కన్నుల పండుగగా సీతారాముల కల్యాణోత్సవం
కళ్యాణం, కమనీయం అంటూ శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో శ్రీ సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది.
రాష్ట్ర వ్యాప్తంగా రామనామస్మ రణoతో కోలాహలం
భక్తులతో పులకించిన భద్రాచలం, నల్లగొండ రామాలయం
పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎస్ శాంతికుమారి, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్
భక్తులతో కలిసి కల్యాణాన్ని చూ సిన డిప్యూటీ సీఎం భట్టి దంపతు లు, మంత్రులు పొంగులేటి, సురేఖ, నల్లగొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి
రేపు సీతారాముల మహా పట్టాభి షేక మహోత్సవం
ప్రజా దీవెన, భద్రాచలం: కళ్యాణం, కమనీయం అంటూ శ్రీరామ నవమి (Sri rama navami) సందర్భంగా భద్రాచలంలో శ్రీ సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. కన్నుల పండుగగా జరిగిన కళ్యాణో త్సవాన్ని భక్తులు కల్లారా వీక్షించి పులకించిపోయారు. భక్తుల జయజయధ్వానాల నడుమ అభిజిత్ లగ్నంలో కల్యాణ క్రతు వును వేదపండితులు పూర్తిచేశారు. భద్రాచలం(bhadrachalam) పుర వీధులతో పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాలు శ్రీరామ నామస్మరణతో మార్మోగాయి.
భద్రాచలంలో జరిగిన ఈ వేడుకలకు తెలంగాణ ప్రభుత్వం తరఫున సీఎస్ శాంతికుమారి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. కల్యాణాన్ని తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివ చ్చారు. అభిజిత్ ముహూ ర్తాన జగదానంద కారకుడు, దశరతా త్మజుడు జనక మహారాజు కుమార్తె సీతాదేవి మెడలో తాళి కట్టారు. ఏపీ, తెలం గాణ నుంచి సీతారాము ల కల్యా ణం చూసేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు. కల్యాణ మహోత్సవంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క దంపతులు, మం త్రులు కొండా సురేఖ, పొంగు లేటి శ్రీనివాస్ రెడ్డి, మహబూబా బాద్ ఎంపీ మాలోత్ కవిత, భద్రాచలం, పినపాక ఎమ్మెల్యేలు తెల్లం వెంక ట్రావు, పాయం వెంకటేశ్వ ర్లు తదితరులు పాల్గొన్నారు.
ఇదిలే ఉండగా రెండో భద్రాద్రిగా పేరుగాంచిన నల్లగొండ రామగిరి రామాలయంలో రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భక్తులతో కలిసి సీతారాముల కళ్యాణాన్ని వీక్షించారు. కాగా భద్రాచలంలో శ్రీసీతా రాముల కల్యాణం వీక్షణం అశ్వమేధ యాగంతో సమానం అని వేదాలు చెబుతున్నాయి. అందుకే మండుటెండలను సైతం లెక్క చేయకుండా దేశ, విదేశాల నుంచి భక్తులు ఈ వేడుకను కనులారా తిలకించేందుకు భద్రాచలం వచ్చారు. త్రిదండి రామానుజ చిన జీయర్, శృంగేరీ శారదాపీఠాధీ శ్వరులు స్వరూపానందేంద్ర సరస్వతి, భక్తరామ దాసు వారసులు, టీటీడీ తరుపున సీతారాములకు మర్యాదలు అందాయి. జస్టిస్ హరనాథ్, జస్టిస్ సుమంతి, ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్ కూడా స్వామి వారికి పట్టు వస్త్రా లు సమర్పించారు. ముందుగా ఉదయం గర్భగుడిలో ధృవ మూర్తులకు కల్యాణం జరిగింది.
అనంతరం స్వామిని కోలాటాలు, భక్తుల రామనామ స్మరణలు, వేదపండి తుల మంత్రోచ్చరణల నడుమ మిథిలా స్టేడియానికి తీసుకొచ్చారు. ముందుగా మండ పాన్ని శుద్ధి చేశారు. తర్వాత రజిత సింహాసనంపై సీతారా ములను వేంచేబు చేయించి కల్యాణ క్రతువును ప్రారంభించారు. రామదాసు చేయించిన ఆభర ణాలను అలంకరించారు. అభి జిత్లగ్నంలో జీల కర్ర బెల్లం వేడుక జరిగింది. భక్తుల జయ జయ ధ్వానాలు, రామనామ స్మరణల మధ్య తలంబ్రాల వేడుక అత్యంత వైభవంగా జరిగింది.
ఈ వేడుకల అనంతరం తిరుగు ప్రయాణంలో భక్తులు బస్సుల్లో కల్యాణ తలం బ్రాలు తీసుకున్నారు. దారిపొడ వునా తలంబ్రాల కౌంటర్లు ఏర్పాటు చేసి భక్తులకు తలంబ్రాలను ఉచితంగా దేవస్థానం పంపిణీ చేసింది. భక్తులకు తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లతో పాటు వడదెబ్బ తగలకుండా ఓ ఆర్ ఎస్ ప్యాకెట్ లను అందజేశారు. దేవస్థానంతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు అన్నదానం చేసి భక్తుల మన్ననలు పొందాయి. కల్యాణాన్ని ఎండో మెంట్ కమిషనర్ హన్మంతరావు, కలెక్టర్ ప్రియాంక ఆల, ఎస్పీ రోహిత్ రాజ్, పలువురు జడ్జిలు వీక్షిం చారు. గురువారం మిథిలాస్టేడి యంలో జరిగే మహాపట్టాభిషేకం మహోత్సవంలో గవర్నర్ రాధాకృష్ణ న్ స్వామికి పట్టువస్త్రాలు సమర్పిం చనున్నారు.
Sri rama navami celebrations in Bhadradri