–ల్యాప్ ట్యాప్, వెండి వస్తువులు పోగొట్టుకున్న మహిళకు తిరిగి అందజేత
–ఆటో డ్రైవర్ చేత మహిళకు అందజేయించిన పట్టణ సీఐ వినోద్ కుమార్
Laptop Missing: ప్రజా దీవెన, మంగళగిరి : మంగళగిరి ఓ ఆటో డ్రైవర్ మానవత్వాన్ని చాటుకున్నారు. బుధవారం గుంటూరు (Guntur) నుంచి మంగళగిరి (Manglagiri) కి ఓ మహిళ ఆటోలో వచ్చింది. ల్యాబ్ టాప్, పలు వెండి వస్తువులు ఉన్న బ్యాగ్ ను ఆటోలో మర్చిపోయింది. ఆ బ్యాగ్ ను సురేష్ అనే ఆటో డ్రైవర్ పట్టణ పోలీస్ స్టేషన్లో అప్పగించాడు. కొద్దిసేపటి తర్వాత సదరు మహిళ సైతం పోలీస్ స్టేషన్ కు చేరుకొని తన బ్యాగ్ పోయిందని. పట్టణ సీఐ వినోద్ కుమార్ ను కలిసి ఫిర్యాదు చేసింది. ఆటో డ్రైవర్ సురేష్ ను పిలిపించిన సీఐ వినోద్ కుమార్ (Vinod Kumar) ఆటో డ్రైవర్ చేతుల మీదుగా ల్యాబ్ ట్యాప్, వెండి వస్తువులను (Silver goods) అందజేయించారు. మానవత్వాన్ని చాటుకున్న ఆటో డ్రైవర్ సురేష్ (Suresh) కు స్పందించి తక్షణమే ల్యాబ్ ట్యాప్ వెండి వస్తువులను అందజేయించిన సిఐ వినోద్ కుమార్ కు మహిళ కృతజ్ఞతలు తెలిపింది.