Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

బెట్టింగ్‌లతో బెంబేలు

ఆంధ్రప్ర దేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్ లు బెంబేలెత్తిస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో విజయంపై ఓట్ల లెక్కిం పునకు ముందు రోజు కూడా వైసీపీ అధినాయకత్వం పూర్తి ధీమాగా ఉండి ఈ దఫా కూడా గెలుపు తమ దేనని నమ్మకంగా చెప్పడంతో పార్టీ చిందిస్తాయి.

భారీగా నష్టపోయిన అభిమాను లు
నేతల కోసం అప్పులు చేసి మరీ భారీగా బెట్టింగులు
వైసీపీ ఘోర ఓటమితో తీవ్ర నష్టా లతో అప్పులపాలై కొందరు
నివారణ చర్యలు చేపట్టాలని కోరుతున్న బాధిత కుటుంబాలు

ప్రజా దీవెన, అమరావతి: ఆంధ్రప్ర దేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్ లు బెంబేలెత్తిస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో(Assembly elections)విజయంపై ఓట్ల లెక్కిం పునకు ముందు రోజు కూడా వైసీపీ అధినాయకత్వం పూర్తి ధీమాగా ఉండి ఈ దఫా కూడా గెలుపు తమ దేనని నమ్మకంగా చెప్పడంతో పార్టీ చిందిస్తాయి. క్యాడర్, అభిమానులు పెద్ద సంఖ్యలో బెట్టింగ్లకు దిగారు. నాయకత్వం ఇంత నమ్మకంగా చె బుతుంటే ఇక మనకు తిరుగేలేదని నమ్మిన వైసీపీ అభిమానులు(YCP fans) భారీ గా బెట్టింగులు(Betting)పెట్టారు. అప్పులు తెచ్చి, ఆస్తులు తాకట్టు పెట్టి మరీ లక్షల్లో పందేలు కాయగా కానీ ఫలి తాల్లో సీన్‌ రివర్స్‌ అయింది. జగన్‌ నేతృత్వంలోని వైసీపీ చిత్తుగా ఓడి పోయింది. వైసీపీపై పందేలు కాసిన అభిమానులు ఘోరంగా నష్ట పో యారు. కొన్నిచోట్ల కొందరు ఆత్మ హత్యలకు కూడా పాల్పడు తున్నా రని సమాచారం.

కాకినాడ జిల్లా(Kakinada District)సామర్లకోట పట్టణం ప్రకాశ్‌నగర్‌కు చెందిన బిక్కిన సురేశ్‌ (30) అనే వ్యక్తి వైసీపీ గెలుస్తుందని రూ.30 లక్షల వరకూ పందెం కాశాడు. ఈ మొత్తం పోవడంతో బుధవారం తెల్ల వారుజామున ఉరేసుకుని ఆత్మ హ త్య చేసుకున్నా డు. పల్నాడు జిల్లా రొంపిచర్లలో వైసీపీ, టీడీపీ పార్టీల తరఫున భారీ సంఖ్యలో పందేలు సాగాయి. ఈ నేపథ్యంలో స్థానిక చెరువు కట్ట సెంటర్‌లో ఓ వ్యక్తిని మధ్యవర్తిగా ఎంపిక చేసు కుని అతని వద్ద సుమారు రూ.1. 50 కోట్ల మేర నగదును ఉంచారు. ఫలితాలు వెలువడిన అనంతరం పందేలు కాసిన వ్యక్తులు సదరు వ్యక్తి వద్దకు వెళ్లగా అప్పటికే ఆయ న కుటుంబ సభ్యులతో కలిసి నగ దుతో ఉడాయించినట్లు తెలిసి అవాక్కయ్యారు. అలాగే గుంటూరు(Guntur) నగరంలో ఇలాగే రూ.50 లక్షలు పం దెం కాసిన వ్యక్తి ఫలితాల తర్వాత అదృశ్యమమ్యాడు. అయితే ఆయ న ఆత్మహత్య చేసుకొన్నారని కు టుంబ సభ్యులు చెబుతున్నారు.

అప్పు ఇచ్చిన వాళ్లు ఇది నిజమా, కాదా అని ఆరా తీయడంలో నిమ గ్నమయ్యారు. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం రేగడికొత్తూరుకు చెందిన వైసీపీ నాయకుడు పందెం డబ్బులతో పారిపోయినట్లు సమాచారం. దీం తో బాధితులు లబోదిబోమంటు న్నారు. ఇరువర్గాల డబ్బులతో పరారయ్యాడా, టీడీపీ వారి సొమ్ము తో మాత్రమే పరారయ్యాడా అన్నది తెలియరాలేదు. ఏది ఏమైనా ఆంధ్ర ప్రదేశ్ లో బెట్టింగ్ ల జోరు మూడు పూలు ఆరు కాయలుగా కొనసాగిన విషయం బహిరంగ రహస్యమే. అయితే సదరు బెట్టింగ్లలో అమా యకులు అనుమాయిల మాటలు నమ్మి భారీ స్థాయిలో అప్పులు చేసి పెట్టుబడులు పెట్టడం ద్వారా పూర్తి గా నష్టపోయి మానసిక ఒత్తిళ్ళతో మాటలు నమ్మి భారీ స్థాయిలో అప్పులు చేసి పెట్టుబడులు పెట్ట డం ద్వారా పూర్తిగా నష్టపోయి మానసిక ఒత్తిళ్లతో బలవర్మనాలకు పాల్పడే అవకాశం ఉన్నందున ప్రభుత్వం బెట్టింగ్లపై ప్రత్యేక శ్రద్ధ వహించి అమాయకుల బలిదా నాలను నిలువరించాలని కోరుతు న్నారు.

YSRCP workers loss in Betting