Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

భద్రాద్రి రాముడికి సిరిసిల్ల పట్టుచీర

సిరిసిల్ల పట్టణానికి చెందిన చేనేత కళాకారుడు సీతారాముల కల్యాణానికి చీరను ప్రతి సంవత్సరం ఆనవాయితీగా అందిస్తున్నడు. ఈ క్రమంలోనే వెల్ది హరిప్రసాద్ మరో అద్భుతమైన చీరను తన చేనేత మగ్గంపై

ఆనవాయితీగా అందిస్తున్న నేతన్న
అబ్బురపడుతున్న రామయ్య భక్తులు

ప్రజాదీవెన, భద్రాచలం: సిరిసిల్ల (sircilla) పట్టణానికి చెందిన చేనేత కళాకారుడు సీతారాముల కల్యాణానికి చీరను (saree) ప్రతి సంవత్సరం ఆనవాయితీగా అందిస్తున్నడు. ఈ క్రమంలోనే వెల్ది హరిప్రసాద్ మరో అద్భుతమైన చీరను తన చేనేత మగ్గంపై నేసి అబ్బుర పరిచాడు. చీరపై సీతారాముల కళ్యాణ చిత్రం కనిపించే విధంగా.. అలాగే చీర అంచులో భద్రాద్రి దేవాయాయంలో ఉన్న సీతారాముల ప్రతిరూపాలు, శంకు, చక్ర, నామాలు వచ్చేలా రూపుదిద్దాడు. చీర బార్డర్లో జైశ్రీరామ్ పేరు వచ్చే విధంగా నేశారు.

ఆరు రోజుల పాటు చేనేత మగ్గంపై శ్రమించి ఈ బంగారు, వెండి, జరి పోగు దారాలతో పట్టు చీరను రూపుదిద్దాడు. ఈ చీర బరువు 800 గ్రాములు ఉంటుంది ఇందులో రెండు గ్రాముల బంగారం, 150 గ్రాముల వెండి పట్టు దారాలు ఉన్నాయి. చీర కొంగులో సీతారాముల కళ్యాణం బొమ్మని నేయడం విశేషం. దీన్ని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు అందజేసి (sri rama navami) సీతారాముల కల్యాణానికి చేరవేసేలా చూస్తున్నాడు. గత సంవత్సరం శ్రీరామ నవమికి కూడా పట్టు పితాంబరం చీరను అందించానని చెప్పారు. ప్రతి సంవత్సరం జరిగే శ్రీ సీతా రాములు కళ్యాణ మహోత్సవానికి పట్టు చీర అందించే అవకాశం కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాడు హరి ప్రసాద్.

గతంలో హరి ప్రసాద్ తనకున్న మేధా శక్తిని కూడగట్టుకొని కార్మిక క్షేత్రంలో ప్రయోగాలు చేయడం మొదలుపెట్టాడు. మొదట అగ్గిపెట్టలో ఇమిడే చీర, సూది రంధ్రంలో దూరే చీర నేసి ఆశ్చర్యానికి గురిచేశాడు. అంతటితో ఆగకుండా దేశంలో ఉన్న ప్రముఖ దేశ, విదేశాల ప్రధానుల నేతల ముఖచిత్రాలు, న్యూజిలాండ్ ప్రధానమంత్రి ముఖచిత్రం వేసి ఆ ప్రధానికి పంపించాడు. భారత రత్న క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ పుట్టినరోజు సందర్భంగా సచిన్ భార్య అంజలి ఫోటోలు మగ్గంపై నేసి అందించాడు.

మొన్న దేశంలో జరిగిన జి20 సదస్సు లోగో నేసి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అందించి మన్ననలను పొందాడు. 95 ఏపిసోడ్ మన్ కి బాత్‎లో హరి ప్రసాద్ నేసిన చేనేత ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటి చెప్పారు మోదీ. ఎప్పుడు ఎదో ఒక ప్రయోగం చేస్తూనే ఉంటాడు. బుల్లి మర మగ్గం తయారు చేసి దానిపై వస్త్రాన్ని వేసి అందరినీ ఆశ్చర్యపడేలా చేశాడు.

ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్న హరి ప్రసాద్ సిరిసిల్లకు ఒక బ్రాండ్ ఇమేజ్ ఉండాలనే ఉద్దేశంతో కార్మిక, ధార్మిక జిల్లా అయిన “రాజన్న సిరిపట్టు” అని నామకరణం చేసి రాజన్న సిరి పట్టు అనే బ్రాండ్ మీద దేశ, విదేశాలకు విస్తరించేలా చేశాడు. తెలంగాణ లోనే మొదటి డబుల్ పేటి మర మగ్గం తయారు చేసుకొని అద్భుత ఆవిష్కరణలు చేస్తున్నాడు. దేశ ప్రధాని మన్నలను పొందిన వెల్ది హరిప్రసాద్.. గత సంవత్సరం అయోధ్యలో నిర్మించిన రామ మందిరం ప్రాణ ప్రతిష్ట సందర్భంగా అరుదైన కానుకను అందజేశాడు.

చేనేత మగ్గంపై 20 రోజుల పాటు శ్రమించి బంగారు పట్టు చీర అంచులో అయోధ్య రామ మందిరం, శ్రీ రామ పట్టాభిషేకం, జై శ్రీరామ్, శ్రీరామ్ అంటూ తెలుగులో వచ్చే విధంగా మరో వైపు బార్డర్‎కు జై శ్రీరామ్ అని హిందీలో వచ్చే విధంగా.. చీర కొంగులో సీతా రాముల ప్రతిబింబం, చీరలో రామాయణంలోని 10 ఘట్టాలు నేయడం జరిగిందన్నాడు. ఇందులో రాముడు జన్మించినప్పటి నుండి పట్టాభిషేకం అయ్యే వరకు రామాయణం ఘట్టాలను నేశాడు. ఈ చీర 900 గ్రాములు ఉంటుందనీ ఇందులో 8 గ్రాముల బంగారం, 10 గ్రాముల వెండి పట్టు దారాలతో మగ్గంతో తయారు చేశాడు. ప్రభుత్వం మరింత చొరవ తీసుకుని చేనేత కళాకారులను అదుకొని ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నాడు.