Praja Deveena
Newspaper Banner
Date of Publish : 25 January 2026, 3:27 pm Posted by : praja deveena

Nagarkarnool childrens death: బిగ్ బ్రేకింగ్, ఉసురుతీసిన సరదా, ముగ్గురు చిన్నారుల మృత్యువాత 

Nagarkarnool childrens death : ప్రజా దీవెన, నాగర్ క ర్నూల్: నాగర్ కర్నూ ల్ జిల్లాలో విషాద సంఘటన చోటు చే సుకుంది. సరదా సరదాగా సెల్ఫీ ఫోటో తీసుకునే సంతోష సమయంలో ము గ్గురు చిన్నారుల నిండు జీవితాలకు నూ రేళ్ళు నిండాయి.

కడువిషాద సoఘటన నాగర్ క ర్నూల్ జిల్లా ఊరుకొండ మండలం ముచ్చర్లపల్లి గ్రామంలో ఆదివారం సరదా సమ యంలో ఇందుకు సం బంధించి స్థానికులు తెలిపిన వివ రా లు ఇలా ఉన్నాయి. ముచ్చర్లప ల్లి గ్రామానికి చెందిన శ్రీకాం త్ రెడ్డి కుమార్తె సిరి (14), కుమారుడు హి మాన్షు (11), శ్రీ కాంత్ రెడ్డి సోదరి కుమార్తె స్నేహ (15) హైదరాబాద్ లో చదువుకుంటున్నారు.

వరుస సెలవులు ఉండడంతో త మ సొంతూరికి రాగా ఆది వారం గ్రా మ సమీపంలోని రైతు వేణుగోపా ల్ రెడ్డి చెందిన వ్యవసాయ పొలం వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో నీటి గుంత వద్ద హిమాన్షు సెల్ఫీ దిగబో యి నీటిలో పడిపోయాడు. అ తడి ని కాపాడే ప్రయత్నంలో సిరి, నేహా సైతం నీటి గుంతలో పడిపోయా రు.అక్కడే ఉన్న వేణుగోపాల్ రెడ్డి కు మార్తె వి ద్యాధరణి వీరిని కాపా డే ఆతృతలో పక్కనున్న గోతిలో ప డి పోయింది.

అక్కడ నీళ్లు ఎక్కువగా లేకపోవ డంతో ఆమె అరుపులకు పక్క పొలంలో పనిచేస్తున్న రాణి అనే మ హిళ పరుగున వచ్చి విద్యాధరిని కాపాడారు. అయితే, తమ పిల్లలు ముగ్గు రు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోతున్నా శ్రీకాంత్ రెడ్డి ఈ త రాకపోవడంతో విలవిల్లాడాడు. విషయము గ్రామస్తుల కు తెలియడం తో వారు వచ్చేసరికి ముగ్గురు ఊ పిరాడక చనిపోయారు.

అప్పటికే అక్కడికి చేరుకున్న గ్రా మస్థులు మృతదేహాలను వెలికి తీశారు. ఒకేరోజు ముగ్గురు పిల్లలు ప్రాణాలు కోల్పోవ డంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. వ రుస సెలవులు కావడంతో గ్రా మా నికి వచ్చిన పిల్లలందరూ కళ్ళ ముందే అసువులు బాయడంతో వారి కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్థులు అయ్యో పాపం అం టూ నిట్టూర్చారు. ఈ మేరకు పో లీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంబించారు.