Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Land disputes: కుటుంబ కలహాలతో తల్లీకూతుళ్ళ ఆత్మహత్య

భూతగాదాలు, కుటుంబ కలహాలు ఓ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

గద్వాల జిల్లలో దుర్ఘటన
ప్రజా దీవెన, గద్వాల: భూతగాదాలు, కుటుంబ కలహాలు ఓ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన జోగులాంబ గద్వాల(jogulamba gadwal) జిల్లా మనవ పాడు(Manava Padu) మండల పరిధిలోని ఏ-బుడి దపాడు గ్రామంలో చోటుచేసు కుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఏ-బుడిదపాడు గ్రామానికి చెందిన మాల నరసింహులు తన భార్య వరలక్ష్మి (39), కూతురు అనురాధ (18) భూతగాదాలు, కుటుంబ కలహాల(Family Conflict) నేపథ్యంలో మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో ఇంట్లో పురుగుల మందు తాగారు. ఈ ఘటనలో వరలక్ష్మి, అనురాధ పరిస్థితి విషమించడంతో హుటాహుటిన కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అక్కడ చికిత్స అందేలోపే ఇద్దరు మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.మాల నరసింహులు మాత్రం ఆత్మహత్య చేసుకోవాలని భావించినా. పురుగుల మందు తాగడానికి భయపడ్డాడు. అయితే తన కళ్ళ ముందే భార్య, కూతురు చనిపోవడంతో కుప్ప కూలిపో యాడు. గత కొన్ని రోజులుగా అన్నదమ్ములకు మధ్య భూ తగాదాలు(Land disputes) ఉన్నాయి. ఎన్నోసార్లు ఒకరిపై ఒకరు దుర్భాషలా డుకోవడం గొడవలు చేసుకున్నట్లు తెలిసింది.

అయితే కూతురు, కొడుకు చదువు కోసం పెళ్లి కోసం చాలా ఇబ్బందులు గురవుతున్నా మని, తమకు వారసత్వం కింద ఇచ్చిన భూములు సీలింగ్ ఉండడంతో ఎవరు కొనడం లేదని భావించి ఎన్నోసార్లు అన్నదమ్ము లతో మాల నరసింహులు ప్రాధేయcపడ్డాడు. తన కుటుంబా నికి ఎవరూ సహకరించడం లేదని భావించి మంగళవారం కుటుంబ సభ్యులు చనిపోవాలని పురుగుల మందు సేవించినట్లు స్థానికులు తెలిపారు. ఘటనలో తల్లి కూతురు మృతి చెందారు. కొడుకు హైదరాబాద్‌లో చదువుకుంటు న్నట్లు తెలిసింది. ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Family Conflict Land disputes