Nara Brahmani:అభివృద్ధిలో మంగళగిరి ఆదర్శం
ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి ఎయిమ్స్ ఆవరణలోని ఎకో పార్క్ ను నారా బ్రాహ్మణి సందర్శించారు.
ఎకో పార్క్ దగ్గర వాకర్స్ , ఉండ వల్లి కరకట్టపై మత్స కారుల తో మాటామంతీ
మంగళగిరి ఎన్నికల ప్రచారంలో నారా బ్రహ్మణి
ప్రజా దీవెన, మంగళగిరి: ఎన్నికల ప్రచారంలో(Election campaign)భాగంగా మంగళగిరి ఎయిమ్స్ ఆవరణలోని ఎకో పార్క్ ను నారా బ్రాహ్మణి(Nara Brahmani) సందర్శించారు. వాకర్స్ తో ముఖాముఖీ నిర్వహించారు. గడిచిన ఐదేళ్లుగా ఈ పార్క్ నిర్వహణకు తమ సొంత డబ్బులు పెట్టుకుంటున్నామని ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారంలేదని వాకర్స్ బ్రాహ్మణి దృష్టికి తీసుకొ చ్చారు. పార్క్ ప్రవేశ రుసుము రద్దు చేయాలని,ట్రాక్ లు నిర్మించాలని, మంగళగిరిలో( Mangalagiri) వాకర్స్ సభలు, సమావేశాలు నిర్వహించుకునేం దుకు స్థలం కేటాయించి షెడ్డు నిర్మించాలని వాకర్స్ కోరారు. సానుకూలంగా స్పందించిన బ్రాహ్మణి అధికారంలోకి రాగానే అన్ని సమస్యలు పరిష్కరిస్తామ న్నారు. ఎకో పార్క్ ను మరో కేబీఆర్ పార్క్ లా తీర్చిదిద్దుతామ న్నారు. మంగళగిరి అభివృద్ధిపై నారా లోకేష్ ప్రత్యేక దృష్టి పెట్టారని , ఇక్కడి ప్రజలందరికీ సంక్షేమం అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
మత్స్యకారులతో నారా బ్రాహ్మణి మాటామంతీ:
మత్స్యకారులను అన్ని విధాలా ఆదుకుంటామని, వారికి సంక్షేమం అందేలా చర్యలు తీసుకుంటామని నారా బ్రాహ్మణి భరోసా ఇచ్చారు. ఉండవల్లి కరకట్ట దగ్గర కృష్ణాన దిలో చేపలు పట్టి అమ్మకం సాగించే మత్స్యకారులతో నారా బ్రాహ్మణి మాట్లాడారు. వారి సమస్యలను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు(Chandrababu) గారి హయాంలో చేపలు పట్టుకునేందుకు రెండెకరాల స్థలం ఇచ్చారని గడిచిన ఐదేళ్లలో కనీసం ఇక్కడ మార్కెట్ కూడా ఏర్పాటు చేయలేదని మత్స్య కారు లు వాపోయారు. కరోనా సమ యంలో ప్రభుత్వం ఆదుకోకపోవ డంతో తిండి లేక అల్లాడుతున్న 4 వేల మందికి నారా లోకేష్ గారు భోజనం పెట్టి, నిత్యావసర వస్తు వులు అందించారని చెప్పారు.
ఇళ్ల స్థలాలు కేటాయించాలని, చేపటల మార్కెట్ ఏర్పటు చేయాలని, వేట లేని సమయంలో ఉపాధి కల్పించా లని ,తమ బిడ్డల పెళ్లిళ్లు చేసుకోవ డానికి కల్యాణ మండపం కట్టించా లని మత్స్యకారులు బ్రాహ్మణిని కోరారు. మత్స్యకారుల కష్టాలను చూసి బ్రాహ్మణి చలించిపోయారు. అధికారంలోకి రాగానే హామీలన్ని నెరవేరుస్తామని, ఉచితంగా ఇంటి స్థలాలతో పాటు కమ్యూనిటీ హాల్(Community Hall)కట్టించి ఇస్తామని చెప్పారు. మ త్స్యకారుల సంక్షేమానికి చంద్ర బాబు గారు అనేక పథకాలు ప్రవే శపెట్టి విజయవంతంగా అమలు చేశారని రాబోయే రోజుల్లో మరింత సంక్షేమం అందేలా చర్యలు తీసు కుంటారని ఆమె భరోసా ఇచ్చారు.
mangalagiri ideal for development