Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

YSR CP Manifesto : నవరత్నాలు + వైసీపీ మేనిఫెస్టో

ఆంధ్రప్ర దేశ్ లో వైసీపీ త‌న మేనిఫెస్టోని నవరత్నాలు ప్లస్ పేరుతో విడుదల చేసింది.

వైఎస్సార్ చేయూత రూ.75 వేల నుంచి రూ.1.50 లక్షలకు పెంపు
వైఎస్సార్ కాపునేస్తం నాలుగు దఫాల్లో 60 వేల నుంచి లక్షా 20 వేలకు పెంపు
వైఎస్సార్ ఈబీసీ నేస్తం 4 దఫాల్లో రూ.45 వేల నుంచి రూ. లక్ష 5 వేల కు పెంపు
అమ్మఒడి రూ.15 వేల నుంచి రూ.17 వేలకు పెంపు
వైఎస్సార్ సున్నా వడ్డీ కింద రూ.3 లక్షల వరకు రుణాలు
అర్హులై ఇళ్లస్థలాలు లేనివారికి ఇళ్ల స్థలాలు అందజేత
వైఎస్సార్ కల్యాణమస్తు, షాదీ తోఫా కొనసాగింపు
రెండు విడతల్లో పెన్షన్ రూ.3500 కు పెంపు
మేనిఫెస్టోను బైబిల్, ఖురాన్, భగవద్గీతగా భావిస్తున్నామన్న ఏపి సీఎం జగన్

ప్రజా దీవెన, అమరావతి: ఆంధ్రప్ర దేశ్ లో వైసీపీ(YCP) త‌న మేనిఫెస్టోని నవరత్నాలు ప్లస్ పేరుతో విడుదల చేసింది. ఏపి సీఎం జ‌గ‌న్(CM Jagan) తాడేప‌ల్లి లోని ఆ పార్టీ కార్యాల‌యంలో మేని ఫెస్టోను ఆవిష్క‌రించారు. మేనిఫె స్టోను బైబిల్, ఖురాన్, భగవద్గీతగా భావిస్తున్నాన‌ని ఈ సందర్భంగా జగన్ పేర్కొన్నారు. అన్న ఆ ప్రకార మే 2019లో అమలు చేశామన్నా రు. దేశ చరిత్రలోనే ఈ 58 నెలలు చిరస్థాయిగా నిలిచిపోతాయని తెలిపారు.

ప్రతీ ప్రభుత్వ కార్యాల యంలోని ఉద్యోగి దగ్గరా వైసీపీ మేనిఫెస్టో(YCP Manifesto) ఉందన్న సీఎం జగన్ రాష్ట్రంలోని ప్రతీ ఇంటికీ మేనిఫె స్టోని పంపామని చెప్పారు. అమలు చేసిన వాటిని టిక్ చేసుకోమని సూచించామని 99 శాతానికి పైగా మేనిఫెస్టోని అమలుచేశామని స్పష్టం చేశారు.నవరత్నాల(Navaratnalu) పథకాల ద్వారా 58 నెలల్లో, రూ.2 లక్షల 70వేల కోట్ల రూపాయలను డీబీటీ రూపంలో లబ్దిదారులకు ఇచ్చామ ని దేవుడి దయతో ఇలా చెయ్యగలి గామని పేర్కొన్నారు.

చరిత్రలో ఒక హీరోగా ఇవాళ ప్రజల దగ్గరకు వెళ్తు న్నానని, తన పాదయాత్రలో చూసి న సమస్యలకు పరిష్కారాలను మేనిఫెస్టోలో పెట్టామని గుర్తు చేశారు. ఆ దిశగానే 58 నెలల పాలన సాగిందని, కరోనా రెండేళ్ల పాటూ రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టి, ఆదాయం పడిపోయేలా చేసినా, మేనిఫెస్టో అమలు మాత్రం కచ్చి తంగా చేశామన్నారు. సాకులు చూపకుండా చిరునవ్వుతోనే ప్రజలకు తోడుగా ఉన్నామన్నారు.

ఎక్కడా లంచాలు, వివక్ష లేకుండా ప్రతీ పథకాన్నీ నేరుగా బటన్ నొక్కి లబ్దిదారుల అకౌంట్లలో మనీ పడేలా చేశామని వివరించారు. ఎమ్మెల్యేలను (MLA)కూడా ప్రజల దగ్గరకు ముందుగానే, గడప గడపకూ తిప్పుతూ ప్రజలకు జరిగిన మంచి ని వివరించామన్నారు. దేశ చరిత్ర లో ఇలా ఎక్కడా జరిగివుండదని చెప్పారు. గత మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు రూ.2 లక్షల 70 వేల కోట్లను డీబీటీ ద్వారా అందించామన్నారు.

ఇచ్చిన హామీలను చెప్పిన టైమ్ ప్రకారం అమలు చేసి ప్రజల్లో హీరోగా నిలిచామని సీఎం జగన్ పేర్కొన్నారు. పిల్లలకు ఫీజు రీఎంబర్స్ మెంట్,(Fee Reimbursement)అర్హులకు ఇళ్లు, పెన్షన్లు, అర్హులైన వారికి పథకాలను అందించినట్లు తెలిపారు. 14 ఏళ్ల పాలనలో చంద్రబాబు సంపద సృష్టించకపోగా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడని విమర్శించారు.

2014లో కూటమి పార్టీలు ఇచ్చిన హామీలను సరిగ్గా అమలు చేయ లేకపోయారని, ఇప్పుడు సూపర్ సిక్స్ అంటూ ప్రజలను మరోసారి మోసం చేసేందుకు వస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు సంపద సృష్టి, సమర్థ ఆర్థిక పాలన లేదని విమర్శించారు. ఐదేళ్ల పాలనలో చంద్రబాబు 31 వేల ఉద్యోగాలు మాత్రమే ఇస్తే వైసీపీ పాలనలో 2 లక్షలకు పైగా ఉద్యో గాలు ఇచ్చామని తెలిపారు.
ఆ ప్రకారమే 2019లో అమలు చేశామన్నారు. దేశ చరిత్రలోనే ఈ 58 నెలలు చిరస్థాయిగా నిలిచిపో తాయి అన్నారు. ప్రతీ ప్రభుత్వ కార్యాలయంలోని ఉద్యోగి దగ్గరా వైసీపీ మేనిఫెస్టో ఉందన్న సీఎం జగన్ రాష్ట్రంలోని ప్రతీ ఇంటికీ మేనిఫెస్టోని పంపామని అన్నారు. అమలు చేసిన వాటిని టిక్ చేసుకోమని చెప్పామన్న జగన్.. 99 శాతానికి పైగా మేనిఫెస్టోని అమలుచేశామన్నారు.

YSRCP Manifesto Navaratnalu released