Worst in Anantapur: అనంతపురంలో అత్యంత దారుణం
-- దంపతులను కొడవలితో హత్య చేసిన దుండగుడు -- గ్రామస్థుల దాడిలో అక్కడికక్కడే మరణించిన నిoదితుడు
అనంతపురంలో అత్యంత దారుణం
— దంపతులను కొడవలితో హత్య చేసిన దుండగుడు
— గ్రామస్థుల దాడిలో అక్కడికక్కడే మరణించిన నిoదితుడు
ప్రజా దీవెన/ అనoతపురం: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అనంతపురం జిల్లాలో అత్యంత దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి చేతిలో దంపతులు హత్యకు గురి కాగా వారి కుమార్తె కూడా హత్యా యత్నానికి గురైంది. ఆమె కేకలు వేయటంతో తప్పించుకునేందుకు ప్రయత్నించిన నిదితున్ని స్థానికులు చుట్టుముట్టి రాళ్లతో దాడి చేసి హతమార్చారు.
ఈ దుర్గటన స్థానికంగా సంచలనం సృష్టించిoది. స్ధానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యాడికి మండలం నిట్టూరులో సోమ్మక్క(47), బాలరాజు(53) దంపతులు నిన్న రాత్రి వారి ఇంటి ముందు నిద్రస్తున్న సమయంలో అదే ప్రాంతానికి చెందిన ప్రసాద్(35) అనే వ్యక్తి దంపతులపై కొడవలితో దారుణంగా దాడి చేసి హత్య చేయడమే కాకుండా వారి పక్కనే నిద్రిస్తున్న కుమార్తెను కూడా హత్య చేయాలని భావించాడు.
ఇంతలోనే ఆమె తేరుకొని కేకలు వేయగా అరుపులు విన్న స్థానికులు హత్యకు దిగిన వ్యక్తిని పట్టుకున్నారు. ఈ క్రమంలో నిoదితుడు ప్రసాద్ పారిపోయే ప్రయత్నం చేయడంతో స్థానికులు రాళ్లతో దాడి చేసి హతమార్చారు. హంతకుడు ప్రసాద్‌కు మతిస్థిమితం లేదని, గ్రామంలో ఒకేసారి ముగ్గురు చనిపోవటంతో విషాదఛాయలు అలుముకున్నాయి.