Medigadda barrage: ముమ్మరంగా మరమ్మత్తు పనులు
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన బ్యారేజీల మరమ్మత్తు పనులు ముమ్మరంగా యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు.
బ్యారేజీల మరమ్మత్తులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి
ఎన్‌డీఎస్ రిపోర్టు ఆధారంగా పనులు చేపట్టాలి
ఈ సీజన్‌కు నీరందించేలా కృషి
తమ్మిడిహెట్టి తప్పకుండా నిర్మిస్తాం
బ్యారేజీల సందర్శన సందర్భంగా నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి
ప్రజా దీవెన, కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన బ్యారేజీల మరమ్మత్తు పనులు ముమ్మరంగా యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) ఆదేశించారు. కాళేశ్వరం పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీల వద్ద మరమ్మతు పనులను యుద్ధ ప్రాతి పదికన చేపడుతున్నట్లు రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లాలోని సుందిల్ల బ్యారే జీ(Sundilla Barreji) వద్ద మరమ్మతు పనులను అధి కారులతో కలిసి పర్యవేక్షించారు. అనంతరం మాట్లాడుతూ గత ప్రభుత్వం నాసిరకంగా నిర్మించడం మూలంగానే మేడిగడ్డ బ్యారేజీ(Medigadda barrage) కుంగిన విషయం ప్రపంచం మొత్తం తెలియవచ్చిందని గుర్తు చేశారు. ప్రాజెక్టు మర మ్మతులను గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం పట్టించు కోలేదని, తాము అధికారంలోకి రాగానే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధి కారులకు ప్రాజెక్టును సందర్శించి ఎంత మేర డ్యామేజీ జరిగిందో పరి శీలించి ప్రాజెక్టు రక్షణ కోసం చేపట్టా ల్సిన పనులపై రిపోర్టు ఇవ్వాలని కోరా మన్నారు.
ఎన్‌డీఎస్ అధికా రులు ప్రాజెక్టును పరిశీలించి ఇంటీరి యం రిపోర్టు అందజేశారన్నారు. వారి సూచన మేరకు 3 ఏజెన్సీలకు పనులు అప్పగించి యుద్ధ ప్రాతి పదికన మరమ్మతు పనులు చేయా లని ఆదేశించామన్నారు. ఈ సీజ న్‌కు నీరందించేలా పనులు చేపట్టా మని, యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామన్నారు. ప్రాజెక్టు నిర్మాణం లో జరిగిన తప్పిదాలను తెలు సుకునేందుకు జస్టిస్ ఘోష్ కమి షన్ బ్యారేజీ సందర్శనకు రాబోతుం దని తెలిపారు.తమ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా తమ్మిడిహెట్టి ప్రాజె క్టు(Tammidihetti Project) తప్పనిసరిగా నిర్మిస్తామన్నారు. మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డికి పెద్ద పల్లి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్‌తో(Muzammil Khan) పాటు పలు శాఖ అధికా రులు పాల్గొన్నారు.
Medigadda barrage repairing works started