Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Pawan Kalyan tigers : పులుల సంరక్షణ దిశగా ప్రణాళికలు

--టైగర్ రిజర్వ్ పరిధిలో పులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు --పులుల వేట, స్మగ్లింగ్ లపై కఠినం గా వ్యవహరిస్తాం --పులులను కాపాడితే అవే అడవు లను రక్షిస్తాయి --పచ్చదనం పెరిగితే పర్యావరణ సమతౌల్యం కొనసాగుతోంది --మన్ కీ బాత్ లో నల్లమలలో టైగర్ ట్రాకర్స్ గా చెంచుల గురించి ప్రధానమంత్రి మోదీ ప్రస్తావన సంతోషకరం --వసుధైక కుటుంబంలో వన్య ప్రాణులూ భాగస్వామ్యమే --అటవీ శాఖలో ఉద్యోగుల కొరత, సమస్యల పరిష్కారానికి చర్యలు --అంతర్జాతీయ పులుల దినోత్సవం కార్యక్రమంలో ఏపి ఉపముఖ్యమం త్రి, అటవీ, పర్యావరణశాఖ మంత్రి పవన్ కళ్యాణ్

పులుల సంరక్షణ దిశగా ప్రణాళికలు

–టైగర్ రిజర్వ్ పరిధిలో పులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు
–పులుల వేట, స్మగ్లింగ్ లపై కఠినం గా వ్యవహరిస్తాం
–పులులను కాపాడితే అవే అడవు లను రక్షిస్తాయి
–పచ్చదనం పెరిగితే పర్యావరణ సమతౌల్యం కొనసాగుతోంది
–మన్ కీ బాత్ లో నల్లమలలో టైగర్ ట్రాకర్స్ గా చెంచుల గురించి ప్రధానమంత్రి మోదీ ప్రస్తావన సంతోషకరం
–వసుధైక కుటుంబంలో వన్య ప్రాణులూ భాగస్వామ్యమే
–అటవీ శాఖలో ఉద్యోగుల కొరత, సమస్యల పరిష్కారానికి చర్యలు
–అంతర్జాతీయ పులుల దినోత్సవం కార్యక్రమంలో ఏపి ఉపముఖ్యమం త్రి, అటవీ, పర్యావరణశాఖ మంత్రి పవన్ కళ్యాణ్
ప్రజా దీవెన, మంగళగిరి: అడవిలో ఉండే పులులను కాపాడితే అవే అడవులను రక్షిస్తాయని, తద్వారా పచ్చదనం పెరిగితే పర్యా వరణ సమతౌల్యం ఉంటుందని రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి, పర్యా వరణ అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ( minister Pawan Kalyan) స్పష్టం చేశారు. రాష్ట్రంలోని టైగర్ రిజర్వ్ పరిధిలో పులు ల ( tige rs )సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.

పులుల సంఖ్య పెంచే దిశగా సంరక్షణ ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచిం చారు. గ్లోబల్ టైగర్ డే సందర్భంగా సోమ వారం ఉదయం మంగళగి రిలోని అరణ్య భవన్ లో నిర్వహించిన కార్యక్రమం లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్లోబల్ టైగర్ డే పోస్టర్ విడుదల చేశారు. బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్. వి.ఎస్.కె .కె. రంగారావు ( baby Nayana) ఏర్పాటు చేసిన టైగర్స్ ఫోటో ఎగ్జిబిషన్ తిలకించారు.

వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ హాబీ కలిగిన బేబీ నాయన, ఆయన మిత్రులు దేశం లోని జాతీయ పార్కులు (national parks ) , టైగర్ సఫారీల్లో తీసిన పులుల ఫోటోలను అక్కడ ప్రదర్శించారు. రాష్ట్రం లో పులుల సంఖ్య, అభ యారణ్యంలో తీసుకోవలసిన భద్రత చర్య ల ( pricosons) పవన్ కళ్యాణ్ సమీక్షించారు.ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ భారతీయ సంస్కృతి (Indian cul ture) లో ప్రతి ప్రాణి వసుధైక కుటుంబంలోకే వస్తుంది. అడవులు మన సంస్కృతిలో భాగం. అక్కడుండే ప్రాణులు కూడా మనకు ఎం తో అవసరం. వాటి సంరక్షణ బాధ్యతలు మనమే తీసుకోవాలి.

దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీ20 ( pm modi g-20) సమ యంలో వసుధైక కుటుం బం గురించి చెబుతూ ప్రకృతిలో భాగమైన చెట్లు, జంతుజాలం, క్రి మికీటకాలు అన్నీ వసుధైక కుటుంబంలో భాగమే అన్నారు. వాటిని కూడా మనం కాపాడుకోవాలి. అటవీశాఖా మంత్రిగా రాష్ట్రంలోని అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు పూర్తి గా నేను కట్టుబడి ఉన్నా ను. అధికారులు సైతం ఇదే లక్ష్యంతో పని చేయాలి. వారికి ఈ విష యంలో నా నుంచి పూర్తి సహకారంల భి స్తుంది.

ప్రకృతితో కలసి బతకాలి అన్నది విశ్వమానవ సిద్ధాంతం. అలాంటి ప్రకృతిలో భాగమైన అడవులను (forests)   వివిధ రకాలుగా వినాశనం చేస్తూ మనిషి తన రోజువారీ జీవితం గడుపుతున్నాడు. దీనికి ఎక్కడో దగ్గర పుల్ స్టాప్ పడాలి. అడవుల విధ్వంసం అనేది ఆగాలి. అభయారణ్యాల్లో బతికే వన్యప్రాణులు ( Wildlife livi ng in sanctuaries) వాటి రక్షణకు ప్రతి ఒక్కరు బాధ్యత తీసు కోవాలి. అక్రమంగా పులుల్ని వేటాడే వారి పైనా, స్మగ్లింగ్ కి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.

నా ఇంటి ఆవరణనే చిన్నపాటి అడవిగా మార్చాను.. ఇక్కడ ఒక విషయం చెప్పాలి,  నా చిన్నతనం లో ఒంగోలు ( ongol ) ఉన్న ప్పుడు మా వీధిలోకి ఒక పంగోలిన్ ను అందరూ కలిసి కొట్టేశారు. అది ప్రమా దకరమా అని అడిగితే మాకూ తెలియదు, ఏమైనా చేస్తుందేమోనని భయంతో కొట్టేశామన్నారు. వన్యప్రాణులపై ముం దుగా భయంతోనే హాని తలపెడతారు. వన్యప్రాణి పరిరక్షణ చట్టం (Wildlife) , అటవీ పరి రక్షణ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

వసుధైక కుటుంబం అంటే మనుషులతో పాటు పశుపక్షాదులు, చె ట్లు, జంతువులు కూడా ఉండాలి. నేను రాజకీయ నాయకుడి కంటే ముందు ప్రకృతి సంరక్షకుడిని. నాఫాoహౌస్ ( form house) నేను ఎటువంటి క్రిమి సంహారక మందులు వాడకుండా సహజంగా పెరిగే మొక్కలు, చెట్లు, కీటకాలు పెరిగేలా చర్యలు తీసుకున్నాను. దీనివల్ల అనేక పక్షులు అక్కడికి వచ్చి చేరాయన్నారు. దీని కోసం మనం పెద్దగా ఏమీ చేయక్కర్లేదు. ఉన్నం తలో సంరక్షణ చర్యలు చేపడితే చాలు. హైదరాబాద్ ( hydarabad ) నేను ఉండే 1400 చదరపు గజాల ఇంటి ఆవరణలోనూ సహజంగా పెరిగే ఏర్పాటు చేస్తే చిన్నపాటి అడవిలా తయారైంది. ఇప్పుడు అక్కడ అరు దైన పక్షులు కూడా అప్పుడప్పుడూ కనిపిస్తున్నాయన్నారు.

నల్లమల శివ, చిగుళ్ళ మల్లికార్జున్ ల మాటలు కదిలించాయి.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ( modi man ki ba at) పులుల సంరక్షణ గు రించి చెబుతూ నల్లమల అడవుల్లో చెం చులు టైగర్ ట్రాకర్స్ గా ఉ న్నారనీ, అక్కడ వన్యప్రాణుల సమాచా రం అందించడంతోపాటూ అక్రమాలు జరగకుండా నిఘా ఉంచుతా రని ఆనందం కలిగించింది. పులులు వారి సంస్కృతిలో అంతర్భా గం అని చెప్పిన మాటలు స్ఫూర్తి కలిగించాయి. కొన్ని సంవత్సరాల కిందట- నల్లమల ప్రాంతానికి చెందిన చెంచు జాతికి చెందిన 16 ఏళ్ల శివ అన్న కుర్రాడు హైదరా బాద్ లో మా ఆఫీస్ దగ్గరకి వచ్చా డన్నారు.

అతనితో మాట్లాడి నప్పుడు పర్యావరణ పరిరక్షణ మీద చెంచులకి ఉన్న నిబద్దత తెలిసింది. అతను నా దగ్గరకు వచ్చిన పని నల్లమల లో యురేనియం మైనింగ్ (ureniyam maininig) ప్రయత్నా లు జరుగుతున్నాయి. అదే జరిగితే మా అడవులు పోతాయి. పులు లు చచ్చిపోతాయి. ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు. నల్లమ ల విధ్వంసానికి గురవుతుంది. నా మాట ఎవరు వింటారో తెలియక మీ దగ్గరకు వచ్చాను. ఏమైనా చేయమని అడిగాడు. ఆ క్రమంలో కాంగ్రెన్ నాయకులు వి. హనుమంతరావు చెప్పి నల్లమలలో యురేని యం అన్వేషణపై అఖిలపక్షం (all party meeting) రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశామన్నారు.

సమావేశంలో చిగుళ్ల మల్లికార్జున్ అనే చెంచుల ప్రతినిధి మాట్లాడి న మాటలు నన్ను కదిలించాయి. ‘నల్లమలలో ( nallamalla)  చెట్లు, జంతువులు, వాగులు అన్నింటినీ మేము దేవతలుగా కొలు స్తాం. పెద్ద పులి అంటే పెద్దమ్మ దేవర, ఎలుగుబంటిని లింగమయ్య గా చూస్తాం. అడవి పందిని గూబల మస్సి, గారెల మస్సి, బంగారు మైసమ్మ అని పిలుచుకుంటాం. రేసు కుక్క మల్లికార్జునుడి భార్య మా బవరమ్మ గా కొలుస్తాము. తేనెలో ఉండే తెల్లగడ్డను మల్లమ్మ అంటామని అక్కడ తమ ఆచార వ్యవహారాలను, జీవితాన్ని( life ) వివరించారు.

పని చేసిన అధికారులకు గుర్తింపు.. బంధోపాధ్యాయ (bandh opadyaaya)  రాసిన వన వాసి పుస్తకం చదివినప్పుడు ప్రకృతి ప్రాముఖ్యత అర్ధం అయ్యింది. ఇప్పుడు నేను దేవుని దయతో ఉప ముఖ్యమంత్రి, అటవీశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాను. అం తర్జాతీయ పులుల దినోత్సవాన ( tigers day) అధికారులకు మా టిస్తున్నాను. ఇక్క డ ఎంతో నిబద్దత కలిగిన అధికారులు ఉన్నారు. అద్భుతంగా పని చేసిన కొంత మంది అధికారులకు గుర్తింపు రాలే దన్న విషయం నాకు తెలిసింది. గుర్తింపు ఇచ్చే బాధ్యత నేను తీసు కుంటానన్నారు.

మీరు చేసిన పని పది మందికి తెలిస్తే అది భవిష్యత్ తరాలకు స్ఫూ ర్తినిస్తుంది. అధికారులు అటవీ పర రిక్షణ కోసం కలలు కనండి. ప్ర ణాళికలు సిద్ధం చేయండి. వాటిని అమలుపరిచే బాధ్యత నేను తీసుకుంటా. ప్రజలకు చేరువయ్యేలా పని చేద్దాం. అవసరం అయితే అధికారులు చెప్పిన విధంగా పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యం విధానం లో జూ పార్కులు అభివృద్ధి చేద్దాం. అటవీశాఖ మంత్రిగా, పర్యావ రణ ప్రేమికుడిగా పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉంటానన్నారు. అటవీ శాఖలో ఉద్యోగుల కొరత, సమస్యల పరిష్కారానికి ముందు కు వెళ్తాము. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి అట వీ శాఖకు బడ్జెట్ పెంచే విధంగా, ఉద్యోగుల కొరత భర్తీ చేసే విధం గా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.

శ్రీశైలం నుంచి శేషాచలం వర కూ అటవీ కారిడార్ …పెద్ద పులుల సంఖ్యను పెంచేందుకు ప్రణాళికబ ద్ధంగా చర్యలు తీసుకుంటాము. నల్లమల, శ్రీశైలం( srishailam) నుంచి శేషాచలం వరకు ప్రత్యేక కారిడార్ ఏర్పాటు చేసి అడవులను పెంచేందుకు కృషి చేస్తాము. టైగర్ రిజర్వ్ ( tiger reserves) పరిధిలో ఉన్న పులుల సంరక్ష ణకు పటి ష్టమైన చర్యలు తీసుకుందాం. వేట గాళ్లను ఉపేక్షించవ ద్దు. అటవీ ప్రాంతాల్లో స్థానికులకు జంతు జాలం ఆవశ్యకతపై అవ గాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించాలి. అదే విధంగా శ్రీశైలం క్షేత్ర పరిసరాల్లోని అడవుల్లో ప్లాస్టిక్ ( plostic) వినియోగం పై  రుగుతోందని అధికారులు నా దృష్టికి తీసుకు వచ్చారన్నారు.

పర్యావరణహితమైన ఆధ్యాత్మిక యాత్రలు చేసేలా భక్తులకు అవగా హన కల్పించాలని ప్రకృతి పరిరక్షణకు ఉద్యోగులు చేస్తున్న కృషిని అభినందిస్తూ రస్కిన్ బాండ్ రాసిన కవితను చదివి వినిపిం చారు. పీసీసీఎఫ్ ( hoff ) చిరంజీవి చౌదరికి ‘సీక్రెట్ నెట్వర్క్ ఆఫ్ నేచర్’ అనే పుస్తకాన్ని పవన్ కళ్యాణ్ బహూకరిం చారు. బొబ్బిలి ఎమ్మెల్యే( bobili mla ) నాయన ప్రత్యేక అతిధిగా పాల్గొన్నారు. ఈ కార్య క్రమంలో అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంతరాము, అట వీశాఖ ఉన్నతాధికారులు ఎ.కె.నాయక్, ఖజూరియా, సుమన్, రేవ తి, రాహుల్ పాండే, శాంతిప్రియ పాండే, శరవణన్ తదితరులు పాల్గొన్నారు.

Pawan Kalyan tigers