–వైయస్ జగన్ ఇంటి ముందు అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై చర్యలు
–ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్ బోర్కడే పై వేటు
–అక్రమ నిర్మాణ కొలిచివేతలకు రాజకీయ రంగు
YS JAGAN : హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ( YS JAGAN MOHAN REDDY) ఇంటి ముందు గల అక్రమ నిర్మా ణాలను జీహెచ్ఎంసీ (GHMC) సిబ్బంది కూల్చి వేశారు. అవి అక్రమ నిర్మా ణాలు అని చర్యలు తీసుకున్నారు. ఖైరతాబాద్ (KHAIRTHABAD) జోనల్ కమిషనర్ హేమంత్ బోర్కడే ఆదేశాలతో కూల్చివేత ప్రక్రియ కొనసాగింది. వాస్తవానికి హేమంత్‌కు ఉన్నతాధి కారుల నుంచి ఆదేశాలు రాలేదని, తెలంగాణకు చెందిన ఓ మంత్రి స్వయంగా హేమంత్‌కు ఆదేశాలు ఇ చ్చారని విశ్వసనీయంగా తెలిసింది. దాంతో హేమంత్ అక్రమ నిర్మాణా లపై ఉక్కుపాదం మోపారు. ఏపీలో వైసీపీ ఓడిపోయిన వెంటనే ఘటన జరగడంతో తీవ్ర చర్చకు దారి తీసింది.జగన్ (JAGAN) ఇంటి ముందు నిర్మా ణాల కూల్చివేత అంశం తెలంగాణ (TELANGANA) రాష్ట్రంలో చర్చ జరిగింది. ఏం జరి గిందా అని ఆరాతీస్తే ఇటీవల బా ధ్యతలు స్వీకరించిన గ్రేటర్ కమి షనర్ ఆమ్రపాలి స్వయంగా రంగం లోకి దిగారు. కూల్చివేతల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేయలేదని తెలిసింది. ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్ బోర్కడే సొంతంగా నిర్ణయం తీసుకున్నారని సమాచారం. పై అధికారులకు హే మంత్ రిపోర్ట్ చేస్తే బాగుండేది. చెప్పకపోవడంతో హేమంత్‌ను (HEMANTH) ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ పదవి నుంచి బదిలీ చేశారు. ఈ మేరకు జీఏడీలో రిపోర్ట్ చేయాలని కమిష నర్ ఆమ్ర పాలి ఆదేశాలు జారీచేశా రు. హైదరాబాద్ లోటస్ పాండ్ వద్ద ఏపీ మాజీ సీఎం జగన్ ఇంటి ముం దు గల అక్రమ నిర్మాణా ల కూల్చి వేత అంశం సర్వత్రా చర్చ కు దారి తీయడంతో బల్దియా అధికా రులు కూల్చివేయడం చర్చానీయాంశ మైంది. విషయం ఆరా తీస్తే జోనల్ కమిషనర్ సొంత నిర్ణయమని తెలి సింది.