మంచిర్యాల: ఓ కానిస్టేబుల్ ఇద్దరు కుమారులను ఈతకొట్టేందుకు స్విమ్మింగ్ పూల్ తీసుకెళ్లాడు. కానిస్టుబుల్ ఈతకొడుతుండగా బిపి పెరిగి అతడు మృతి చెందిన సంఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పంజాల సతీశ్ గౌడ్ అనే కానిస్టేబుల్ మంచిర్యాల పోలీస్ స్టేషన్లలో బ్లూకోర్ట్ గా విధులు నిర్వహిస్తున్నాడు. అతడు భార్య స్వప్న, ఇద్దురు కుమారులు యశ్వంత్(12), వేయన్ లతో(10) కలిసి ఉంటున్నాడు. సమ్మర్ కావడంతో తన ఇద్దరు కుమారులతో కలిసి పలుమార్లు సింగరేణిలోని స్విమ్మింగ్ పూల్ లో ఈతకు వెళ్తున్నాడు.
ఆదివారం స్విమ్మింగ్ చేస్తుండగా బిపి పెరగడంతో నీటిలో మునిగిపోయాడు. అక్కడి ఉన్నవారు గమనించి అతడిని నీటలో నుంచి బయటకు తీశారు. ప్రథమ చికిత్స చేసి అనంతరం ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయాడని తెలిపాడు. మరణ వార్త తెలియగానే కానిస్టేబుల్ స్వగ్రామం గద్దెరాగడిలో విషాదచాయలు అలుముకున్నాయి. కళ్ల ముందే కన్నతండ్రి చనిపోవడంతో కుమారులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కానిస్టేబుల్ చనిపోయాడని తెలియగానే డిసిపి అశోక్ కుమార్ , పోలీస్ అధికారులు ఆస్పత్రి చేరుకొని నివాళులర్పించారు.
Constable dead with bp in mancherial