MinisterKomatireddyVenkatreddy : మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్య, జుక్కల్ అభివృద్ధి చెందినప్పుడే నిజమైన అభివృద్ధి
MinisterKomatireddyVenkatreddy: ప్రజా దీవెన, కామారెడ్డి: జుక్కల్ లో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కా ర్యక్రమంలో పాల్గొనడం సంతోషం గా ఉందని,ఇక్కడి ప్రజలు చూపిం చిన అభిమానానికి ధన్యుడనని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్ర ఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. జుక్కల్ లో డైనమిక్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు ఉన్నాడ ని,ఇప్పుడు అభివృద్ది పరుగులు పెడుతుందన్నారు. ఆయనకు తో డుగా ఉంటానని నాకు ఇప్పుడు జు క్కల్ బాధ్యత కూడా తోడయిందని తెలిపారు. సిఎం రేవంత్ రెడ్డి, ఇం చార్జి మంత్రి సీతక్ తో మాట్లాడి ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తాన ని మాటిచ్చాడు. మారుమూల జు క్కల్ నియోజకవర్గ అభివృద్ధి చెంది నప్పుడే అసలైన అభివృద్ధిని వ్యా ఖ్యానించారు.
జుక్కల్ నియోజకవర్గంలో సోమవా రం రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమా టోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెం కట్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశా రు. పలు అభివృద్ధి పనులకు శంకు స్థాపన, ప్రారంభోత్సవం చేశారు.
మద్దెలచెరువు, పిట్లం రోడ్,తిమ్మ నగర్ వద్ద 4.86 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన హై లెవల్ బ్రిడ్జ్ ను ప్రారంభించిన మంత్రి, బి చ్కుంద నుండి డోంగ్లి వరకు 13.20 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించే రోడ్డు పనులకు శంకుస్థాపన చేశా రు. అంతకు ముందు పిట్లం, బి చ్కుంద లో జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీ కాంతరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రే ణులు భారీ ర్యాలీ నిర్వహించారు. గజ మాలతో సత్కరించి మంత్రికి త మ అభిమానాన్ని తెలియజేశారు. భారీగా బైక్ ర్యాలీతో పార్టీ శ్రేణులు రావడంతో వారితో పాటు నడుస్తూ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నిం పా రు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి.
గత పదేళ్లలో కొడుకు, బిడ్డ, అల్లు డు బాగుపడ్డారు కానీ తెలంగాణ ప్రజలు కాదని గత బిఆర్ఎస్ ప్రభు త్వాన్ని విమర్శించారు. తెలం గాణ ఇచ్చిన పార్టీ అధికారంలోకి రాకు న్నా బాధపడలేదనీ..ఏదైతే ఆశ యంతో తెలంగాణ రాష్ట్రాన్ని కోట్లాడి సాధించుకున్నామో అవి నెరవేర్లే దన్నారు. వాళ్ళు ఏ నాడు కూడా ని రుద్యోగుల గురించి ఆలోచించలే దు,కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 60 వేల ఉద్యోగాలు ఇచ్చాం.ఇంకా నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నా రు. పదేళ్లుగా పేద వాడు ఇల్లు క ట్టుకోలేదు. డబుల్ బెడ్రూం ఇవ్వలే దు.దళితున్ని సిఎం చేయలేదు. కా నీ ప్రస్తుతం ప్రజా ప్రభుత్వం రూ 5 లక్షలు ఇస్తున్నామని వచ్చే నాలు గేళ్లలో ప్రతి పేద వానికి ఇందిరమ్మ ఇల్లు కల సాకారం చేస్తామని స్పష్టం చేశారు.
జుక్కల్ నియోజకవర్గంలో 160 కో ట్ల రూపాయలతో రోడ్ల అభివృ ద్ధికి కృషి చేస్తున్నామని,జుక్కల్ లాంటి వెనుకబడిన నియోజకవర్గం అభి వృద్ధి చెందినపుడే నిజమైన అభివృ ద్ధి జరిగినట్లన్నారు. నిరంతరం మ మ్మల్ని విమర్శించే హరీష్ రావు వ చ్చి జుక్కల్ రోడ్లు చూడాలన్నారు. ఆయన పాత జిల్లాలోని నారాయ ణ ఖేడ్ కు రూ. 240 కోట్లతో రోడ్ల అభివృద్ధికి ప్రణాళికలు వేశామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ ప్రాం త లెండి, నాగమడుగు ప్రాజెక్ట్ లను త్వరగా పూర్తి చేస్తామని చెప్పారు.సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో నా రాయణ ఖేడ్, జుక్కల్ నియోజకవ ర్గాల్లో అభివృద్ధి చేస్తామని,పలు స బ్ స్టేషన్లు మంజూరు కోసం డిప్యూ టీ సీఎం భట్టి విక్రమార్క ను,స్థానిక ఎమ్మెల్యే తో కలిసి తాను స్వయంగా కలుస్తానని మాటి చ్చారు.
అనంతరం స్థానిక ఎమ్మెల్యే లక్ష్మి కాంత రావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన పబ్లిక్ మీటింగ్ లో పాల్గొని ప్రసంగించారు.ఈ కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంత రావు,ఎంపీ సురేష్ షెట్కర్, ఎమ్మె ల్యే సంజీవ రెడ్డి,సెట్విన్ చైర్మన్ గిరి ధర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆశిష్ సం గ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర,ఆర్ అం డ్ బి చీఫ్ ఇంజనీర్ మోహన్ నాయ క్,కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షు డు కైలాస్ శ్రీనివాస్,పలువురు ప్రజా ప్రతినిధులు,నాయకులు,ప్రజలు పె ద్ద ఎత్తున పాల్గొన్నారు.
పిలిప్పీన్స్ హఠాన్మరణం చెంది న ఎంబిబిఎస్ విద్యార్థికి ఆర్థిక సాయం …కామారెడ్డి జిల్లా కుర్లా గ్రామ ఆర్ఎంపీ వైద్యుడి కుమా రుడు వడ్ల యోగి ఫిలిప్పీన్స్ లో హ ఠాన్మరణం చెందడంతో వారి కుటుం బాన్ని పరామర్శించి రూ. 4లక్షల ఆర్థిక సహాయం చేశారు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. కామారెడ్డి జిల్లా,జుక్కల్ నియోజకవర్గం కుర్లా గ్రామ ఆర్ఎంపీ కుమారుడు యోగి రెడ్డి నాలుగు రోజుల క్రితం పిలిప్పీ న్స్ దేశంలో గుండె పోటుతో మృతి చెందాడు. మృత దేహాన్ని స్వదేశా నికి తెప్పించాలనే విషయం ఎమ్మె ల్యే లక్ష్మీ కాంత రావు మంత్రి దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించి మృత దేహాన్ని కామారెడ్డి కి తీసు కువచ్చారు.
పిలిప్పీన్స్ లో ఎంబిబిఎస్ విద్యను అభ్యసిస్తున్న వడ్ల యోగి చిన్న వ యస్సులో హఠాన్మరణం చెందడం అత్యంత బాధాకరమని మంత్రి అ న్నారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చి,మనోధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా వారి కుటుంబానికి మంత్రి 4లక్షల ఆర్థిక సహాయం చే శారు. కుటుంబానికి అన్ని రకాల అండగా ఉంటామని భరోసా కల్పిం చారు.మంత్రి వెంట ఎంపీ సురేష్ షె ట్కర్, ఎమ్మెల్యేలు తోట లక్ష్మీ కాంత రావు, సంజీవ్ రెడ్డి,డిసిసి అధ్యక్షు డు కైలాస్ శ్రీనివాస్ పూజర్ల తదిత రులు ఉన్నారు.