Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

AP Voters: తిరుగు ప్రయాణంలో తికమక

తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న వారందరూ హైదరాబాద్‌కు తిరుగు పయనo లో తికమక పడ్డారు.

ప్రజా దీవెన, చౌటుప్పల్‌: తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో(Parliament elections) ఓటు హక్కు వినియోగించుకున్న వారందరూ హైదరాబాద్‌కు తిరుగు పయనo లో తికమక పడ్డారు. సొంతూళ్లకు వెళ్లిన ప్రజలు ఓట్లు వేసిన తర్వాత సోమవారం సాయం త్రం నుంచి హైదరాబాద్‌ కు వెనుది రిగే ప్రయాణంలో అపసోపాలు పడాల్సి వచ్చింది. ఓట్ల కోసం ఆంధ్రకు వెళ్లిన వారంతా ఒకే సమయంలో తిరుగు ప్రయాణం కావడంతో హైదరాబాద్‌, విజయ వాడ జాతీయ రహదారిపై వాహ నాల రద్దీ పెరిగింది.

యాదాద్రి భువ నగిరి జిల్లా చౌటు ప్పల్‌ మండలం పంతంగి టోల్‌ ప్లాజా(Pantangi Toll Plaza) వద్ద అర కిలో మీటరు మేర ట్రాఫిక్‌(Traffic)నిలిచిపో యింది. టోల్‌ గేట(TOLL GATE) దాటడానికి 15 నిమిషాల సమయం పట్టింది. 16 గేట్లకు గాను 10 గేట్ల ద్వారా హైద రాబాద్‌ వైపు వెళ్లే వాహనాలను పంపుతున్నారు. సాధారణ రోజుల్లో నిత్యం 30 నుంచి 35 వేల వాహనా లు రాకపోకలు సాగిస్తుంటాయి. సోమవారం 45 వేల వాహనాలు హైదరాబాద్‌ వైపు వెళ్లినట్లు టోల్‌ గేట్‌ సిబ్బంది తెలిపారు. అర్ధరాత్రి వరకు వాహనాల రద్దీ కొనసాగింది. బస్సుల కోసం ప్రజలు బస్టాప్‌లవద్ద గంటల తరబడి ఎదురు చూడాల్సి వచ్చింది.

AP voters come back to Hyderabad