Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

ysrcp: ఈనెల 19న వైఎస్సార్ సీపీ సమావేశం

ysrcp

ysrcp: ప్రజా దీవెన అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో (andhara pradesh) ఈనెల 19న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విస్తృతస్థాయి సమా వేశం జరగనుంది. మాజీ ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) అధ్యక్షతన ఈనెల 19న ఉదయం 10:30గంటలకు తాడేపల్లి (Tadepalli) క్యాంపు కార్యా లయంలో సమావేశం నిర్వ హించనున్నారు. ఈ మేరకు పార్టీ ఎమ్మెల్యేలతో సహా ఇటీవల సార్వ త్రిక ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపో యిన అభ్యర్థులందరికీ ఇప్పటికే ఆహ్వానం పంపారు. నలుగురు ఎంపీలు మినహా పార్లమెంట్‌కు పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థు లకు కూడా ఆహ్వానం పంపిం చారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ (Andhra Pradesh Assembly), లోక్ సభ ఎన్నికల్లో (Lok Sabha elections)ఘోర పరాజయం తర్వాత పార్టీ ఎమ్మెల్యేలు, ఓడి పోయిన అభ్యర్థులతో జగన్ అధికారికంగా సమావేశం కావడం ఇదే తొలిసారి. వారం రోజుల క్రితం శాసన మండలి సభ్యులతోనూ ఆయన సమావేశమై వారికి దిశానిర్దేశం చేసిన విషయం తెలిసిందే. అలాగే పార్టీ ఎమ్మె ల్యేలు, ఓడిపోయిన అభ్యర్థు లతోనూ సమావేశమై తదుపరి కార్యచరణపై వారితో చర్చించ నున్నారు. రాష్ట్రంలో కేవలం 11సీట్లకే పరిమితం కావడంపై సుదీర్ఘ చర్చలు జరగనున్నట్లు సమాచారం. ఓటమికి గల కారణాలపై చర్చించి, అధికార పార్టీని ఎలా ఎదుర్కోవాలో జగన్ (jagan) వారికి దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం.0