Love Marriage: ప్రేమ వివాహం…. ప్రియుడ్ని చంపి… చెట్టుకు ఉరేశారు
బాబాయ్ కూతురిని ఓ యువకుడు ప్రేమ వివాహం చేసుకోవడంతో పెద్దనాన్న కుమారులు, ఆమె కుటుంబ సభ్యులకు ఇష్టంలేదు.
భద్రాద్రి కొత్తగూడెం: బాబాయ్ కూతురిని ఓ యువకుడు ప్రేమ వివాహం చేసుకోవడంతో పెద్దనాన్న కుమారులు, ఆమె కుటుంబ సభ్యులకు ఇష్టంలేదు. పెద్ద మనుషులు విధించిన జరిమానా చెల్లించలేదని చెల్లెలు భర్తను పెద్ద నాన్న కుమారులు చంపి అనంతరం చెట్టుకు ఉరేసిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. చిరుతానుపాడు చెందిన ఉంగయ్య(20), కొత్తూరుకు చెందిన ఉంగీ ప్రేమించుకున్నారు. ఉంగీ కుటుంబ సభ్యులకు తెలియకుండా ఆమెను ఉం గయ్య 20 రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రేమ పెళ్లి ఇష్టం లేకపోవడంతో యువతి కుటుంబ సభ్యుల పెదల మనుషుల సమక్షంలో పంచాయతీ పెట్టారు. పెద్ద మనుషుల ఒప్పంద ప్రకారం ఉంగయ్య రూ.1.50 లక్షల జరిమానా విధించారు. అదే రోజు ఉంగయ్య రూ.1.20 లక్షలు చెల్లించి తన భార్యను ఇంటికి తీసుకెళ్లాడు.
మరో ముప్పై వేల రూపాయలు చెల్లించాలని యువతి పెద్ద నాన్న కుమారులు ఇడమయ్య, అడమయ్య, మరో బాలుడు(16) చిరుతానుపాడులోని ఉంగయ్య ఇంటికి వచ్చారు. ఉంగయ్య ఇప్పుడు డబ్బులు లేవని చెప్పడంతో చెల్లిని తీసుకొని వారు ఇంటికి వెళ్లిపోయారు. ఇంటికి వచ్చిన చెల్లి కనిపించకపోవడంతో ఉంగయ్య ఉండే గ్రామానికి వెళ్లారు. గ్రామ శివారులో ఉంగయ్య కనిపించడంతో తన చెల్లెలు ఎక్కడ అని ప్రశ్నించారు. ముగ్గురు మధ్య గొడవ జరగడంతో ఉంగయ్య గొంతు నులిమి చంపి అనంతరం చెట్టుకు ఉరేసి అక్కడి నుంచి పారిపోయారు. ఉంగయ్య తల్లితండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తుండగా గ్రామ శివారులో ఉంగయ్య మృతదేహం చెట్టుకు వేలాడుతూ కనిపించింది. యువతి కుటుంబ సభ్యులతో పాటు ఆమె పెద్ద నాన్న కుమారులను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తానే హత్య చేశానని ఒప్పుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
Bhadradri Kothagudem district Palvancha