–పరిశ్రమల కాలుష్యంపై సమగ్ర నివేదిక సమర్పించాలి
— కృష్ణా గోదావరి జలాల కలుషితంపై సమీక్ష
–కీలక ఆవేశాలు జారీ చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Pawan Kalyan: ప్రజాదీవెన, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పరిశ్రమల్లో వెలువడే కాలుష్యంపై పొల్యూషన్ ఆడిట్ కచ్చితంగా చేయాల్సిందేనని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఆదేశించారు. ఏయే పరిశ్రమల నుంచి ఎంత కాలుష్యం విడుదలవుతుందో సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కృష్ణా, గోదావరి నదీ జలాలు కలుషితంపై ప్రత్యేకంగా సమీక్షిస్తామని డిప్యూటీ సీఎం (DEPUTY CM) స్పష్టం చేశారు. మరోవైపు మన రాష్ట్రం నుంచి అక్రమంగా తరలిపోయి నేపాల్ దేశంలో దొరుకుతున్న ఎర్ర చందనాన్ని (Red Sandalwood) వెనక్కి తీసుకురావాలని ఆయన సూచనలు జారీ చేశారు. నేపాల్ దేశంలో 172 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం దొరికిందని మంత్రి స్పష్టం చేశారు. ఎర్ర చందనం అక్రమ రవాణా అరికట్టడానికి టాస్క్ ఫోర్స్‌ను బలోపేతం చేస్తామని తెలిపారు. జనవాణికి వచ్చే సమస్యల పరిష్కారాలను నేరుగా రాష్ట్ర శాసన సభలో (In the state legislature) పని చేసే హౌస్ కీపింగ్ సిబ్బందిగా ఉన్న 154 మంది మహిళలు తమ సమస్యలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకు వెళ్లారు. గత ఎనిమిదేళ్లుగా ఇక్కడే పని చేస్తున్నామని, తాము అమరావతి ప్రాంత రైతు కూలీలమని తెలిపారు. శాసనసభ రెండో రోజు స్పీకర్ ఎన్నిక సందర్భంగా సభకు ఉదయమే వచ్చిన పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అసెంబ్లీ ప్రాంగణమంతా కలియ తిరిగి పరిశీలించారు. అక్కడున్న సిబ్బందితో, సెక్యూరిటీతో (SECURITY) సరదాగా మాట్లాడుతూ వారితో మమేకమయ్యారు. సిబ్బందికి ఫొటోలు ఇచ్చి, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ శాసనసభను పరిశీలించారు.
శాసనసభ హౌస్ కీపింగ్(Legislative Housekeeping)సిబ్బంది డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తమ సమస్యలను చెప్పుకొన్నారు. హౌస్ కీపింగ్ (Housekeeping) సిబ్బంది మొత్తం అన్ని విభాగాల్లో కలిపి 154 మంది వరకు శాసనసభలో పనిచేస్తున్నామని, రాజధాని ప్రాంత రైతు కూలీలమని ఇక్కడ పనిచేస్తున్నారని చెప్పారు. 8 సంవత్సరాల కిందట రూ.6 వేలకు ఉద్యోగంలో చేరామని ఇప్పుడు రూ.10 వేలు ఇస్తున్నారన్నారు. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ (Sourcing agency పరిధిలో ఉన్నామని తెలిపారు.
న్యాయం చేస్తామని పవన్ హామీ: అమరావతి రైతు (Farmer of Amaravati) కూలీలుగా ఉన్నందున నెలకు రూ.2500 భత్యం వచ్చేదని, తరువాతి రోజుల్లో కీపింగ్ ఉద్యోగం ఉందని చెప్పి ఆ భత్యం నిలిపివేశారన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని, ఉద్యోగ భద్రతను కల్పిస్తూ పురపాలక ఉద్యోగులుగా గుర్తించాలని వేడుకున్నారు. హౌస్ కీపింగ్ ఉద్యోగుల సమస్యను ఆసాంతం విన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (PAWAN KALYAN) సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రి దృష్టికి విషయాన్ని తీసుకెళ్లి, తగు విధంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.