Karate Kalyani: ప్రజాదీవెన, విజయనగరం: ఆవుల (cows) అక్రమరవాణాను వ్యతిరేకిస్తూ నటి కరాటే కల్యాణి (Karate Kalyani నిరసన చేపట్టారు. విజయనగరం జిల్లా రంగవరపుకోట నియోజకవర్గంలో పశువుల అక్రమ రవాణాను (Cattle smuggling) కరాటే కల్యాణి అడ్డుకున్నారు. స్థానిక నక్కపల్లి పోలీస్ స్టేషన్ (Nakkapally Police Station) వద్ద నుండి కొత్తవలస అక్రమ తరలింపు స్టాక్ పాయింట్ వద్దకు గోవులను తరలిస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్ లేని ఒక వాహనానికి ఫేక్ నంబరు వేసి TS 07 UN 1847 వేసి పశువుల క్రమ రవాణాకు (Cattle smuggling) దీన్ని ఉపయోగిస్తున్నారని ఆరోపించారు.
గతంలో తాను 150 గోవులను పంపానని, అవి ప్రస్తుతం అక్కడ లేవని.. ఏమయ్యాయో చూపించాలని కరాటే కల్యాణి డిమాండ్ (demand) చేశారు. దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు (cpmplanit) చేసినా సంఘటన స్థలానికి చేరుకోకపోవడంతో పశువుల స్టాక్ పాయింట్ వద్ద కరాటే కల్యాణి ధర్నాకు దిగారు. ఒక హోం గార్డును (Home Guard) అక్కడికి పంపారని.. పోలీసులు ఏమయ్యారని ప్రశ్నించారు.