–ఇద్దరు భార్యలు కలిసి భర్తకు మూడో వివాహం చేసిన వైనం
–మూడో వివాహానికి ఏర్పాట్లలో పెళ్లి ఆహ్వాన పత్రికలు సైతం
Third marriage: ప్రజా దీవెన, అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే సంఘటన వెలుగు చూసింది. భర్త రెండో పెళ్లి చేసుకుంటేనే మొదటి భార్య క్షణం ఆలోచించ కుండా కేసు పెట్టేసే ఈ రోజుల్లో ఇప్పటికే ఇద్దరిని వివాహం (marraiage) చేసుకు న్న వ్యక్తికి అతడి ఇద్దరు భార్యలే మూడో వివాహం (Third marriage) చేయడం గమనా ర్హం. ఏపీ లోని అల్లూరి సీతారామ రాజు జిల్లా పెదబయలు మండలం గుల్లెలు పంచాయతీ కించూరు గ్రామంలో ఈ సంఘటన చోటుచేసు కుంది. జూన్ 25న ఈ పెళ్లి జరుగ గా మారుమూల ప్రాంతం కావడం తో విషయం ఆలస్యంగా వెలుగులో కి వచ్చింది. కించూరుకు చెందిన సాగెని పండన్నకు పార్వతమ్మతో మొదటి వివాహం జరిగింది.
ఆమెకు పిల్లలు పుట్టకపోవడంతో కొన్నా ళ్లకు అప్పలమ్మ అనే మహిళను రెండో వివాహం (second marriage)చేసుకున్నాడు. ఈమెకు ఓ కుమారుడు కలిగాడు. అయినా పండన్న జి.మాడుగుల మండలం కిల్లంకోట పంచాయతీ బందవీధి గ్రామానికి చెందిన లక్ష్మి అలియాస్ లావ్యపై మనసుపడ్డా డు. ఈ విషయాన్ని ఇద్దరు భార్యల తో చెప్పి ఆమెను మూడో వివాహం చేసుకునేందుకు ఒప్పించాడు. దీం తో ఇద్దరు భార్యలు భర్త మూడో వివాహానికి ఏర్పాట్లు చేశారు. పెళ్లి ఆహ్వాన పత్రికలు (Wedding invitations)ముద్రించి మరీ పంచిపెట్టారు. జూన్ 25న ఘనంగా వివాహం జరిపించి, విందు ఏర్పా టు చేయడం కొసమెరుపు.