MLA Vivek:కేసీఆర్, జగన్ లకు ప్రజలు బుద్ధి చెప్పారు
తెలుగు రాష్ట్రాల మాజీ సీఎంలపై చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో కేసీఆర్, జగన్ కు ప్రజలు బుద్ధి చెప్పారని అన్నా రు.
తెలుగు రాష్ట్రాల మాజీ సీఎంలపై చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వ్యాఖ్య
ప్రజా దీవెన, తిరుపతి: తెలుగు రాష్ట్రాల మాజీ సీఎంలపై చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి(MLA Vivek Venkata Swamy) ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో కేసీఆర్, జగన్(Jagan) కు ప్రజలు బుద్ధి చెప్పారని అన్నా రు. అహంకారంతో విర్రవీగితే ప్రజ లు ఇలాగే సమాధానం చెప్తారని ఘాటుగా స్పందించారు. ఈ మేరకు ఎమ్మెల్యే వివేక్(MLA Vivek), పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, తిరుమల శ్రీవారిని(Tirumala Srivarini)దర్శించుకున్నారు. అనంతరం మీడి యాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్య లు చేశారు. ప్రజలను ఎప్పుడు తక్కువ అంచనా వేయవద్దని హితవు పలికారు.
people not elected jagan and kcr