Nara Lokesh : ప్రజా దీవెన, అమరావతి: కూటమి ప్రభుత్వంలో ఏకపక్ష నిర్ణయాలు ఉండవని.. చర్చలు, సంప్రదింపుల ద్వారానే నిర్ణయాలు తీసుకుంటామని నారా లోకేశ్ అన్నారు. సంస్కరణలు అమలుచేసే క్రమంలో ఏవైనా తప్పులు దొర్లితే సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.
ఇవాళ ఇంజినీరింగ్ కళాశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రతినిధులు లోకేశ్తో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో నాణ్యత పెంచడంపై యాజమాన్యాలు దృష్టి సారించాలని మంత్రి లోకేశ్ వారికి సూచించారు.