Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Revanth reddy: పక్కాగా పంద్రాగస్టులోపే రైతు రుణమాఫీ

రైతు భరోసా పథకం కింద ఇప్పటికే 65 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేశామని, మిగిలి ఉన్న నాలుగు లక్షల మంది రైతులకు ఈ నెల 8వ తేదీ నాటికి సాగు సాయం అందజేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటిం చారు.

చెప్పింది చేస్తే కేసీఆర్‌, హరీశ్‌
ముక్కు నేలకు రాస్తారా
ఈ నెల 8వ తేదీ నాటికి మిగిలిన రైతులకు రైతుభరోసా
మేమేం చేయలేదంటున్న కేటీఆర్ కావాలంటే చీర కట్టుకొని బస్సెక్కు
బీజేపీ జాతీయ నేతనే రాజ్యాంగా న్ని మారుస్తామన్నారుగా
నాకు పదవొస్తే అరుణమ్మకు కోపమెందుకో

కొత్తగూడెం, వనపర్తి, సికింద్రా బాద్‌, ముషీరాబాద్‌లో రోడ్‌షోల్లో రేవంత్‌

ప్రజా దీవెన కొత్తగూడెం: రైతు భరోసా(Rythu Bharosa) పథకం కింద ఇప్పటికే 65 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేశామని, మిగిలి ఉన్న నాలుగు లక్షల మంది రైతులకు ఈ నెల 8వ తేదీ నాటికి సాగు సాయం అందజేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth reddy) ప్రకటిం చారు. రైతు భరోసా ఇవ్వడం లేదని దుష్ప్రచారం చేస్తున్నారని, కానీ, తమ ప్రభుత్వం అధికారం చేపట్టిన గత ఏడాది డిసెంబరు నెల నుంచే రైతుభరోసాను రైతన్నల అకౌంట్లలో వేయడం ప్రారంభించామని గుర్తు చేశారు.

ఈ నెల 8వ తేదీ నాటికి మిగిలిన రైతులకు రైతుభరోసా డబ్బులు వేస్తామని, తద్వారా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 69 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.7500 కోట్లు జమ చేసినట్లవుతుందని స్పష్టం చేశారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెంజిల్లా కేంద్రమైన కొత్తగూ డెంలో(Kothagudem) జరిగిన జనజాతర సభలో, వనపర్తి జిల్లా కొత్తకోటలో కార్నర్‌ మీటింగ్‌లో, సికింద్రాబాద్‌, ముషీరాబాద్‌ నియోజకవర్గాల పరిధిలో రోడ్‌షోలలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. భద్రాచలం శ్రీరాముడి సాక్షిగా, పాలమూరు జిల్లా దైవం కురుమూర్తి స్వామి సాక్షిగా పంద్రాగస్టు నాటికి రైతుల .2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని చెప్పారు.

లేకపోతే తన జన్మ ఎందుకని, ఈ సీఎం(CM) పదవి ఎందుకని పేర్కొన్నారు. సిద్దిపేటకు శనిలా పట్టుకున్న శనీశ్వరరావు రాజీనామా పత్రంతో రెడీగా ఉండాలని బీఆర్‌ఎస్‌ నేత, ఎమ్మెల్యే హరీశ్‌రావును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘ఇచ్చిన మాట ప్రకారం నేను రైతు రుణమాఫీ చేస్తే కేసీఆర్‌, హరీశ్‌రావు అమరవీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాస్తారా? చెప్పిన గడువులోపు రుణమాఫీ చేయలేకపోతే ముక్కు నేలకు రాయడానికి నేను సిద్ధం’ అని సీఎం సవాల్‌ విసిరారు.

తల్లిని చంపి బిడ్డను బతికించారని, పార్లమెంటు తలుపులు మూసి తెలంగాణ(Telangana) బిల్లు ఆమోదించారని తెలంగాణ ఆవిర్భావాన్ని ప్రధాని మోదీ తప్పుబట్టారని గుర్తు చేశారు. రాష్ట్రంపై మోదీ ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపిందని.. గాడిద గుడ్డు తప్ప ఏమీ ఇవ్వలేదని చెప్పారు. అటువంటి మోదీకి ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.
8వ తేదీకి రైతు భరోసా పూర్తి…
జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో(Kothagudem)జరిగిన జనజాతర సభలో, వనపర్తి జిల్లా కొత్తకోటలో కార్నర్‌ మీటింగ్‌లో, సికింద్రాబాద్‌, ముషీరాబాద్‌ నియోజకవర్గాల పరిధిలో రోడ్‌షోలలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. భద్రాచలం శ్రీరాముడి సాక్షిగా, పాలమూరు జిల్లా దైవం కురుమూర్తి స్వామి సాక్షిగా పంద్రాగస్టు నాటికి రైతుల .2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని చెప్పారు. లేకపోతే తన జన్మ ఎందుకని, ఈ సీఎం పదవి ఎందుకని పేర్కొన్నారు. సిద్దిపేటకు శనిలా పట్టుకున్న శనీశ్వరరావు రాజీనామా పత్రంతో రెడీగా ఉండాలని బీఆర్‌ఎస్‌ నేత, ఎమ్మెల్యే హరీశ్‌రావును ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

‘ఇచ్చిన మాట ప్రకారం నేను రైతు రుణమాఫీ చేస్తే కేసీఆర్‌, హరీశ్‌రావు అమరవీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాస్తారా? చెప్పిన గడువులోపు రుణమాఫీ చేయలేకపోతే ముక్కు నేలకు రాయడానికి నేను సిద్ధం’ అని సీఎం సవాల్‌ విసిరారు. తల్లిని చంపి బిడ్డను బతికించారని, పార్లమెంటు తలుపులు మూసి తెలంగాణ బిల్లు ఆమోదించారని తెలంగాణ ఆవిర్భావాన్ని ప్రధాని మోదీ తప్పుబట్టారని గుర్తు చేశారు. రాష్ట్రంపై మోదీ ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపిందని.. గాడిద గుడ్డు తప్ప ఏమీ ఇవ్వలేదని చెప్పారు. అటువంటి మోదీకి ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.

రిజర్వేషన్లను రద్దు చేస్తామని చెప్పిన వాళ్లను చెప్పుతో కొట్టాలని బీజేపీ నేత బండి సంజయ్‌(Bandi Sanjay) చేసిన వ్యాఖ్యను ప్రస్తావిస్తూ.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుశ్యంత్‌ కుమార్‌ గౌతమ్‌.. తాము మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పారని సీఎం రేవంత్‌ పేర్కొన్నారు. ‘బీజేపీ నేతలు బండి సంజయ్‌, కిషన్‌రెడ్డిలను అడుగుతున్నా. ఇప్పుడు ఎవరిని చెప్పుతో కొట్టాలి?’ అని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బోర్లాపడి బొక్కలు విరిగిన కేసీఆర్‌ను లోక్‌సభ ఎన్నికల్లో చిత్తుగా ఓడించి పూర్తిగా పక్కకు నెట్టాలని రేవంత్‌ పిలుపునిచ్చారు.

గత బీఆర్‌ఎస్‌(BRS) ప్రభుత్వం చేసిన రూ.వేల కోట్ల అప్పులకు ఇప్పుడు తాము వడ్డీలు కడుతూ, అందరికీ పథకాలు అందిస్తున్నామని, ఉద్యోగులకు 1న వేతనాలు అందిస్తున్నామని గుర్తు చేశారు. 9లోపు ఆసరా పింఛన్లు ఇస్తామన్నారు.వందరోజుల్లో తాము పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే, కాంగ్రెస్‌ పార్టీ ఏమి చేయడం లేదని కేటీఆర్‌ అంటున్నారని, ఆయన మంచిగా చీర కట్టుకొని తయారై ఆర్టీసీ బస్సు ఎక్కాలని, ఒకవేళ నిన్ను టికెట్‌ అడిగితే మేమేమీ చేయనట్టేనని సీఎం ఎద్దేవా చేశారు.

జూబ్లీహిల్స్‌ నుంచి యాదగిరిగుట్టకైనా, జూబ్లీహిల్స్‌ నుంచి సిరిసిల్లకైనా, జూబ్లీహిల్స్‌ నుంచి మీ నాన్న సొంత ఊరు చింతమడకకైనా బస్సులో నిన్ను ఒక్కపైసా అడిగితే నా మీద ఒట్టే అని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో(Assembly elections)జంట నగరాల్లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను గెలిపించలేదని, ముషీరాబాద్‌ నుంచి అంజన్‌కుమార్‌ యాదవ్‌ గెలిచి ఉంటే మంత్రి అయ్యేవారని తెలిపారు. రాహుల్‌ గాంధీ, సోనియా, ఖర్గే నాయకత్వంలో ఢిల్లీలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వస్తుందని, దానం నాగేందర్‌ను గెలిపిస్తే కేంద్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించే బాధ్యత తనదని చెప్పారు.

దేశ, రాష్ట్ర రాజకీయాల్లో ఖమ్మం జిల్లా ఒక దిక్సూచి అని, చైతన్యవంతమైన ప్రజలు ఈ జిల్లాలో ఉన్నారని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా రాజకీయాలంటే ఆచితూచి వ్యవహరిస్తానని, ఈ జిల్లా కాంగ్రెస్‌ రాజకీయాల్లో తాను తలదూర్చబోనన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్‌(YS) సీఎంగా ఉన్నప్పుడు.. 23 జిల్లాలకుగాను 22 జిల్లాల వ్యవహారాలను స్వయంగా ఆయనే చూసుకునేవారని, ఖమ్మం జిల్లాను మాత్రం అక్కడి ప్రజాప్రతినిధులకే వదిలిపెట్టేవారని తెలిపారు.

తెలంగాణ వచ్చిన తర్వాత ఖమ్మం జిల్లా ప్రజలు కేసీఆర్‌(KCR) నిజస్వరూపాన్ని ముందే గమనించారని, అందుకే 2014, 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీకి ఒక్క సీటు మాత్రమే ఇచ్చారన్నారు. ఈసారి కూడా ఖమ్మం, మహబూబాబాద్‌ లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యరులను 3 లక్షలకు పైగా మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. ఉంటే ప్రజాసేవలో ఉంటారు, లేదంటే పొలంలో ఉంటారని, వ్యవసాయం గురించి ఆయన కంటే ఎక్కువ ఎవరికి తెలుసని ప్రశంసించారు.

BJP change Constitution