Amaravati Secretariat: అమరావతి సచివాలయంలో సోదాలు
ఆంద్రప్రదేశ్ సచివాలయంలోని ఐటీ విభాగంలో బుధవారం ఉదయం పోలీసు అధికారులు తనిఖీలు నిర్వహించారు.
ఐటి, సమాచార విభాగాలలో కొనసాగుతోన్న సోదాలు
డేటా ధ్వంసం చేసినట్లు సమాచారంతో తనిఖీలు
కొత్త డేటా బయటకు వెళ్లి ఉండవచ్చని అనుమానం
ప్రజా దీవెన, అమరావతి: ఆంద్రప్రదేశ్ ( Andhra pradesh Secretariat)సచివాలయంలోని ఐటీ విభాగంలో (IT Department) బుధవారం ఉదయం పోలీసు అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఐటీ కమ్యూ నికేషన్ విభాగంలో ఉద్యోగుల కంప్యూటర్‌లు, ల్యాప్ ట్యాప్‌లు, ఇతర పరికరాలను తనిఖీ చేశారు. ఐటీ విభాగంలోని కంప్యూటర్‌ల నుంచి డేటా తస్కరణకు, డిలీట్ చేసేందుకు ప్రయత్నాలు జరిగా యన్న ఆరోపణల నేపథ్యంలో అధికారుల తనిఖీలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఉద్యోగుల నుంచి పెన్‌డ్రైవ్‌లు(Pen drive), డేటా హార్డ్ డ్రైవ్‌లను(Hard drive) స్వాధీనం చేసుకున్నారు. సర్వర్‌లలో డేటా డిలీట్ చేసేందుకు ప్రయత్నాలు జరిగాయని ఆరోపణ లు రావడంతో పోలీసులు తనిఖీలు చేశారని ఐటీశాఖ ఉన్నతాధికారు లు తెలిపారు.
Searches at Amaravati Secretariat