Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Nagar Kurnool Road show: కాంగ్రెస్‌, బీజేపీలకు కర్రుకాల్చి వాతపెట్టాలి

దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్, బిజెపి పార్టీల పాలనలు ప్రజల పాలిట యమపా షాలుగామారాయని, ఆ రెండు పార్టీలకు ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టాల్సిన సమయం వచ్చిందని బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో ఘోరంగా విఫలమైన కాంగ్రెస్‌ ప్రభుత్వం
సీఎం సొంత జిల్లాలోనూ కాంగ్రెస్‌ ఓడిపోవడం ఖాయం
సీఎం స్ధాయిలో ఉండి బాధ్యతల నుంచి రేవంత్‌ వైదొలిగిండు
పాలమూరులో భోజనం చేస్తుండ గా కరెంట్‌ కట్‌ అంటూ ట్వీట్
నేను మళ్లీ మళ్లీ చెబుతున్నా రేవంత్ బీజేపీలో చేరడం ఫిక్స్
నాగర్‌కర్నూల్‌ రోడ్‌షోలో బీఆర్‌ ఎస్‌ అధినేత కేసీఆర్‌

ప్రజా దీవెన,నాగర్‌కర్నూల్‌: దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్(congress), బిజెపి(bjp) పార్టీల పాలనలు ప్రజల పాలిట యమపా షాలుగామారాయని, ఆ రెండు పార్టీలకు ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టాల్సిన సమయం వచ్చిందని బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ పిలుపునిచ్చారు. లోక్‌సభ ఎన్నిక ల్లో(Lok sabha elections) మళ్లీ మోదీకి ఓటేస్తే వినాశనం తప్పదని,దేశంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు దొందూదొందే నని ధ్వజమెత్తారు.

తెలంగాణలో మళ్లీ వచ్చేది బీఆర్‌ఎస్‌(BRS) ప్రభుత్వమే నని ఆయన వ్యాఖ్యానించారు. పోరుబాట బస్సు యాత్ర లో బాగం గా శనివారం ఆయన నాగర్‌కర్నూ ల్‌ జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌ కూడ లి వద్ద బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌కు మద్దతుగా ఏర్పా టు చేసిన రోడ్‌షోలో మాట్లాడారు. విభజన హామీలు ఏ ఒక్కటీ నెరవే ర్చకుండా ప్రధాని మోదీ తెలంగాణ ప్రజలను దారుణంగా వంచించారని విమర్శించారు.

వ్యవసాయ రంగా నికి అందిస్తున్న ఉచిత విద్యుత్తు(Free electricity) పథకానికి మీటర్లు బిగించాలని నరేంద్రమోదీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం కోరిందని, అందుకు నేను వ్యతిరేకించి నందుకే కక్ష కట్టారని, తెలంగాణ ఆ కాంక్షలను ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాలను ఏనాడూ పట్టించుకోని నరేంద్రమోదీకి మళ్లీ ఓటేస్తే తెలంగాణకు వినాశనం తప్ప దని కేసీఆర్‌ వివరించారు. రాష్ట్రం లోని కాంగ్రెస్‌ సర్కారుపై గులాబీ బాస్‌ విరుచుకుపడ్డారు. అధికారం లోకి వచ్చిన నాలుగు నెలల వ్యవధి లోనే కాంగ్రెస్‌ అసమర్థ ప్రభుత్వంగా నిరూపిత మైందని అన్నారు.

వేసవి లో ప్రజలకు కనీసం తాగునీరు కూ డా అందించలేని దుర్మార్గమైన ప్రభు త్వం రాష్ట్రంలో ఉండటం దురదృ ష్టకరమని, మా ప్రభుత్వ హయాం లో మిషన్‌ భగీరథ పథకం ద్వారా కేవలం రూపాయికే నీటి కనెక్షన్ లు ఇచ్చామని, రక్షిత తాగునీటిని అం దించామని వివరించారు. కాంగ్రె స్‌ ప్రభుత్వం వచ్చాక మళ్లీ బోర్లు, ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా ఎందుకు జరుగుతోందని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధి కారంలోకి వచ్చాక ఇచ్చిన గ్యారెంటీ లు ఏవీ సక్రమంగా అమలు కావ డంలేదన్నారు. ఆడపిల్లల పెళ్లిళ్లకు తులం బంగారం పథకం ఏమైందని, విద్యార్థినులకు స్కూటీల పంపిణీ ఎంత వరకు వచ్చిందని నిలదీశారు.

బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు పెన్షన్‌గా రైతు బంధు డబ్బులు ఖాతాలో జమ అయ్యేవని, ఇప్పు డాపరిస్థితి ఉందా అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో అమలైన పథకాలను కూడా కొనసాగించలేని దుస్థితిలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉన్నదని దుయ్య బట్టారు. సమర్థంగా పాలనను కొనసాగించలేని ముఖ్యమంత్రి చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తనను అసభ్యకరమైన పదజా లంతో దూషిస్తున్నారని, ఇది ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్రంలో తిరిగి రాబోయేది బీఆర్‌ ఎస్‌ ప్రభుత్వమేనన్నారు.

లోక్‌సభ ఎన్నికల్లో(Lok sabha elections) తమ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి తెలంగాణకు మేలు చేకూర్చేందుకు గొందిలో ప్రాణం ఉన్నంత వరకు ప్రయత్నిస్తామన్నా రు. ఈ ఎన్నికల్లో మైనార్టీ ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని, సెక్యు లర్‌ భావాలు గల బీఆర్‌ఎస్‌కు ఓటే స్తే వారి ప్రయోజనాలను కాపాడేం దుకు అహర్నిషలు కృషి చేస్తామని చెప్పారు. కాంగ్రెస్‌ వైఫల్యాల గురిం చి మాట్లాడాలంటే దినమంతా సరి పోదని, తాగునీటి సంగతి దేవు డె రుగు తమ ప్రభుత్వ హయాంలో కరెంటు పోయేది సంచలనమేనని, ప్రస్తుతం వచ్చేది విశేషమైపోయిం దన్నారని కేసీఆర్‌ విమర్శించారు. రోడ్‌షోలో మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, నాగం జనార్దన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మర్రిజనార్దన్‌రెడ్డి, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.

KCR criticised on BJP and congress