–పదిహేను మంది దుర్మరణం, 60మంది వరకు గాయాలపాలు
–పశ్చిమ బెంగాల్‌లో రెండు రైళ్లు ఢీ కొన్న సంఘటన
–విచారం వ్యక్తం చేసిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ
Train Accident: ప్రజా దీవెన, బెంగాల్: పశ్చిమ బెం గాల్‌లో సోమవారం ఉదయo జరి గిన ఘోర రైలు ప్రమాదం ( Train Accident) బయో త్పాతం సృష్టించింది. రెండు రైళ్లు ఢీ కొన్న ఘటనలో 15 మంది దుర్మర ణం పాలు కాగా దాదాపు 60 మం దికిపైగా తీవ్ర గాయాల పాలయ్యా రు. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu), ప్రధాని మోదీ (PM MODI) విచారం వ్య క్తం చేశారు. మృతుల కుటుంబాల కు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ‘డార్జిలింగ్‌లో జరిగిన రైలు ప్రమా దంలో పలువురు మరణించిన వార్త బాధ కలిగించింది.మృతుల కుటుం బాలకు సానుభూతి తెలియజే స్తు న్నా. క్షతగాత్రులు త్వరగా కోలు కో వాలని ప్రార్థిస్తున్నానని రాష్ట్రపతి ఎక్స్‌లో పేర్కొన్నారు. రైలు ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ (PM MODI) సైతం విచారం వ్యక్తం చేశారు. ‘బెంగాల్‌లో జరిగిన రైలు ప్రమాదం బాధాకరం. బాధిత కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నా. క్షతగాత్రులు త్వ రగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. సహాయక చర్యలు కొనసాగుతు న్నాయని మోదీ (MODI)ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషి యాను కేంద్ర ప్రభుత్వం (CENTRAL GOVERNMEMNT)ప్రకటించిం ది. గాయపడిన వారికి రూ.50వేలు ఇస్తామని పీఎంఓ తెలిపింది. అసోం లోని సిల్చార్ నుంచి కోల్‌కతా లోని సెల్దాకు బయల్దేరిన కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్ రైలును న్యూజల్‌పాయ్ గుడి జంక్షన్ సమీపంలోని రంగ పాని స్టేషన్ వద్దకు రాగానే అదే ట్రాక్‌పై వెనుకనుంచి వచ్చిన ఓ గూడ్స్ రైలు బలంగా ఢీ కొట్టింది. దీంతో కాంచన్‌జంగా రైలుకు చెం దిన ఓ బోగీ గాల్లోకి లేచింది. ప్రమా ద తీవ్రతకు బోగీలు చెల్లాచెదుర య్యాయి. పరిస్థితిని సీఎం మమ తా బెనర్జీ సమీక్షించారు. బాధితుల కు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలు స్తుందని భరోసా ఇచ్చారు. కాగా ఈ ఘటనలో మృతుల సంఖ్య ఇంకా పెరుగుతుందని అధికారులు చెబు తున్నారు.
ఇదిలా ఉండగా ఆ తర్వాత కేంద్రం అనుమతితో ఎక్స్‌గ్రేషియా (Exgratia) పెంపు ను అశ్విని వైష్ణవ్ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2.5 లక్షలు, స్వలంగా గాయ పడిన బాధితులకు రూ.50,000 ఎక్స్‌గ్రేషియా కంపెన్సేషన్ ఇవ్వ నున్నట్టు ప్రకటించారు. ఎన్‌ఎఫ్ఆర్ జోన్‌లో ప్రమాదం జరగడం దురదృ ష్టకమని, యుద్ధప్రాతిపదికన సహా యక చర్యలు జరుగుతున్నాయని అశ్వని వైష్ణవ్ తెలిపారు. రైల్వే, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్ఎఫ్ పూర్తి సమన్యయంతో చర్యలు చేపట్టిన ట్టు చెప్పారు. క్షతగాత్రులను ఆసు పత్రికి తరలిస్తున్నారని, సీనియర్ అధికారులు ఘటన స్థలికి చేరుకు న్నారని వివరించారు. మృతుల సంఖ్య ఎంతనేది మాత్రం ఆయన తన పోస్ట్‌లో స్పష్టం చేయలేదు. బోగీలలో చిక్కుకున్న వారిని వెలికితీసే చర్యలు కొనసాగుతు న్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పలు వార్తా సంస్థలు చెబుతున్నాయి.