Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Srikalahasti politics: హాట్ సీట్ గా శ్రీకాళాహస్తి

రాహు కేతు క్షేత్రం శ్రీకాళహస్తి వైసీపీ టిడిపిలకు హాట్ సీట్‎గా మారింది. ఎన్నికలకు ముందు నుంచే ఒకరిపై ఒకరు చాలెంజ్ లు, ఆరోపణలు, సవాళ్ళతో దూసుకుపోతున్నారు.

టీడీపీ వైసీపీ మధ్య వార్ ఫీక్స్
మధుసూదన్ రెడ్డి, సుధీర్ డైలాగ్ వార్

ప్రజాదీవెన, శ్రీకళాహస్తి: రాహు కేతు క్షేత్రం శ్రీకాళహస్తి వైసీపీ టిడిపిలకు హాట్ సీట్‎గా మారింది.(Assembly Elections) ఎన్నికలకు ముందు నుంచే ఒకరిపై ఒకరు చాలెంజ్ లు, ఆరోపణలు, సవాళ్ళతో దూసుకుపోతున్నారు. అయితే ఇప్పుడు వార్ పీక్స్‎కి చేరుకుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ వర్సెస్ బొజ్జల సుధీర్ మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. అభివృద్ధి, అవినీతిపై బహిరంగ చర్చకు సాక్షాలతో సిద్ధమంటున్న ఇద్దరు నేతలు సార్వత్రిక ఎన్నికల్లో అమీ తుమీ తెలుసుకునేందుకు సిద్ధమయ్యారు. ముక్కంటి సాక్షిగా ఆ ఇద్దరి మధ్య పోటీ.. సంక్షేమం, అభివృద్దిపై చర్చకు సిద్దం అంటూ సవాల్ చేస్తున్న ఎమ్మెల్యే..

రాహు కేతు క్షేత్రం శ్రీకాళహస్తి(Srikalahasti )వైసీపీ టిడిపిలకు హాట్ సీట్‎గా మారింది. ఎన్నికలకు ముందు నుంచే ఒకరిపై ఒకరు చాలెంజ్ లు, ఆరోపణలు, సవాళ్ళతో దూసుకుపోతున్నారు. అయితే ఇప్పుడు వార్ పీక్స్‎కి చేరుకుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ వర్సెస్ బొజ్జల సుధీర్ మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. అభివృద్ధి, అవినీతిపై బహిరంగ చర్చకు సాక్షాలతో సిద్ధమంటున్న ఇద్దరు నేతలు సార్వత్రిక ఎన్నికల్లో అమీ తుమీ తెలుసుకునేందుకు సిద్ధమయ్యారు.

శ్రీకాళహస్తి దక్షిణకాశీగా విరాజిల్లుతున్న పుణ్యక్షేత్రం. రాజకీయంగా కూడా ఎప్పుడూ హాట్ సీటే. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, కూటమి అభ్యర్థిగా టిడిపి నుంచి బరిలో ఉన్న బొజ్జల సుధీర్ రెడ్డి మధ్య పోరు ఈ ఎన్నికల్లో ప్రతిష్టాత్మకంగా మారింది. అభివృద్ధిని సాక్ష్యాలతో చూపించేందుకు సిద్ధమని ఒకరు.. అంతా అవినీతే అన్న ఆరోపణలతో మరొకరు ఇలా వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‎కు.. టిడిపి అభ్యర్థి బొజ్జల సుధీర్‎కు మధ్య డైలాగ్ వార్ ఎన్నికల వేళ అగ్గి రాజేస్తోంది. ఎన్నికలకు ఏడాది ముందు నుంచే ఇద్దరి మధ్య వ్యక్తిగత దూషణలు, సెల్ఫీ చాలెంజ్‎లు, ఆరోపణలు, విమర్శలు, సవాళ్లు, శ్వేత పత్రం డిమాండ్‎లు వినిపించగా ఎన్నికల నామినేషన్ల పర్వం మొదలు కావడంతో ఇప్పుడు మరింత హిట్ పెరిగింది.

లోకల్, నాన్ లోకల్ అన్న విమర్శలు కూడా శ్రీకాళహస్తి రాజకీయాన్ని(Srikalahasti politics) మరింత రంజుగా మార్చేసింది. టిడిపి అధినేత చంద్రబాబు నుంచి బొజ్జల సుధీర్ వరకు ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డిపై చేస్తున్న తీవ్ర ఆరోపణలు, కౌంటర్ ఎటాక్‎లు ఇప్పుడు శ్రీకాళహస్తిలో రీసౌండ్‎గా మారాయి. దాదాపు 40 ఏళ్లకు పైగా రాజకీయాల్లో ఉన్న బొజ్జల ఫ్యామిలీ చేసిన అభివృద్ధి ఏంటో, ఐదేళ్లలో వైసీపీ అందించిన సంక్షేమం, చేసిన అభివృద్ధి ఏంటో బుక్ లెట్‎తో ఇంటింటి ప్రచారం చేస్తున్నారు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. అలాగే తన గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఆస్తులపై ఇన్కమ్ టాక్స్ వద్ద తేల్చుకుందామంటున్న ఎమ్మెల్యే మధు ఆస్తుల వివరాలతో చర్చకు సిద్ధమని సవాలు విసురుతున్నారు. ఎలాంటి చర్చకైనా సిద్ధమనీ, దేనికైనా రెడీ అంటున్న బియ్యపు మధుసూధన్ టిడిపి అభ్యర్థి బొజ్జల సుధీర్ తనకు పోటీనే కాదంటున్నారు. పోటీ ఇస్తే అది సైజులో మాత్రమేనని సెటైర్లు వేస్తున్నారు. 30 ఏళ్లలో బొజ్జల ఫ్యామిలీ అభివృద్ధి చేసి ఉంటే ఈ 5 ఏళ్ల లో అభివృద్ధి పనులు చేయాల్సిన పనే ఉండేది కాదంటున్నారు ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి. ఎన్నో సేవా కార్యక్రమాలు శ్రీకాళహస్తిలో చేశానంటున్నారు ఆయన. బొజ్జల కుటుంబం 30 ఏళ్లలో చేసిన అవినీతిని బయట పెడతానంటున్నారు.

సుధీర్ అన్నట్లు తాను సునామీలో కొట్టుకొచ్చిన గవ్వనే అయినా శంఖంలా శివుడికి ఉపయోగపడుతున్నానంటున్నారు ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి. అభివృద్ధి‎పై శ్వేత పత్రమే కాదు, కలర్ ఫోటోలతో కూడిన బుక్ లెట్ ఇంటింటికి అందచేస్తున్నానంటున్నారు. జరిగిన అభివృద్దిన, సంక్షేమాలపై చర్చకే కాదని టీవీ9 మీడియాతో వస్తే సాక్షాలతో చూపించేందుకు సిద్ధమంటున్నారు. తాను లోకల్ అంటూ అభివృద్ధి జరగలేదని నిరూపించే దమ్ము నాన్ లోకల్ అయిన టిడిపి అభ్యర్థి బొజ్జల సుధీర్‎కు ఉందా అని ప్రశ్నిస్తున్నారు.

srikalahasti politics