Lok sabha elections: మోదీ పతనం తెలంగాణలోనే ప్రారంభం
దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, భారతీయ జనతా పార్టీ పతనం తెలంగాణ నుంచే ప్రారంభం కావాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ పిలుపునిచ్చారు.
ఆ పౌరుషాన్ని రాష్ట్ర పౌరులు చాటిచెప్పాలి
మా కుటుంబానికి తెలంగాణతో తరతరాల అనుబంధం
అబద్ధాల ప్రధాని పదేళ్లలో చేసింది చెప్పలేక కన్నీళ్లు
ప్రాణాలు పోయినా అంగీకరించం, అది మోదీ రాజ్యాంగo కాదుకదా
తాండూరు, కామారెడ్డి ఎన్నికల సభల్లో ప్రియాంక గాంధీ
ప్రజా దీవెన, హైదరాబాద్: దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, భారతీయ జనతా పార్టీ(Bharatiya Janata Party ) పతనం తెలంగాణ నుంచే ప్రారంభం కావాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ పిలుపునిచ్చారు. అందుకు కాంగ్రె స్‌కు ఓటు వేసి ఇండియా కూటమి ని గెలిపించాలని ఇప్పుడిప్పుడే దే శంలో మార్పువస్తోందని, బీజేపీ ప్రభుత్వం(BJP) వద్దని, మోదీ పాలనను అంతమొందించాలని ప్రజలు భావి స్తున్నారన్నారని, పదేళ్ల మోదీ పాల నలో దేశంలోని ఏ ఒక్క వర్గానికి ఎలాంటి మేలు జరగలేదని, కార్పొ రేట్ కంపెనీల అధిపతులకు మాత్ర మే లబ్ధి చేకూరిందని, పేదలు ఆర్థి కంగా మరింత నష్ట పోయారని వివ రించారు.
శనివారం కాంగ్రెస్ పార్టీ తాండూరులో నిర్వహించిన జన జాతరసభలో, కామారెడ్డిలో(Kamareddy)జరి పిన రోడ్‌షో, కార్నర్ మీటింగ్‌లలో ప్రియాంక ప్రసంగించారు. దేశ పేద ప్రజల సంపద ను ప్రధాని మోదీ తన మిత్రులకు దోచిపెట్టాడు. రైల్వే లు, పోర్టులు, విమాన, విద్యుత్ కాంట్రాక్టులను అదానీ, అంబానీల కు కట్టబెట్టారు. పెట్టుబడిదారులకు రూ.16లక్షల కోట్ల రుణమాఫీ చేశా రు. కానీ పేద లకు, రైతులకు ఒక్క రూపాయి కూ డా మాఫీ చేయలే దు. దేశంలోని ప్రజల మధ్య కులా లు, మతాల పేరుతో విద్వేషాలు సృష్టించడమే లక్ష్యంగా పనిచేశారే తప్ప దేశా భివృద్ధికి పాటు పడ లేదని ఆరో పించారు.
తెలంగాణ ప్రజలు శ్రమించి ఈ ప్రాంతాన్ని సు భిక్షంగా మార్చుకున్నారని, బీజేపీ(BJP) పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రియాంక సూచించారు. ఈ ప్రాంతం చైతన్య వంతమైన ప్రాంతమని, విద్వేషం వద్దని, స్వచ్ఛమైన పాలన కావాలం టూ ఇక్కడి నుంచి సందేశం ఇవ్వా లని కోరారు. అవినీతిని అంత మొందిస్తాం, నల్లధనం వెనక్కు తీసుకొస్తామన్న నినాదాలతో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఎలక్టోరల్ బాండ్స్ వంటి అవినీతి స్కీములను తీసుకువచ్చిందని ప్రియాంక నిప్పులు చెరిగారు.
దేశం లో ఎక్కడ మహిళలపై అత్యాచారా లు జరిగినా బాధితుల పక్షాన బీజేపీ నిలబడలేదని, అత్యాచారం చేసిన వారి పక్షానే ఆ పార్టీ నిలబ డిందన్నారు. దేశంలో అత్యున్నత మైన పదవి ప్రధాని పదవి అని ఆ పదవిలో పదేళ్లుగా ఉన్న వ్యక్తి ప్రజలకు ఏం చేశారో చెప్పే ధైర్యం చేయట్లేదని, వేదికలపైన కన్నీళ్లు పెట్టుకుంటారని, పచ్చి అబద్ధాలు చెబుతుంటారని, ఈ ప్రధాని దుర్భ లుడు, అబద్ధాల కోరు, ప్రజల కోసం ఏమీ చేయలేదు కాబట్టే అబద్ధాలు మాట్లాడుతుంటారని ధ్వజ మెత్తా రు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోపైనా పొద్దస్తమానం అబద్దాలే చెబుతు న్నారన్నారు.
కాంగ్రెస్ (Congress Party)పార్టీ పాంచ్ న్యాయ్ పత్రం, ప్రజల సంపదను వారి జేబుల్లోకి చేర్చే పత్రం అని వివరించారు. పదేళ్ల పాలనలో ప్రజ ల కోసం మోదీ చేసిందేమీ లేద ని, కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రారం భించిన స్కీమ్‌లనే పేర్లు మార్చుకుని మోదీ ఫొటోలు పెట్టుకుని కొత్త పథకాలు గా ప్రజలముందు పెట్టారని ప్రియాం క ఆరోపించారు. ఈ పదేళ్లలో బీజే పీ ప్రభుత్వం ధనవంతుల కోసమే పని చేసిందని, పేదలు, రైతులు, కార్మికులు, మహిళలు, మధ్యతర గతి జీవుల కోసం ఏమీ చేయలేదన్నారు. పంటకు నష్టం వాటిల్లి కూతురు పెళ్లి, పిల్లల చదు వులు వంటి ఖర్చులతో రైతులపై రుణభారం పెరుగుతున్నా ప్రభు త్వం నుంచి ఎలాంటి సాయమూ అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద నోట్ల రద్దుతో చిన్నవ్యాపారుల నడ్డి విరిగి పోయిందన్నారు. రైతు లు, కార్మికులు, స్టార్టప్ కంపెనీలు, ఐటీ రంగం ఆదాయాలు తగ్గిపో యాయని ఆందోళన వ్యక్తం చేశారు.
Bharatiya Janata Party downfall start from Telangana