Bhatti Vikramarka: బిఆర్ఎస్ కు ఓటు వేస్తే బిజెపికి వేసినట్టే
ఎర్రని ఎండలో మలమల మాడు తూ కాంగ్రెస్ ను గెలిపించాలన్న తహతహ కదిలి వచ్చిన మీ ఉత్సాహం చూస్తుంటే నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి కొన్ని లక్షల మెజార్టీతో గెలవబోతు న్నాడని స్పష్టమైన సంకేతాలు కనిపిస్తు న్నాయని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు అన్నారు.
బిజెపి కి ఓటు మిగిలేది వేస్తే కక్షలు కార్పన్యాలే
ప్రజా ప్రభుత్వంలో గట్టు ఎత్తిపో తల పథకం ద్వారా నీళ్లు పారిస్తాం
ప్రజా దీవెన, నాగర్ కర్నూల్: ఎర్రని ఎండలో మలమల మాడు తూ కాంగ్రెస్ ను గెలిపించాలన్న తహతహ కదిలి వచ్చిన మీ ఉత్సాహం చూస్తుంటే నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి కొన్ని లక్షల మెజార్టీతో గెలవబోతు న్నాడని స్పష్టమైన సంకేతాలు కనిపిస్తు న్నాయని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు(Bhatti Vikramarka mallu) అన్నారు. శనివా రం ఎంపీ అభ్యర్థి మల్లు రవి విజ యాన్ని కాంక్షిస్తూ గద్వాల చౌర స్తాలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో ఆయన ప్రసంగించారు. నేను రాజకీయ ప్రసంగం చేయడా నికి రాలేదు మన బతుకు గురించి నాలుగే నాలుగు మాటలు చెబు తానని అన్నారు.
ఒకనాడు గడీలు, దొరలు, బంగ్లాలు ఉండే పరిస్థితి.. పేదవాడు సామాన్యులు రైతులు బతకలేని పరిస్థితులు ఉండేవి. మనందరి ప్రియతమ నేత ఇంది రాగాంధీ ప్రధానిగా అయిన తర్వాత భూ సంస్కరణలు తెచ్చి మనమం తా తలెత్తుకుని తిరిగేలా అన్ని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. కేవలం భూ సంస్కరణలే కాదు బలహీనవర్గాల కోసం సంక్షేమ వసతి గృహాలు తెరిచారని వివరించారు. భూస్వాములు రూపాంతరం చెంది బడా పెట్టు బడిదారులుగా బహుళ జాతి సంస్థలుగా మారాయి అన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, నరేంద్ర మోడీ దేశ సంపదను కేవలం వీళ్ళకే దోచిపెడుతున్నారని ఆరోపించారు. ఈ దేశ సంపద వనరులు ఈ దేశ ప్రజలకే చెందా లని ప్రజల పక్షాన తాను నిల బడతానని యువ నేత రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసిన విష యాన్ని గుర్తు చేశారు. మల్లు రవిని(Bhatti Vikramarka) గెలిపిస్తే ఆయన రాహుల్ గాంధీకి(Rahul gandhi) ఓటు వేసి ప్రధానిగా చేస్తారని కోరారు.
మోడీ మరోసారి ప్రధాని అయితే ఈ దేశ సంపద మొత్తం అతని అంబానీ వంటి కొద్దిమంది వ్యక్తులకే చెందుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రాష్ట్రం ఆగ మైందని కెసిఆర్ కర్ర పట్టుకుని రాష్ట్రం అంతా తిరు గుతున్నారు. ఆయన లక్ష కోట్లు ఖర్చుపెట్టి కాలేశ్వరాన్ని(Kaleshwaram) నీట ముంచాడు రాష్ట్ర సంపదను ఆగం చేశాడు… మేం ఈ రాష్ట్ర సంపదను పేద ప్రజలకు పంచుతున్నాం ఎవ రు ఈ రాష్ట్రాన్ని ఆగం చేస్తు న్నారో ప్రజలు నిర్ణయిం చుకోవాలని కోరా రు. 1200 రూపాయల గ్యాస్ సిలిండర్ను 500 ఇవ్వడమే ఆగం చేయడమా అన్నారు. నీ దుర్మా ర్గాలు చూడలేక జూపల్లి వంటి వారు బయటకు వచ్చి కెసిఆర్ కు బుద్ధి చెబుతామని మంత్రిగా రాష్ట్ర మంతా పర్యటి స్తున్నారని గుర్తు చేశారు.ఇక కెసిఆర్ కథ ముగిసింది, ఆయన కర్ర పట్టుకుని రాష్ట్రమంతా తిరిగిన ప్రజలు ఆదరించడం లేదు, ఆయన పార్టీలో ఉండేందుకు ఎవరు ఇష్టపడడం లేదు ఒకరు కారు స్టీరింగ్ను మరొకరు టైర్లను ఊడదీసుకుని పోతున్నారు, కారు నుంచి కాంగ్రెస్లో చేరుతామని ఎమ్మె ల్యేలు కోరుతున్నారని తెలి పారు.
ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యో గాలు చొప్పున, ప్రతి పేదవాని బ్యాంకు 15 లక్షలు జమ చేస్తామని ప్రధాని మోడీ చెప్పారు ఎవరి ఖాతాలోనైనా 15 లక్షలు పడ్డాయా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రతి పైసా ప్రజలకే పంచుతాం, కెసిఆర్ లాగా దోపిడీ చేస్తామంటే ఊరు కోబొమ్మన్నారు. బిఆర్ఎస్ కు ఓటు వేస్తే బిజెపికి వేసినట్టే బిజెపికి ఓటు వేస్తే పగలు, కక్షలు, కార్పన్యాలే పెరుగుతాయని కాంగ్రెస్కు ఓటు వేస్తే నెట్టెంపాడు కోయిల సాగర్ వంటి ప్రాజెక్టులు(Projects) కట్టి ప్రజల బాగు కోసం పనిచేస్తాయన్నారు రాబోయే ఎన్నికల్లో ఎవరు కావాలో మీరే నిర్ణయించుకోవాలని భట్టి విక్రమా ర్క కోరారు. గట్టు ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసి నీళ్ళు పారి స్తామన్నారు గత ప్రభుత్వాలు లాగా రావడం పోవడం మాటలు చెప్పడానికి తాము పరిమితం కామన్నారు.
సభలో ఎంపీ అభ్యర్థి మల్లు రవి(Mallu ravi) మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Voting for BRS goes to BJP