Vijayasai Reddy : ప్రజా దీవెన ,అమరావతి: ఏపీలో వైస్సార్సీపీ పార్టీకి మరో షాక్. వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి సంచలన ప్రకటన చేశారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తన రాజ్యసభ సభ్యత్వానికి రేపు (జనవరి 25న) రాజీనామా చేయనున్నట్లు వెల్లడించారు.
“ఏ రాజకీయపార్టీలోనూ చేరడంలేదు. వేరే పదవులో, ప్రయోజనాలో లేక డబ్బులో ఆశించి రాజీనామా చేయడంలేదు. ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తిగతం. ఎలాంటి ఒత్తిళ్లులేవు. ఎవరూ ప్రభావితం చేయలేదు” అని ట్వీట్ చేశారు.