఉన్నామని, ఉంటామని టీడీ పీ అధినేత నారా చంద్రబాబు నా యుడు(TDP Leader Nara Chandrababu naidu) స్పష్టం చేశారు. ఇండియా కూటమితో చేతులు కలిపే అవకా శం ఉందని, ఇప్పటికే కూటమి నేత లు బాబును సంప్రదించారన్న ప్రచా రానికి చెక్పెడుతూ చంద్రబాబు క్లారి టీ ఇచ్చారు. కూటమి ఘన విజ యంపై ప్రజలకు కృతజ్ఞతలు తెలు పుతూ గుంటూరు జిల్లా ఉండవ ల్లిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మీడియా సహా రాష్ట్ర ప్రజలందరికీ శిరస్సు వంచి చంద్రబాబు మన స్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పారు. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలనే నినాదంతోనే పని చేశామన్నారు. ఎన్ని త్యాగాలు చేసైనా భావితరాల భవిష్యత్తు కోసం ముందుకెళ్లామని అన్నారు. కూటమికి 55.38 శాతం ఓట్లు వచ్చాయని చంద్రబాబు పేర్కొన్నారు. బేషజాలు లేకుండా ఎన్నికల్లో కూటమి నేతలు పని చేశారని, కూటమిపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయమని హామీ ఇచ్చారు.
నా సుదీర్ఘ రాజకీయ యాత్రలో ఈ ఐదేళ్లు చూసిన ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని, ప్రజా స్వామ్య వ్యవస్థలన్నీ ఎలా ఇబ్బం ది పడ్డాయో చూశామని, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలన్నదే మా ధ్యేయంగా పని చేశామని గుర్తు చేశారు. ఏపి లో కూటమికి 55.38 శాతం ఓట్లు వచ్చాయని, 45.60 శాతం టీడీపీకి, 39.37 శాతం వైఎస్సాఆర్సీపీకు (YSRCP)వచ్చా యని తెలిపారు. అవినీతి, అరాచ కాలతో పనిచేస్తే ఇలాంటి గతే పడు తుందని, ఐదేళ్లు మా కార్యకర్తలు చాలామంది ఇబ్బందిపడ్డారని, కార్యకర్తలకు కంటినిండా నిద్ర కూడా పోని పరిస్థితి. ప్రాణాలతో ఉండాలంటే జై జగన్ అనాలని హింసించారని, రాజకీయాల్లో ఎవ రూ శాశ్వతం కాదని, దేశం, ప్రజా స్వామ్యం, రాజకీయ పార్టీలు శాశ్వ తమని, రాజకీయ పార్టీలు కూడా సక్రమంగా పనిచేస్తే మళ్లీ ప్రజలు ఆదరిస్తారని, ఇంత చరిత్రాత్మక మైన ఎన్నికలు ఎప్పుడూ చూడలే దని టీడీపీ అధినేత చంద్రబాబు(TDP Leader Chandrababu naidu) అన్నారు.
ఏమైనా ఉంటే ఏపీకి వచ్చాక మాట్లాడుకుందాం…
అసెంబ్లీ ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ తర్వాత ప్రెస్ మీట్ పెట్టిన చంద్రబాబు చాలా అంశాలపై తేల్చకుండానే ఉత్కంఠ కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా కేంద్రంలో జరిగే పరిణామాలపై మాట్లాడుతూ ఢిల్లీ వెళ్తున్నానని వచ్చాక మాట్లాడుకుందామంటూ ముగించేశారు. ఇదిలా ఉండగా కేంద్రంలో ఆసక్తికరమైన రాజకీయం చోటు చేసుకుంది. అతి తక్కువ మెజార్టీతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఉంది. 400 సీట్లు సాధిస్తామంటూ మోడీ చేసిన ప్రచారం బెడిసి కొట్టడం, ఇండీ కూ టమి మాత్రం అనూహ్యంగా పుంజు కొని ఎన్డీఏకు ధీటుగా బదులు ఇచ్చిందని, లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏకు 294 సీట్లు వస్తే ఇండీ కూటమికి 234 సీట్లు వచ్చాయని, దీంతో అధికారం చేపట్టాలంటే కచ్చి తంగా మిత్రుల బలంపై ఆధారా పడాల్సిన పరిస్థితి బీజేపీకి వచ్చిం ది. అదే టైంలో ఇండీ కూటమి కూ డా ఒకట్రెండు పార్టీలను ఒప్పించి కూటమిలో కలుపుకుంటే మాత్రం కచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చనే ఆలోచనలో ఉంది.
ప్రస్తుతం ఎన్డీఏ భాగస్వామ్య పక్షా ల్లో టీడీపీ 17 సీట్లతో రెండో స్థానం లోఉంటే తర్వాత స్థానంలో నితీష్ కుమార్ ఉన్నారు. వాళ్లను లాక్కుం టే కచ్చితంగా కేంద్రంలో ప్రభుత్వా న్ని ఏర్పాటు చేయొచ్చని ఇండీ కూటమి నేతలు భావిస్తున్నారు. అలాంటి ప్రయత్నాలు కూడా ప్రారం భమైనట్టు చెప్పుకుంటున్నారు. ఇలాంటి చర్చలు జరుగుతున్న వేళ చంద్రబాబు రియాక్షన్ ఏంటని 24 గంటల నుంచి ఎదురు చూస్తున్న వాళ్లకు చంద్రబాబు(Chandrababu naidu) కాస్త సస్పెన్స్ క్రియేట్ చేస్తూనే ఓ క్లారిటీ ఇచ్చా రు. తాను ఎన్డీఏ మీటింగ్‌కు వెళ్తు న్నానని చెప్పారు. ఇప్పుడు కేంద్రం లో కూటముల గురించి మాట్లాడు కునే సమయం కాదంటూనే తాను ఇలాంటి రాజకీయ పరిణామాలు చాలా చూశానని చెప్పుకొచ్చారు. వాటన్నింటిపై ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత మాట్లాడుకుందామని మీ డియా సమావేశాన్నిముగించేశారు.
Democracy risk in Andhra Pradesh