Bhatti Vikramarka: మోదీకి ఓటమి భయంతో జంకుతున్నారు
ప్రధాని మోదీకి ఓటమి భయం పట్టుకుందని, దేశం లో మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్ర యత్నం చేస్తున్నారని డిప్యూటీ సీ ఎం భట్టి విక్రమార్క అన్నారు.
మసిభూసిమారేడుకాయలు చేసేం దుకుమత విద్వేషాలు రెచ్చగొడు తున్నారు
నిర్మల్ కాంగ్రెస్ సమావేశంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
ప్రజా దీవెన, నిర్మల్: ప్రధాని మోదీకి (Pm Modi)ఓటమి భయం పట్టుకుందని, దేశం లో మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్ర యత్నం చేస్తున్నారని డిప్యూటీ సీ ఎం భట్టి విక్రమార్క అన్నారు. భార త రాజ్యాంగాన్ని మార్చాలని కుట్ర చేస్తున్న బీజేపీకి ఓటు వేస్తే ప్రజలు తమ హక్కులను కోల్పోతారని హెచ్చ రించారు. రాజ్యాంగ పరిరక్ష ణకు దేశ ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపిం చుకోవాల్సిన అవసరం ఉందన్నా రు. నిర్మల్‌లో బుధవారం నిర్వహిం చిన కాంగ్రెస్(congress) ముఖ్య కార్యకర్తల సమావేశo అనంతరం మీడియాతో మాట్లాడారు.
దేశ సంపదను బహు ళ జాతి సంస్థలకు దారాదత్తం చేయాలన్న దురాలోచనతో మోదీ ఉన్నారని దుయ్యబట్టారు. లోక్‌సభ ఎన్నికల వేళ బీజేపీ(BJP), బీఆర్‌ఎస్ ఒక్కటయ్యాయని ఆరోపించారు. బీఆర్‌ఎస్ బలమున్నచోట బీజేపీ బలహీనమైన అభ్యర్థిని పోటీలో పెట్టగా బీజేపీ బలమున్న చోట బీఆర్‌ఎస్ బలహీనమైన అభ్యర్థిని పోటీలో నిలిపిందని వివరించారు. ఈ పార్టీల పట్ల ప్రజలు అప్రమత్తం గా ఉండాలని సూచించారు. రైతు భరోసా(rythu bharosa) పంపిణీని అడ్డుకొన్న బీఆర్ ఎస్, బీజేపీ రైతుల పట్ల కపట ప్రేమ ను ప్రదర్శిస్తున్నాయని విమర్శించా రు.
కాంగ్రెస్(congress) అధికారంలోకి వస్తే దేశ వ్యాప్తంగా కుల గణన చేపడతా మని వెల్లడించారు. అకాల వర్షం, గాలి దుమారం వల్ల నష్టపోయిన రైతులను కచ్చితంగా ఆదుకుం టామని, తడిసిన ధాన్యాన్ని ప్రభు త్వమే కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ వ్యాప్తంగా పోడు భూముల సమ స్యకు పరిష్కారం చూపుతామని భరోసా ఇచ్చారు. ఆత్రం సుగుణ నిరుపేద మహిళ అని, ఆదిలాబాద్ ఎంపీగా ఆమెను గెలిపిస్తే పేదల పక్షాన పోరాడుతారన్నారు. సమా వేశంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి దీపాదాస్ మున్షీ పాల్గొన్నారు.
Modi fear with defeat