SSC Result: పది ఫలితాల్లో ఎస్.వీ.ఎన్ ప్రభంజనం
పది ఫలితాల్లో యాదగిరిగుట్ట పట్ట ణంలోని ఎస్.వీ.ఎన్ లో మరో సారి 100% ఫలితాలు నమోదయ్యా యి.
ప్రజా దీవెన, యాదగిరిగుట్ట: పది ఫలితాల్లో యాదగిరిగుట్ట(Yadagirigutta)పట్ట ణంలోని ఎస్.వీ.ఎన్ లో మరో సారి 100% ఫలితాలు నమోదయ్యా యి. పదవ తరగతి పరీక్ష రాసిన ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించడం ద్వారా గుట్ట మండలంలోనే నంబర్ వన్ విద్యాసంస్థగా ఫలితాలు నిరూపించాయి. గత 20 సంవత్స రాలుగా పరీక్ష రాసిన ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించి సరికొత్త రికార్డు(Record)ను నమోదు చేశారు.
ఈ సంవత్స రం కూడా బెస్ట్ అవైలబుల్ స్కీమ్(Best Available Scheme)లో ఉచితంగా విద్యను అభ్యసి స్తున్న మాలోతు మురారి 9.7/10 జీ.పీ.ఏ సాధించి గుట్ట మండలంలో ఒక గిరిజన విద్యార్థి టాపర్ గా నిలబడటం పట్ల హర్షం వ్యక్తమవు తోంది. మట్టిలోని మాణిక్యాలను వెలుగులోకి తీసుకు వస్తున్న ఎస్.వీ.ఎన్(S.V.N) యాజమాన్యాన్ని కూడా పలువురు అభినందించారు.
మాలోతూ జస్వంత్ 9.5, ముక్కేర్ల శివాణి 9.5, నార అంబిక 9.3, తాడూరి కౌశిక్ 9.2, నమిల నర్సింగ్ రావు 9.2, గుగులోతు గౌరీ 9.2, మిట్ట ఉజ్వల 8.7, పల్లెపాటి స్ఫూర్తి 8.7, తడక జస్వంత్ 8.5, దొడ్డి రోహిత్ కళాధర్ 8.5, కొడిమ్యాల అలేఖ్య 8.2, కునుసోతు సిద్ధార్థ, మేఘావత్ జనార్ధన్ 7.5, కంబాల మనోజ్ కుమార్ 7.3, కొమ్మరాజుల చరణ్ 7.0, అమీల్ సంజన 6.8, శివరాత్రి అఖిల్ 6.8, ఇంజ సందీప్ 6.7 సాధించారు.
మాలోతు మురా రి(Malotu Murari)కి అభినందనలు యాదగిరిగుట్ట ఎస్.వీ.ఎన్ రెసిడెన్షియల్ హైస్కూల్ లో పదవ తరగతి టాపర్గా నిలిచిన మాలోతు మురారిని శాలువా జ్ఞా పిక అందజేసి ఘనంగా సన్మా నించారు. ఎస్.వీ.ఎన్ ఫౌండర్ గొట్టిపర్తి భాస్కర్, ప్రిన్సిపాల్ గొట్టిపర్తి మాధురి, డైరెక్టర్ గొట్టిపర్తి వృతిక్, ఉపాధ్యాయులు మురారిని ఘనంగా సన్మానించారు. ఈ సం దర్భంగా అభినందనలు తెలిపారు.
బెస్ట్ అవైలబుల్ స్కీమ్ లో విద్యను అభ్యసిస్తున్న తుర్కపల్లి మండలం గోగుల గుట్ట తండాకు చెందిన మాలోతు రాజేష్ సోదరుడైన మాలోతు మురారి పట్టుదలతో చదివి పాఠశాల టాపర్ గా నిలి చాడు. ఈ సందర్భంగా మాలోతు రాజేష్ తన తమ్ముడు మాలోతు మురారి మంచి మార్కులతో ఉత్తీర్ణ సాధించినందుకు పాఠశాల యాజ మాన్యాన్ని ఉపాధ్యాయు లను కూడా ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేసి హర్షం వ్యక్తం చేశారు.
100 percentage results in NVS