Beheading case: వైసీపీ అభ్యర్థికి జైలు శిక్ష
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన 1996 నాటి శిరోముండనం కేసులో విశాఖ కోర్టు తీర్పు వెల్లడించింది. ఈ కేసులో నిందితుడిగా వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు జైలు శిక్ష విధించింది.
1996 నాటి కేసులో విశాఖ కోర్టు తీర్పు
18 నెలల జైలు శిక్ష, 2 లక్షల జరిమానా
ప్రజాదీవెన, విశాఖ: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన 1996 నాటి శిరోముండనం(Beheading case) కేసులో విశాఖ కోర్టు తీర్పు వెల్లడించింది. ఈ కేసులో నిందితుడిగా వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు జైలు శిక్ష విధించింది. తోట త్రిమూర్తులకు 18 నెలల జైలు శిక్ష, 2 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. మరోవైపు తోట త్రిమూర్తులు ప్రస్తుతం వైసీపీ తరుఫున అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మండపేట నుంచి వైసీపీ అభ్యర్థిగా తోట త్రిమూర్తులు బరిలో ఉన్నారు.
1996 లో ఘటన జరగ్గా.. 28 ఏళ్లపాటు వివిధ కోర్టుల్లో ఈ కేసు విచారణ కొనసాగింది. విశాఖ కోర్టులోనూ సుధీర్ఘకాలం విచారణ జరిగింది. ఎట్టకేలకు తోట త్రిమూర్తులకు జైలు శిక్ష విధిస్తూ విశాఖకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. 1996 డిసెంబర్ 29న తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో ఈ ఘటన జరిగింది. ఐదుగురు దళిత యువకులను చిత్రహింసలు పెట్టారు. ఇద్దరు యువకులకు గుండు కొట్టించి, కనుబొమ్మలు గీయించి అవమానించారు. ఈ ఘటన అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో పది మందిని నిందితులుగా పోలీసులు గుర్తించారు. ప్రధాన ముద్దాయిగా అప్పటి ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఉన్నారు.
ఇక బాధితుల్లో ఒకరు చనిపోగా.. మిగిలిన నలుగురు న్యాయం కోసం కోర్టుల్లో పోరాడుతూనే ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి ప్రధాన సాక్షి కోటి రాజు సైతం చనిపోయారు. అయితే ఇన్నే్ళ్ల నుంచి దళిత సంఘాలు న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నాయి. అయితే 28 ఏళ్ల తర్వాత ఈ కేసుపై విశాఖ ఎస్సీ ఎస్టీ కోర్టు తీర్పు వెలువరించింది, కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యీ తోట త్రిమూర్తులకు 18 నెలల జైలు శిక్షతో పాటుగా రెండు లక్షల జరిమానా కూడా విధించింది. మొత్తం 10 మందిని కోర్టు దోషులుగా గుర్తించింది. మరోవైపు ఇన్నేళ్ల తర్వాత కోర్టు తీర్పు ప్రకటించడంతో బాధితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
YCP candidate jail sentence for Beheading case