పెట్రోల్ బంక్ బ్లాస్ట్
— భారీ శబ్దంతో ఎగసిపడిన మంటలు
ప్రజా దీవెన/ తూర్పుగోదావరి: తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం తొస్సిపూడి గ్రామంలో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. పేలుడు ధాటికి భారీ శబ్దం రావడంతో ప్రజలు భయబాంత్రులకు గురయ్యారు. సంఘటనకు సంబంధించి పూర్వపరాలు ఇలా ఉన్నాయి.
తొస్సిపూడి గ్రామంలోని ఇండియన్ బంక్ ప్రక్కన ఉన్న షెడ్డులో బాణాసంచా నిల్వ ఉంచారు. అకస్మాత్తుగా బాణాసంచా పేలుడు సంభవించడంతో ఆ పక్కనే ఉన్న పెట్రోల్ బంక్ కు మంటలు వ్యాపించి బంకు సైతం ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలింది. ఉదయం పూట ఈ ప్రమాదం జరగడంతో పెద్దగా జనసంచారం లేకపోవడంతో అదృష్టవశాత్తు ప్రాణ నష్టం తప్పింది.
అయితే ఈ ఘటనలో బంక్ ప్రక్కన వున్న గాయత్రి రైస్ మిల్ స్వల్పంగా ధ్వంసమైంది. బంక్ పేలుడుతో భూకంపం వచ్చినట్లు శబ్దాలు వినిపించాయని చుట్టుపక్కల మూడు గ్రామాల్లోని ప్రజలు చెబుతున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..